Brahmamudi March 20th Episode: బ్రహ్మముడి సీరియల్ -కావ్యను భార్యగా ఒప్పుకున్న రాజ్ -అనామికకు అపర్ణ మాస్ వార్నింగ్
Brahmamudi March 20th Episode: కావ్యను తన భార్యగా అంగీకరిస్తాడు రాజ్. జీవితాంతం కావ్యకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. విడాకుల పేపర్స్‌పై సంతకం చేయనని చెబుతాడు. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi March 20th Episode: రాజ్‌లో మార్పు కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నానని ఇందిరాదేవితో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. ఈ ఏడాదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు, కన్నీళ్లతో గడిపిన రోజులు ఉన్నాయని అంటుంది.
రాజ్ మనసులో తన పట్ల ఎప్పటికైనా ప్రేమ కలుగుతుందనే ఇన్నాళ్లు నిరీక్షించినట్లు చెబుతుంది. ఈ రోజు పూజలో కూర్చున్నప్పడు కూడా తనపై ప్రేమ విషయంలో రాజ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదని కంగారు పడుతుంది. అలాంటి ప్రతికూల ఆలోచనలను మనసులో నుంచి తీసేయమని కావ్యకు సర్ధిచెబుతుంది ఇందిరాదేవి.
దుష్టచతుష్టయం...
ధాన్యలక్ష్మి, అనామికతో పాటు రుద్రాణి, రాహుల్ ఓ చోట కూర్చొని మాట్లాడుకోవడం చూసి ప్రకాశం షాకవుతాడు. దుష్ట చతుష్టయం అంత ఒకే చోట కూర్చున్నారని సెటైర్స్ వేస్తాడు. అతడిపై నలుగురు సీరియస్ కావడంతో ఫోన్ వచ్చినట్లుగా నాటకం ఆడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
క్యాటరింగ్ వాళ్లను రమ్మనమని ప్రకాశంకు చెబుతుంది అపర్ణ. కానీ అతడు ఆ విషయం మర్చిపోతాడు. ఇలా అయితే ఎలా అంటూ ప్రకాశాన్ని మందలిస్తుంది అపర్ణ. ఆ సీన్‌ను ధాన్యలక్ష్మి చూపిస్తుంది అనామిక. ఛాన్స్ దొరికితే అపర్ణ...మావయ్యను ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ధాన్యలక్ష్మితో అంటుంది అనామిక.
అనామికకు క్లాస్...
అనామిక మాటలను ఇందిరాదేవి వింటుంది. అనామికకు క్లాస్ ఇస్తుంది. మీ అత్త చెడు అర్థాలు, పెడర్థాలు తీయడంలో సిద్ధహస్తురాలు...కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఆమెను నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావని వార్నింగ్ ఇస్తుంది. ఇందిరాదేవి కూడా మీ నలుగురు దుష్టచతుష్టయంలా ఒకచోట ఎందుకు చేరారని ఇందిరాదేవి అంటుంది. ప్రకాషంతో పాటు ఇందిరాదేవి కూడా దుష్టచతుష్టయం అనే పదం వాడటం చూసి రుద్రాణి కన్ఫ్యూజ్ అవుతుంది. అందరూ తమను అర్థం కానీ భాషలో తిడుతున్నారని వాపోతుంది.
కళ్యాణ్ పొరపాటు...
రాజ్ మ్యారేజీ యానివర్సరీ కోసం కళ్యాణ్ కేక్ తీసుకొస్తాడు. కానీ పొరపాటుగా కేక్‌ను కళ్యాణ్ కిందపడేయడంతో అపర్ణ అతడిపై ఫైర్ అవుతుంది. అపర్ణకు సారీ చెబుతాడు కళ్యాణ్. తన కొడుకుపై అపర్ణ పెత్తనం చెలాయించడం చూసి ధాన్యలక్ష్మి తట్టుకోలేకపోతుంది. అపర్ణపై మాటల దాడికి దిగుతుంది. ఓ చిన్న కేక్ కోసం తన కొడుకును ఎందుకు తిడుతున్నావని నిలదీస్తుంది.
నా భర్త వల్ల ఏదో నష్టం జరిగిందని ఆయనను తిట్టిన విషయాన్ని గుర్తుచేస్తుంది. ప్రతిసారి నా భర్త, కొడుకు ఈమెకు దొరుకుతున్నాం ఈమెకు అంటూ అపర్ణపై ఎగిరిపడుతుంది. చూస్తుంటే ఆమె రాజమాత అయిపోయి...అందరిని సేవకులుగా మార్చాలని అనుకుంటున్నట్లుగా ఉందని ధాన్యలక్ష్మి దెప్పిపొడుస్తుంది. ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి సర్ధిచెప్పబోతుంది.
మీరు పక్షపాతం చూపిస్తున్నారని ఆమె మాటలను పట్టించుకోదు ధాన్యలక్ష్మి. అపర్ణకు మనం బానిసలుగా కనిపిస్తున్నామని, ప్రతిసారి మనలో తప్పులు వెతకడమే పనులు పెట్టుకుందని గొడవ పెద్దది చేస్తుంది అనామిక. ఇలా తప్పులు పడుతుంటే ఇకపై ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మి అంటుంది.
అపర్ణ వార్నింగ్...
షటప్ అంటూ వాళ్ల నోరు మూయిస్తుంది అపర్ణ. తాను తల్చుకుంటే మీ నలుగురిలో ఎవరూ మిగలరని ధాన్యలక్ష్మి, అనామికతో పాటు రాహుల్, రుద్రాణిలకు వార్నింగ్ ఇస్తుంది. నేను యుద్దభేరి మోగిస్తే కురుక్షేత్రం మొదలవుతుందని హెచ్చరిస్తుంది. బీ కేర్ ఫుల్ అంటూ అనామికను పిలిచి హెచ్చరిస్తుంది. ఆమె వార్నింగ్‌లకు భయపడి రాహుల్, రుద్రాణి అక్కడి నుంచి తోకముడుస్తారు. అనడానికి అర్హత ఉండాలి. ప్రతిసారి మీ అర్హత మర్చిపోతున్నారని కళ్యాణ్ కూడా అపర్ణను వెనకేసుకొని వస్తాడు.
రాజ్ ఆలోచనలు...
కావ్య తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం రాజ్ జీర్ణించుకోలేకపోతాడు. విడాకుల గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. కావ్య, రాజ్ మ్యారేజీ యానివర్సరీకి కనకం, కృష్ణమూర్తితో పాటు అప్పు వస్తారు. వారిని చూసి అనామిక, ధాన్యలక్ష్మితో పాటు రుద్రాణి షాకవుతారు. ఇంట్లో అడుగుపెట్టకూడదని చెప్పినా కూడా తన మాటకు విలువలేకుండా అప్పు ఈ వేడుకకు రావడం అనామిక జీర్ణించుకోలేకపోతుంది.
ముగ్గురు కలిసి కనకం, కృష్ణమూర్తిలను తమ మాటలతో అవమానిస్తారు. రావడానికి కారణాలు భలే వెతుక్కుంటారు అంటూ దెప్పిపొడుస్తారు. ఇది మా అక్క ఇల్లు...రావాలని అనుకుంటే క్షణం కూడా ఆలోచించమని అప్పు గట్టిగా బదులిస్తుంది.
మనిషికి సిగ్గు, మానం ఉంటే ఆలోచిస్తారు. అవన్నీ వదిలేసిన వారు కారణాల వెతుక్కొని ఇలా ఇంటికివస్తారని ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నా మాటలను లెక్కచేయకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. అనామిక కూడా ఇష్టనుసారం మాట్లాడుతుంది.
అప్పు సమాధానం...
తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం తమకు లేదని అనామికు బదులిస్తుంది అప్పు. అయినా మమ్మల్ని పిలిచింది మా బావగారు..ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాం. ఆయన్ని కాదనే ధైర్యం ఎవరికి లేదని అప్పు అంటుంది. కావ్య మంచితనం ముసుగులో, స్వప్న పెంకితనం ముసుగులో..ఇక అప్పు మగరాయుడి ముసుగులో భటే నాటకాలు ఆడుతున్నారని ధాన్యలక్ష్మి సెటైర్ వేస్తుంది. మీ నాటకాల ముందు మేము ఆడే నాటకాలు చిన్నవే అంటూ ధాన్యలక్ష్మికి గట్టిగా రిప్లై ఇస్తుంది అప్పు.
అనామిక అసహనం...
అప్పుడే అక్కడకు వచ్చిన కళ్యాణ్...అప్పుతో పాటు కనకం, కృష్ణమూర్తిలను తానే స్వయంగా లోపలికి తీసుకెళతాడు. కావ్య వదిన పుట్టింటివారికి మర్యాదలు చేయడం మన బాధ్యత అని అనామిక, ధాన్యలక్ష్మిలకు చెబుతాడు. తన కళ్ల ముందే అప్పు, కళ్యాణ్ క్లోజ్‌గా ఉండటం అనామిక తట్టుకోలేకపోతుంది.
విడాకుల పేపర్స్..
కావ్యను రెడీ చేసి తీసుకొస్తుంది ఇందిరాదేవి. ఒంటినిండా నగలతో అందంగా ముస్తామవుతుంది కావ్య. కూతురును ఆ రూపంలో చూసి కనకం సంబరపడుతుంది. కుందనపు బొమ్మలా ఉందంటూ చెబుతుంది. అందరూ రాజ్ కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. నేరుగా కావ్య దగ్గరకు వచ్చి ఆమె పక్కన నిల్చుంటాడు. రాజ్ నుంచి తాము ఆశించినట్లుగానే పాజిటివ్ రిప్లై వస్తుందని ఇందిరాదేవి, కావ్య అనుకుంటారు. తన పాకెట్‌లో నుంచి విడాకుల పేపర్స్ బయటకు తీస్తాడు. భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆస్తి పత్రాలు రాజ్ తెచ్చాడని రాజ్‌పై రుద్రాణి పంచ్ వేస్తుంది. ఇవి ఆస్తి పత్రాలు కాదని విడాకుల పేపర్స్ అని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాకవుతారు.
నిజం చెప్పిన రాజ్...
మా పెళ్లై ఈ నాటితో ఏడాది పూర్తయిందని, కానీ ఏనాడు మేము ప్రేమను పంచుకోలేదని రాజ్ నిజాలు మొత్తం బయటపెట్టేస్తాడు. మీ అందరి ముందు ప్రేమగా ఉన్నట్లు నటించామని, కానీ గదిలో మాత్రం అపరిచితుల్లానే గడిపామని అంటాడు. కళావతికి నాపై ప్రేమ ఉండేది, నాతోనే జీవితాన్ని పంచుకోవాలని కలలు కన్నది.
కానీ నేను మారతాననే నమ్మకం లేకపోవడంతో విసిగిపోయి ఈ విడాకుల పేపర్స్‌పై సంతకం చేసి తనకు ఇచ్చిందని ఆ పేపర్స్ వెనకున్న కథను చెబుతాడు రాజ్. నన్ను మోసం చేసి పెళ్లిచేసుకుందనే అక్కసుతో ఈ కాపురం వద్దు అని కావ్య అనుకునేలా చేసింది నేనే అని రాజ్ అసలు నిజం చెబుతాడు. నేను చేసే సంతకంతో మేము విడిపోతామని తెలుసునని అంటాడు.
కావ్యను భార్యగా అంగీకరించిన రాజ్...
ఈ విడాకుల కాగితాలపై తాను సంతకం చేయనని రాజ్ అంటాడు. అతడి మాటలతో కావ్య ఆనందం పట్టలేకపోతుంది. తాను ఎప్పటికీ కావ్యకు విడాకులు ఇవ్వనని రాజ్ చెబుతాడు. కావ్య కళ్ల ముందే ఆ పేపర్స్ చించేస్తాడు. నీ ఓర్పు, ప్రేమ, సంకల్పం నన్ను ఒడించాయని, ఖాళీ చేతులతో నీ ముందు నిలబెట్టాయని రాజ్ అంటాడు. ఇప్పుడు నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను...మనిద్దరని ఏ శక్తి విడదీయలేదని రాజ్ అంటాడు. నిన్నటి దాక జరిగింది గతం, నేటి నుంచి జరుగుతుంది నిజం అని చెబుతాడు.
జీవితాంతం తోడుగా...
కావ్యకు తన లవ్‌ను ప్రపోజ్ చేస్తాడు. జీవితాంతం నాకు తోడుగా నీడుగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఇదే మన నిజమైన పెళ్లి రోజు అని చెబుతాడు. మన కొత్త కాపురానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడుదామని చెప్పి కావ్య చేతికి రింగ్ తొడుగుతాడు. కావ్య చేతిపై ముద్దు పెడతాడు.
కావ్య కలలు...
ఒక్కసారిగా ఇందిరాదేవి గట్టిగా నెట్టివేయడంతో కలలో నుంచి కావ్య బయటకు వస్తుంది. ఇప్పటివరకు తాను కన్నది కల అని తెలియడంతో నిరాశపడుతుంది. కలలో కాదు నిజంగానే రాజ్‌లో మార్పు వస్తుంది ఇందిరాదేవి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.