Brahmamudi March 21st Episode: క‌న్న కొడుకును ప‌రిచ‌యం చేసిన రాజ్‌ - కావ్య‌కు షాక్ - దుగ్గిరాల ఫ్యామిలీ ప‌రువు పాయే!-brahmamudi march 21st episode raj reveals truth about his son kavya shocks brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi March 21st Episode Raj Reveals Truth About His Son Kavya Shocks Brahmamudi Today Episode

Brahmamudi March 21st Episode: క‌న్న కొడుకును ప‌రిచ‌యం చేసిన రాజ్‌ - కావ్య‌కు షాక్ - దుగ్గిరాల ఫ్యామిలీ ప‌రువు పాయే!

Nelki Naresh Kumar HT Telugu
Mar 21, 2024 07:08 AM IST

Brahmamudi March 21st Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లో మ్యారేజీ యానివ‌ర్స‌రీకి ఓ చిన్నారితో పాటు వ‌స్తాడు రాజ్‌. ఆ బిడ్డ త‌న కొడుకేన‌ని ప్ర‌క‌టిస్తాడు. రాజ్ మాట‌ల‌తో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక‌వుతారు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్

Brahmamudi March 21st Episode: రాజ్, కావ్య‌ల తొలి మ్యారేజీ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తారు. కావ్య‌ను వేదిక వ‌ద్ద‌కు తీసుకొస్తుంది ఇందిరాదేవి. విడాకుల విష‌యంలో రాజ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటాడోన‌ని కావ్య‌తో పాటు క‌న‌కం, కృష్ణ‌మూర్తి భ‌య‌ప‌డుతుంటారు.

అప్పుడే రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. కారులో నుంచి రాజ్ ఓ చిన్నారితో దిగ‌డంతో అంద‌రూ షాక‌వుతారు. రాజ్ ఎత్తుకున్న పాప ఎవ‌రో తెలియ‌క కంగారు ప‌డ‌తారు. రాజ్ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌కు అంద‌రి మైండ్‌బ్లాక్ అవుతుంది. ఎవ‌రు ఈ చిన్నారి అంటూ రాజ్‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు.

రాజ్ మౌనం...

అనాథ బిడ్డ‌లా క‌నిపిస్తున్నాడ‌ని రుద్రాణి అంటుంది. మ‌న ఇంటితో ఎలాంటి సంబంధం లేని బిడ్డ‌ను ఎందుకు తీసుకొచ్చావ‌ని రాజ్‌ను అడుగుతుంది అప‌ర్ణ‌. రాజ్ స‌మాధానం చెప్ప‌కుండా కావ్య‌ను చేయిప‌ట్టుకొని స్టేజ్‌పైకి తీసుకెళ‌తాడు. బిడ్డ గురించి రాజ్ ఏం చెబుతాడోన‌ని అంద‌రూ టెన్ష‌న్‌గా ఎదురుచూస్తుంటారు.

దుగ్గిరాల వార‌సుడు...

ఆ చిన్నారి త‌న కొడుకేన‌ని రాజ్ ప్ర‌క‌టిస్తాడు. త‌న ర‌క్తం పంచుకొని పుట్టిన త‌న‌యుడ‌ని చెబుతాడు. ఆ చిన్నారి ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడ‌ని, దుగ్గిరాల వంశ వార‌సుడిగా పెరుగుతాడ‌ని రాజ్ చెబుతాడు. అత‌డి మాట‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రూ షాక‌వుతారు. కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

అప‌ర్ణ ప్ర‌శ్న‌ల వ‌ర్షం...

రాజ్‌పై అప‌ర్ణ ఫైర్ అవుతుంది. నీకు కొడుకు ఉండ‌టం ఏంటి? అత‌డు ఇక్క‌డే పెర‌గ‌డం ఏంటి? స్పృహ‌లో ఉండే మాట్లాడుతున్నావా అని నిల‌దీస్తుంది. కావ్య‌ను ఏడిపించ‌డానికే ఈ నాట‌కం ఆడుతున్నావా అని రాజ్‌తో అంటుంది అప‌ర్ణ‌. రాజ్ జీవితంలో ఎవ‌రికి తెలియ‌ని చీక‌టి కోణం ఉందంటే నేను న‌మ్మ‌న‌ని ధాన్య‌ల‌క్ష్మి ఎమోష‌న‌ల్ అవుతుంది.

నువ్వు త‌ప్పు చేశావంటే మేము న‌మ్మ‌లేక‌పోతున్నామ‌ని ప్ర‌కాషం కూడా రాజ్‌తో చెబుతాడు. త‌న‌కు కొడుకు ఉండ‌టం అబ‌ద్ధం కాద‌ని, నిజ‌మ‌ని రాజ్ అంటాడు. ఈ చిన్నారి త‌న బిడ్డేన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేస్తాడు.

రుద్రాణి ఎగ‌తాళి...

రుద్రాణి రంగంలోకి దిగుతుంది. ఇన్నాళ్లు నా కొడుకును నేను స‌రిగ్గా పెంచ‌లేద‌ని దుమ్మెత్తిపోశారు. మ‌రి నువ్వు నీ కొడుకు ఇలాగేనా పెంచేది . రాహుల్ త‌ప్పు చేసినా దానిని స‌రిదిద్దుకొని స్వ‌ప్న‌ను పెళ్లిచేసుకున్నాడు. మ‌రి నీ కొడుకు భార్య ఉండ‌గానే మ‌రో ఆడ‌దానిని త‌ల్లిని చేసి ఏకంగా బిడ్డ‌నే ఇంటికి తీసుకొచ్చాడు అంటూ అప‌ర్ణ‌ను అవ‌మానిస్తుంది రుద్రాణి.

పైకి క‌న‌బ‌డ‌ని మాయ‌గాడు నీ కొడుకు అంటూ రాజ్‌ను ఎగ‌తాళి చేస్తుంది. నా కొడుకు మ‌హారాజు అంటూ ఇంకోసారి గొప్ప‌లు చెప్పుకోకూ అప‌ర్ణ దెప్పిపొడుస్తుంది. త‌న పెంప‌కం గురించి రుద్రాణి కించ‌ప‌రిచిన‌ట్లుగా మాట్లాడ‌టం అప‌ర్ణ త‌ట్టుకోలేక‌పోతుంది. నా పెంప‌కానికి మ‌చ్చ తీసుకొచ్చే ప‌ని ఎందుకు చేశావ‌ని నిల‌దీస్తుంది. కావ్య‌కు ఎవ‌రు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు.

ఆమె మ‌న‌సును ఎవ‌రు స‌మాధాన‌ప‌ర‌చ‌గ‌ల‌రు అని రాజ్‌తో అంటాడు సుభాష్‌. ఎవ‌రు ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగినా రాజ్ మాత్రం సెలైంట్‌గానే ఉండిపోతాడు.

అధ‌ర్మానికి ప్ర‌తినిధి....

నువ్వు మా వంశోద్దార‌కుడివ‌ని గ‌ర్వంగా చెప్పుకునేవాడిని. నీకంటే సమ‌ర్థుడు లేడ‌ని విర్ర‌వీగేవాడిని. మీ అంద‌రి న‌మ్మ‌కాన్ని ముక్క‌లు చేసే హ‌క్కు నీకు ఎవ‌రు ఇచ్చార‌ని సీతారామ‌య్య రాజ్‌ను ప్ర‌శ్నిస్తాడు. నువ్వు రాముడిని అనుకున్నాను. కానీ మామూలు మ‌నిషివే అయిపోయావు, అధ‌ర్మానికి ప్ర‌తినిధిలా మారిపోయావ‌ని క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్ అవుతాడు.

నేనే ప్ర‌శ్న‌ను...స‌మాధానం లేదు...

మాకు స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన ప‌ర‌వాలేదు కావ్య‌కు ఏం స‌మాధానం చెబుతావో చెప్ప‌మ‌ని రాజ్‌ను గ‌ట్టిగా అడుగుతుంది ఇందిరాదేవి. నేను ప్ర‌శ్న‌లా మారిపోయాను. నా ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. మీ అంద‌రి ముందు దోషిగా నిల‌బ‌డ్డాను. నా ద‌గ్గ‌ర ప‌రిష్కారం లేద‌ని రాజ్ అంటాడు.

నాతో పాటు నువ్వు కూడా ఓడిపోయ‌వ‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. ఎవ‌రు ఎవ‌రిని ఓదార్చాలో తెలియ‌డం లేద‌ని అంటాడు. అంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. త‌న‌కు కొడుకు ఉన్నాడ‌నే నిజం మాత్రం మార‌ద‌ని చెప్పి స్టేజ్‌పై నుంచి వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిపోగానే క‌న్నీళ్ల‌తో కుప్ప‌కూలిపోతుంది కావ్య‌.

బిడ్డ‌కు త‌ల్లి ఎవ‌రు?

చాలా సేప‌టి త‌ర్వాత కావ్య రూమ్‌లోకి వ‌స్తుంది. వ‌చ్చి రావ‌డంతోనే రాజ్‌పై ఫైర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్ప‌మ‌ని నిల‌దీస్తుంది. స‌ర్ధుకుపోవాలా...విడాకులు ఇచ్చి మీ నుంచి శాశ్వ‌తంగా దూరం కావాలా ఏం చెయాలో చెప్ప‌మ‌ని అడుగుతుంది. మీరు ఎక్క‌డో కాపురం వెల‌గ‌బెట్టి బిడ్డ‌తో డైరెక్ట్‌గా ఇంటికి వ‌చ్చినందుకు మీ కంటే నిజాయితీప‌రుడు లేడ‌ని ఆనంద ప‌డాలా అని రాజ్‌ను నిల‌దీస్తుంది.

నా క‌ళ్ల ముందు భ‌విష్య‌త్తు శూన్యంగా మారింద‌ని, క‌ట్టుకున్న కూడు కూలిపోయింద‌ని కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నా మ‌న‌సులో మెదిలే ప్ర‌శ్న‌ల‌ను ఎవ‌రిని అడ‌గాలి. ఏమ‌ని అడ‌గాలి చెప్ప‌మ‌ని రాజ్‌ను నిల‌దీస్తుంది కావ్య ఎంత అడిగిన రాజ్ స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగానే ఉండిపోతాడు. బిడ్డ క‌న్న‌త‌ల్లి ఎవ‌రు అని రాజ్ ప్ర‌శ్నిస్తుంది కావ్య‌. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point

టాపిక్