Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో-bigg boss telugu 8 day 2 promo heated argument between nikhil and seetha during nominations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో

Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 03, 2024 05:31 PM IST

Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్‍బాగ్ 8వ సీజన్‍లో తొలి నామినేషన్ల ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది. ఇది ఫుల్ హీట్‍గా జరగనుందని అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోలు వచ్చేశాయి. ప్రోమోలో ఏముందంటే..

Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో
Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో రెండో రోజు నామినేషన్ల హాట్‍హాట్‍గా జరగనున్నాయి. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు జోరుగా ఉండనున్నాయి. ఈ నేటి (సెప్టెంబర్ 3) రెండో రోజు ఎపిసోడ్‍కు సంబంధించిన రెండు ప్రోమోలను స్టార్ మా తీసుకొచ్చింది. నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్లు పోటాపోటీగా వాదనకు దిగినట్టు అర్థమవుతోంది.

మణికంఠ వర్సెస్ నబీల్

బిగ్‍బాస్ 8లో నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన రెండో ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్‍గా సాగింది. నాగ మణికంఠ తీరుపై అభయ్ నవీన్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఈ ప్రోమో మొదలైంది. అందరూ ఓ చోట ఉంటే మణికంఠ ఓ చోట ఉంటాడంటూ నిట్టూర్చారు అభయ్. ఇదే పాయింట్‍ను నామినేషన్లలో నబీల్ అఫ్రిది లేవనెత్తారు.

పాటలు పాడడానికి రాలేదు

మణికంఠను అబీల్ నామినేట్ చేశారు. “ఆయన వచ్చినప్పటి నుంచి ఒక్కడే కూర్చుంటున్నాడు. కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు. ఎక్కువ నాతో మింగిల్ కాలేదు” అని మణికంఠ గురించి నబీల్ చెప్పారు. దీంతో ఒంటరిగా కూర్చొని తాను మాట్లాడుకోవడం లేదని, పాటలు పాడుతున్నానని మణికంఠ చెప్పారు. దీంతో ఇక్కడ మనం పాటలు పాడేందుకు రాలేదని నబీల్ అన్నారు.

కిచెన్‍లో వంట విషయంలో బెజవాడ బేబక్కపై ఆర్జే శేఖర్ బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత శేఖర్‌ను మణికంఠ నామినేట్ చేశారు. శేఖర్‌కు సరైన స్పష్టత లేదని, అయినా తనపై మాట్లాడుతున్నారంటూ మణికంఠ చెప్పారు.

నిఖిల్, సీత మధ్య గొడవ

చీఫ్‍లు నియమితులవటంతో నామినేషన్ల నుంచి నిఖిల్, నైనిక, యష్మి గౌడకు ఉపశమనం దక్కింది. గద్దెపై కూర్చొని నామినేషన్ల ప్రక్రియను వారు పర్యవేక్షించారు. అయితే, పృథ్విరాజ్‍ను బేబక్క నామినేట్ చేసిన విషయంపై నిఖిల్, సీత మధ్య గొడవ జరిగింది.

హౌస్ పనుల్లో పృథ్వి హెల్ప్ చేయడం లేదని తనకు అనిపించిందని బేబక్క కారణం చెప్పారు. దీంతో సీత కల్పించుకున్నారు. ‘నిన్న గిన్నెలు కడిగాడక్కా’ అని సీత చెప్పటంతో.. ‘నువ్వు మాట్లాడకూడదు’ అని చీఫ్‍గా ఉన్న నిఖిల్ అన్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ షురూ అయింది. నా ఇష్టం.. సైలెన్స్ అంటూ ఇద్దరూ గట్టిగట్టిగా అరుచుకున్నారు. “నువ్వు మధ్యలో మాట్లాడినప్పుడు.. నాకు కూడా రైట్ ఉంది” అంటూ సీత అరిచారు. ఇలా ఈ ప్రోమో హాట్‍హాట్‍గా సాగింది. తొలి వారం ఎలిమినేషన్ కోసం ఎవరెవరూ నామినేట్ అవుతారనేది నేటి (సెప్టెంబర్ 3) ఎపిసోడ్‍లో వెల్లడి కానుంది.

ఈ నామినేషన్లపైనే అంతకు ముందు తొలి ప్రోమోను కూడా స్టార్ మా ఛానెల్ వదిలింది. కిచెన్‍లో కుక్కర్ విషయంలో బేబక్కను సోనియా నామినేట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య మాటలు వార్ జరిగింది. మణికంఠ, శేఖర్ మధ్య గొడవ ఈ ప్రోమోలోనూ ఉంది. సోనియా, ప్రేరణ మధ్య కూడా వాగ్వాదం గట్టిగానే జరిగింది.

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కెప్టెన్‍ ఉండరు. చీఫ్‍లు అని పేరు మార్చారు నిర్వాహకులు. ఈ సీజన్ తొలి రోజే నిఖిల్, నైనిక, యష్మి గౌడ చీఫ్‍లుగా అయ్యారు. నిఖిల్, నైనిక టాస్కుల ద్వారా చీఫ్‍లు అయితే.. ఆ తర్వాత వారిద్దరి నిర్ణయం ప్రకారం యష్మి చీఫ్‍గా సెలెక్ట్ అయ్యారు. దీంతో ఈ ముగ్గురు ఈ వారం నామినేషన్లలో ఉండరు. మిగిలిన 11 మంది మధ్య ఈ నామినేషన్ ప్రక్రియ సాగుతుంది.