Bigg Boss Priyanka: హైదరాబాద్‌లో భూమి కొన్న బిగ్ బాస్ ప్రియాంక.. వీడియో అసలు విషయం చెప్పిన వంటలక్క
Bigg Boss 7 Telugu Priyanka Buys Land: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జైన్ హైదరాబాద్‌లో ఓ ల్యాండ్ కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన వివరాలను యూట్యూబ్ ద్వారా తెలియజేసింది.
Priyanka Shiv Buys Land In Hyderabad: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ద్వారా ఏపీ, తెలంగాణ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్‌తో యమ క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో ద్వారా మంరిత పాపులారిటీ సంపాదించుకుంది. తనదైన ఆట తీరుతో బిగ్ బాస్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచి సత్తా చాటింది.
హౌజ్ మేట్స్ అందరికీ ఎప్పుడు వంట చేస్తూ బిగ్ బాస్ సీజన్ 7 వంటలక్కగా పేరు తెచ్చుకుంది. అలాగే, స్టార్ మా బ్యాచ్ అయిన అమర్ దీప్, శోభా శెట్టితో ఎక్కువగా ఉండటంతో గ్రూప్ గేమ్ ఆడుతోందని పలు విమర్శలు కూడా మూటగట్టుకుంది బ్యూటిఫుల్ ప్రియాంక జైన్. ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఓ ల్యాండ్ కొనుగోలు చేసినట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది.
ప్రియాంక జైన్ తన ప్రియుడు శివ్ కలిసి హైదరాబాద్‌లో ఓ భూమి కొన్నారట. దీనికి సంబంధించిన విషయాలు చెబుతూ యూట్యూబ్‌లోని తన ఛానెల్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో తెలిపారు ప్రియాంక్ అండ్ శివ్. ప్రస్తుతం భాగ్యనగరంలో అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ఈ లవ్ బర్డ్స్ ముందు కొత్తగా ఓన్ ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారట. అందుకు టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేసినట్లు వారు తెలిపారు.
కానీ, ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే కిక్కే వేరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసలు విషయం చెప్పారు శివ్ అండ్ ప్రియాంక. ల్యాండ్ కోసం జనవరి నుంచి తిరుగుతుంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చేదట. భూమి బాగుంటే ధర నచ్చేది కాదట, అన్ని సెట్ అయితే పేపర్స్ సరిగా ఉండేవి కాదని ప్రియాంక అండ్ శివ్ చెప్పుకొచ్చారు.
ఇక ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి 23వ తేదిన రిజిస్టర్ చేయించుకున్నట్లు ఇద్దరూ చెప్పారు. ఆ విజువల్స్‌ను కూడా యూట్యూబ్ వీడియోలో చూపించారు. అయితే, హైదరాబాద్‌లో భూమి కొనడం అంత ఈజీ కాదని, మొత్తానికి అయితే తమ డ్రీమ్ నెరవేరిందని శివ్ అంటే.. ప్రియాంక మాత్రం తెగ సంబరపడిపోతూ కనిపించింది.
ఇక త్వరలో ఇల్లు కట్టడం గురించి కూడా చెప్పింది ఈ జంట. అయితే, ప్రస్తుతం ముహుర్తాలు లేవని, జూలై వరకు ఎలాంటి మంచి ముహుర్తం లేదని, అలాగే వర్ష కాలంలో ఇల్లు కట్టడం కష్టమని చెప్పారు. అయితే ఇంటి కన్‌స్ట్రక్షన్ గురించి నెవర్ ఎండింగ్ టేల్స్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామని ప్రేమజంట ప్రియాంక జైన్, శివ్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ప్రియాంక, తన బాయ్ ఫ్రెండ్ శివ్ తరచుగా తమకు సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. వ్యక్తిగత, కెరీర్ పరమైన విశేషాలను యూట్యూబ్ లేదా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అప్డేట్స్ ఇస్తుంటారు. అందులో భాగంగానే తాము కొన్న కొత్త భూమి గురించి యూట్యూబ్ వీడియో ద్వారా అభిమానులకు చెప్పి గుడ్ న్యూస్‌ను పంచుకున్నారు.
కాగా గతేడాది సెప్టెంబర్ 3న బిగ్ బాస్ 7 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో ప్రియాంక జైన్ ఒకరు. ఆమె చివరి వరకు టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. తన ఆట తీరుతో, యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మొక్క బ్యాచ్ (శివాజీ, యావర్, ప్రశాంత్)కు చుక్క బ్యాచ్ (ప్రియాంక, అమర్, శోభా) గొడవలు అవుతూ ఉండేది.
ఇక గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 ప్లేసులో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. తన తర్వాత 4వ స్థానంలో యావర్, మూడో స్థానంలో శివాజీ వెళ్లిపోయారు. విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ గెలిస్తే.. రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచిన విషయం తెలిసిందే.