Brahmamudi May13th Episode: అత్త ఛాలెంజ్‌కు కావ్య సై - భార్య‌కు రాజ్ క్లాస్ - ఓట‌మితో ల‌గేజీ స‌ర్ధేసుకున్న రుద్రాణి-brahmamudi may13th episode kavya challenges with aparna about baby ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May13th Episode: అత్త ఛాలెంజ్‌కు కావ్య సై - భార్య‌కు రాజ్ క్లాస్ - ఓట‌మితో ల‌గేజీ స‌ర్ధేసుకున్న రుద్రాణి

Brahmamudi May13th Episode: అత్త ఛాలెంజ్‌కు కావ్య సై - భార్య‌కు రాజ్ క్లాస్ - ఓట‌మితో ల‌గేజీ స‌ర్ధేసుకున్న రుద్రాణి

Nelki Naresh Kumar HT Telugu
May 13, 2024 07:24 AM IST

Brahmamudi May13th Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో అప‌ర్ణ‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా అడ్డుకుంటుంది కావ్య‌. బిడ్డ త‌ల్లిని తీసుకొచ్చి అత్త ముందు నిల‌బెడ‌తాన‌ని ఛాలెంజ్ చేస్తుంది. కావ్య చేసిన ఛాలెంజ్‌పై రాజ్ ఫైర్ అవుతాడు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi May13th Episode: రాజ్ నిజం చెప్ప‌క‌పోవ‌డంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది అప‌ర్ణ‌. అత్త‌య్య ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఆప‌డానికి ఆమెతో వాద‌న‌కు దిగుతుంది కావ్య‌. ఏం సాధించి ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోతున్నార‌ని అత్త‌పై ఫైర్ అవుతుంది. కావ్య మాట‌ల‌కు ధీటుగా అప‌ర్ణ బ‌దులిస్తుంది..నిజాన్ని బ‌య‌ట‌పెట్టే శ‌క్తి నీకు ఉందా అని కోడ‌లిని ప్ర‌శ్నిస్తుంది. అప‌ర్ణ అడిగిన ప్ర‌శ్న‌కు ఏం బ‌దులివ్వాలో తెలియ‌క కావ్య‌ మౌనంగా ఉంటుంది.

బిడ్డ త‌ల్లిని తీసుకొస్తావా...

ఏ నిజం బ‌య‌ట‌కు రాలేద‌ని, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డానో..ఆ నిజం బ‌య‌ట‌పెట్టి...బిడ్డ త‌ల్లిని అంద‌రి ముందు నిల‌బెడ‌తావా అని కావ్య‌తో ఛాలెంజ్ చేస్తుంది అప‌ర్ణ‌. అప్పుడే తాను ఇంట్లో ఉంటాన‌ని అప‌ర్ణ అంటుంది. అత్త ఛాలెంజ్‌కు కావ్య అంగీక‌రిస్తుంది.

ఆ బిడ్డ త‌ల్లిని తాను తీసుకొస్తాన‌ని చెబుతుంది. ఆ బిడ్డ త‌ల్లిని అజ్ఞాతం ముందు నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చి మీ ముందు నిల‌బెడ‌తాన‌ని అప‌ర్ణ‌కు మాటిస్తాడు. ఆమె మాట‌ల‌తో రాజ్‌, సుభాష్ షాక‌వుతారు.

రాజ్ ఫైర్‌...

బిడ్డ త‌ల్లిని తీసుకొస్తాన‌ని కావ్య‌...అప‌ర్ణ మాట ఇవ్వ‌డం రాజ్ స‌హించ‌లేక‌పోతాడు. ఏం మాట ఇచ్చావో నాకు అర్థ‌మ‌వుతుందా అంటూ ఫైర్ అవుతాడు. అమ్మ‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించ‌కుండా ఇలాగేనా ఆపేది కోప్ప‌డ‌తాడు. బిడ్డ త‌ల్లిని ఎలా తీసుకొస్తావ‌ని, అస‌లు అది జ‌రిగే ప‌నేనా అంటూ కావ్య‌కు క్లాస్ పీకుతాడు రాజ్‌..ఇంట్లో నుంచి బిడ్డ‌ను తీసుకొని సోలోగా వెళ్లిపోవ‌డానికి ఎలా రెడీ అయ్యారు...

ఇంట్లో మీకు భార్య ఉంద‌ని, ఏడాది క్రితం ఆమె మెడ‌లో తాళిక‌ట్టాన‌ని, బ్ర‌హ్మ‌ముడి ప‌డింద‌ని గుర్తురాలేదా? భ‌ర్త‌పై రివ‌ర్స్ ఎటాక్ చేస్తుంది కావ్య‌. న‌న్ను వ‌దిలేసి వెళ్లిపోయే హ‌క్కు మీకు ఎవ‌రిచ్చారు? అప్ప‌టికి మీరు వెళ్లాల్సివ‌స్తే మీ వెనుకే నేను వ‌స్తాన‌ని అంద‌రి ముందు చెప్పాను. అయినా ఏం అనుకొని మీ దారిన మీరు వెళ్లారు అంటూ భ‌ర్త‌ను ప్ర‌శ్నిస్తుంది. ఆమె అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌...నేను అడిగేది ఏంటి? నువ్వు అడిగేది ఏంటి కావ్యలోని త‌ప్పుల్ని ఎత్తిచూప‌డం మొద‌లుపెడ‌తాడు రాజ్‌.

మ‌రో దారి లేక‌...

మీ అమ్మ‌గారిని ఆప‌డానికి మ‌రో దారిలేక ఇలా చేశాన‌ని, అప‌ర్ణ‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా మీ ఇంట్లోవాళ్లు ఒక్క‌రైనా ఆప‌గ‌లిగారా అంటూ రాజ్‌తో అంటుంది కావ్య‌. నువ్వు ఆ బిడ్డ త‌ల్లిని తీసుకొస్తే ఏమ‌వుతుందో తెలుసా అంటూ రాజ్ నిజం బ‌య‌ట‌పెట్ట‌బోయి ఆగిపోతాడు. మీరు ఎన్నైనా చెప్పండి బిడ్డ త‌ల్లిని తాను తీసుకొస్తాన‌ని భ‌ర్త‌తోఅంటుంది కావ్య‌.

నువ్వు మా ఇంటి విష‌యాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ‌ని కావ్య‌తో కోపంగా అంటాడు రాజ్‌. రుద్రాణి, రాహుల్‌లా ప్రేక్ష‌కురాలిగా నిల‌బ‌డ‌టం నాకు చేత‌కాద‌ని రాజ్‌కు స‌మాధాన‌మిస్తుంది కావ్య‌. మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతే ప‌ర‌వాలేదా? ఆమెను ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా ఆపేవారా అంటూ రాజ్‌ను అడుగుతుంది.

ఆమెను ఆప‌క‌పోగా...నాపై అరుస్తున్నారు...నాకు రెస్పెక్ట్ ఇవ్వ‌డం నేర్చుకొండి రాజ్‌తో అంటుంది కావ్య‌. భార్య తో వాదించ‌లేక మౌనంగా ఉంటాడు రాజ్‌. కావ్య అనుకుంటే త‌ప్ప‌కుండా బిడ్డ త‌ల్లిని తీసుకొస్తుంద‌ని, ఆ ప‌ని చేయ‌కుండా ఆమెను ఎలాగైనా ఆపాల‌ని రాజ్ అనుకుంటాడు.

సుభాష్ షాక్‌...

త‌న రూమ్ నుంచి కావ్య బ‌య‌ట‌కు రాగానే అక్క‌డ సుభాష్ క‌నిపిస్తాడు. అప‌ర్ణ‌కు నిజం చెప్ప‌బోతుంటే ఎందుకు ఆపావ‌ని కావ్య‌ను అడుగుతాడు. మీరు చెప్ప‌బోయే నిజం ఏమిటో నాకు తెలుసు అని కావ్య అంటుంది. ఆమె మాట‌ల‌తో సుభాష్ షాక‌వుతాడు. మీరు నిజం చెప్ప‌డం వ‌ల్ల జ‌రిగే అనర్థాల‌ను ఆపాడానికే అలా చేశాన‌ని అంటాడు. ఆ నిజం అప‌ర్ణ‌కు తెలిసి ఉంటే ఏం జ‌రిగేదే మీకు తెలుసు అని సుభాష్‌తో అంటుంది కావ్య.

మీరు మాట్లాడ‌బోతుంటే ఆపినందుకు క్ష‌మించ‌మ‌ని సుభాష్‌కు చెబుతుంది కావ్య‌. నాకు ఈ విష‌యం గురించి మీతో మాట్లాడ‌టానికి ఇబ్బందిగానే ఉంది...కానీ నిజం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఆపినందుకు...అత్త‌య్య‌కు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చేసినందుకు మాత్రం సంతోషంగానే ఉంద‌ని కావ్య అంటుంది.

కానీ నిజం దాచ‌డం వ‌ల్ల నీకు ప‌రీక్ష‌లు ఎదుర‌వుతాయిగా అని కావ్య‌తో అంటాడు సుభాష్. ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచే నాకు ప‌రీక్ష‌లు ఎదుర‌వుతున్నాయ‌ని, ఇవ‌న్నీ నాకు కొత్త కాద‌ని కావ్య బ‌దులిస్తుంది.

రాహుల్ డైలామా…

అప‌ర్ణ‌ను ఎలాగైనా బ‌య‌ట‌కు పంపించాల‌ని రుద్రాణి అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్ మొత్తం రివ‌ర్స్ చేయ‌డంతో రుద్రాణి స‌హించ‌లేక‌పోతుంది. కోపంతో ఉన్న ఆమె ముందుకు ల‌గేజీ బ్యాగ్‌ల‌తో రాహుల్ వ‌స్తాడు. ఇంట్లో నుంచి ప‌ర్మినెంట్‌గా వెళ్లిపోదామ‌ని అంటాడు. అత్త‌య్య‌, రాజ్‌, కావ్య అంద‌రూ ఇంట్లో నుంచి వెళ్లిపోతార‌ని అనుకుంటే...ఒక్క‌రూ కూడా వెళ్ల‌లేద‌ని, కావ్య ఉండ‌గా మ‌నం వేసే ప్లాన్స్ ఏవి వ‌ర్క‌వుట్ కావ‌ని త‌ల్లితో అంటాడు రాజ్‌. కావ్య మ‌న‌ల్ని ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్ట‌క‌ముందే మ‌న‌మే వెళ్లిపోదామ‌ని త‌ల్లికి స‌ల‌హా ఇస్తాడు రాహుల్‌

కావ్య చేసిన త‌ప్పు...

కావ్య... వ‌దిన‌ను ఆపి త‌న తెలివితేట‌ల్ని ప్ర‌ద‌ర్శించింది. కానీ త‌న‌కు తెలియ‌కుండానే పెద్ద త‌ప్పు చేసింది. బిడ్డ త‌ల్లిని తీసుకురావ‌డం ఈజీ కాద‌ని, కావ్య త‌న ఛాలెంజ్‌లో నెగ్గ‌క‌పోతే ఇంట్లో నుంచి వెళ్లిపోక త‌ప్ప‌ద‌ని కొడుకుతో అంటుంది రుద్రాణి. అవ‌న్నీ నీ క‌ల‌లు...అది మాత్రం జ‌ర‌గ‌ద‌ని రాహుల్ చిరాకుగా అంటాడు. ఇప్ప‌టివ‌ర‌కు వేసిన ప్లాన్స్‌లో ఒక్క‌టి కూడా స‌క్సెస్ కాలేద‌ని, ఏడుపు ముఖాల‌తో మిగ‌డ‌టం త‌ప్ప ఏం చేయ‌లేక‌పోతున్నామ‌ని రాహుల్ అంటాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డం ఖాయం...

ఇన్నాళ్లు వేరు..ఇప్పుడు వేరు...ఈ సారి మాత్రం కావ్య ఓడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని రుద్రాణి అంటుంది. బిడ్డ త‌ల్లిని కావ్య తీసుకొస్తే ఇంట్లో సునామి వ‌స్తుంది. తీసుకురాక‌పోతే కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. రెండింటిలో ఏది జ‌రిగినా కావ్య కే న‌ష్టం ఎక్కువ‌ని రుద్రాణి అంటుంది.

ఇందిరాదేవి కోపం…

బిడ్డ త‌ల్లిని తీసుకొస్తాన‌ని అప‌ర్ణ‌కు మాట ఇచ్చిన కావ్య‌పై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. బిడ్డ త‌ల్లిని తీసుకొస్తే నీ కాపురం ఏమ‌వుతుంది, నీకు స‌వ‌తిని నువ్వే తీసుకొస్తావా అంటూ కావ్య‌ను కోప్ప‌డుతుంది. నీ మంచిత‌నాన్ని చూసి సంతోష‌ప‌డాలా...ముందుచూపు లేక‌పోవ‌డం కోప్పాడాలా తెలియ‌డం లేద‌ని ఇందిరాదేవి.

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం...

పాతికేళ్లుపెంచిన కొడుకును వ‌దిలిపెట్ట‌డానికే అప‌ర్ణ న‌ర‌కం అనుభ‌విస్తుంది. . అలాంటిది నెల‌ల బిడ్డ‌ను వ‌దిలిపెట్టి ఆ త‌ల్లి ఎలా ఉంటుంది. నిజంగా రాజ్ త‌ప్పు చేస్తే. ఆ త‌ల్లి బిడ్డ‌తో పాటు వ‌చ్చి ఇంట్లోవాళ్ల‌ను నిల‌దీసేది అని ఇందిరాదేవి అంటుంది. త‌న‌కు తెలియ‌కుండానే కావ్య ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ఇందిరాదేవి స‌ల‌హా ఇస్తుంది. ఆ బిడ్డ‌కు త‌ల్లికి దూరంగా ఉంటుందంటే దాని వెనుక ఏదో ర‌హ‌స్యం ఉంద‌ని అనుకుంటుంది. అదేదో తెలుసుకోవాల‌ని ఫిక్స‌వుతుంది.

అనామిక ప్లాన్ ఫెయిల్‌...

క‌ళ్యాణ్‌ను గొడ‌వ‌ల‌తో కాకుండా ప్రేమ‌లో బుట్ట‌లో వేసుకోవాల‌ని అనామిక అనుకుంటుంది. ప్రేమ‌ను న‌టిస్తూ క‌ళ్యాణ్‌ను త‌న దారిలోకి తెచ్చుకొని తండ్రికి అవ‌స‌ర‌మైన డ‌బ్బును స‌ర్ధుబాటు చేయాల‌ని ఫిక్స‌వుతుంది. కానీ ఆమె ప్లాన్ వ‌ర్క‌వుట్ కాదు. అనామిక‌కు చూడ‌గానే చిరాకు ప‌డ‌తాడు క‌ళ్యాణ్‌. ఆమెను దూరం పెడ‌తాడు.

కావ్య అన్వేష‌ణ‌...

మ‌రోవైపు బిడ్డ త‌ల్లి విష‌యంలో త‌న‌కున్న సందేహాల‌ను సుభాష్‌తో చెబుతుంది కావ్య‌. డ‌బ్బు కోస‌మే మె బిడ్డ‌ను మాయ మ‌న ఇంటికి పంపించింద‌ని కావ్య‌తో అంటాడు సుభాష్. రెండు రోజుల క్రిత‌మే మాయ అకౌంట్‌లో డ‌బ్బు వేశాన‌ని చెబుతాడు. ఆ ఆకౌంట్ తాలూకు అడ్ర‌స్ ద్వారా మాయ‌ను క‌లిసి నిజానిజాలు తెలుసుకోవాల‌ని కావ్య ప్ర‌య‌త్నిస్తుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point