Shiva Rajkumar on RC16: ఆశ్చర్యం కలిగింది: రామ్‍చరణ్‍తో సినిమాపై కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్ కామెంట్స్
Shiva Rajkumar on RC16: రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‍లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీ గురించి మాట్లాడారు. బుచ్చిబాబు సానను ప్రశంసించారు.
Shiva Rajkumar on RC16: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.. ఉప్పెన్ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానతో మూవీ (RC16) చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నేడు (మార్చి 20) జరిగాయి. దీంతో అధికారికంగా ఈ చిత్రం మొదలైంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‍కుమార్ ఓ కీలకమైన పాత్ర చేయనున్నారు. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయా..
ఆర్సీ 16 కథను దర్శకుడు బుచ్చిబాబు సాన తనకు నరేట్ చేసినప్పుడు ఆశ్చర్యకలిగిందని ఓ ఇంటర్వ్యూలో శివ రాజ్‍కుమార్ చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ నెక్ట్స్ లెవెల్‍లో ఉందని తెలిపారు. ఈ క్యారెక్టర్‌ను బుచ్చిబాబు ఎలా క్రియేట్ చేసుకున్నారన్న విషయంలో తాను ఆశ్చర్యపోయానని శివ రాజ్‍కుమార్ అన్నారు.
బుచ్చిబాబు తనకు గంటన్నర పాటు ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పారని శివ రాజ్‍కుమార్ వెల్లడించారు. “రామ్‍చరణ్ కొత్త సినిమా స్క్రిప్ట్‌తో బుచ్చిబాబు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను షాక్ అయ్యా. ఇది పూర్తిగా వేరే స్థాయిలో ఉంది. అతడు ఆ క్యారెక్టర్ ఎలా ఇమాజిన్ చేసుకున్నాడో అని ఆశ్చర్యం కలిగింది” అని శివ రాజ్‍కుమార్ చెప్పారు.
రామ్‍చరణ్ అద్భుతమైన నటుడు
రామ్‍చరణ్‍పై కూడా శివ రాజ్‍కుమార్ ప్రశంసలు కురిపించారు. రామ్‍చరణ్ మంచి వ్యక్తి అని, అద్భుతమైన నటుడు అని ఆయన అన్నారు. స్టోరీ చెప్పేందుకు వచ్చిన సమయంలో బుచ్చిబాబు తన వద్ద చేతులు కట్టుకొని నిలబడ్డారని, అయితే డైరెక్టర్ అలా చేయకూడదని తాను చెప్పానని ఆయన తెలిపారు.
రామ్‍చరణ్ - బుచ్చిబాబు కాంబోలో RC16 చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు హైదరాబాద్‍లో జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ కూడా వచ్చారు. ఈ మూవీలో హీరోయిన్‍గా నటిస్తున్న జాన్వీ కపూర్ హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొన్నారు.
RC 16 చిత్రాన్ని వృద్ది సినిమాస్ పతాకంపై సతీశ్ కిలారు నిర్మిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఖరారైనట్టు కూడా రూమర్లు వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ మల్లయోధుడి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తోంది.
రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. ఆర్సీ16 చిత్రీకరణ మొదలుకానుంది.
మార్చి 27వ తేదీన రామ్‍చరణ్ పుట్టిన రోజు ఉంది. ఇందుకు సరిగ్గా వారం ముందు ఆర్సీ16 సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే, మార్చి 27న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రానుంది. మూవీ రిలీజ్ డేట్‍పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.