Iceland earthquakes : 14 గంటల్లో 800 భూకంపాలు.. ఐస్‌ల్యాండ్‌లో ఎమర్జెన్సీ!
Iceland earthquakes : ఐస్‌ల్యాండ్‌ను వరుస భూకంపాలు వణికించాయి. 14 గంటల వ్యవధిలో 800సార్లు భూమి కంపించింది!
Iceland earthquakes : వరుస భూకంపాలతో ఐస్‌ల్యాండ్ అల్లాడిపోయింది! 14 గంటల వ్యవధిలో 800కుపైగా భూకంపాలు.. ఆ దేశాన్ని గడగడలాడించాయి. ఫలితంగా.. అక్కడి ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది.
ఐస్‌ల్యాండ్‌లో భూకంపాలు..
ఐస్‌ల్యాండ్‌లోని నైరుతి ప్రాంతంలో ఉన్న రేక్జాన్స్ ద్వీపకల్పాన్ని భూప్రకంపనలు వణికించాయి. అయితే.. ఆ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం బద్ధలయ్యే ముందు, భూకంపాలు సంభవిస్తున్నాయని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"భూకంపాల తీవ్రత మరింత పెరగొచ్చు. తద్వారా అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమర్జెన్సీని విధిస్తున్నాము," అని ఐస్‌ల్యాండ్ సివిల్ ప్రొటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ విభాగం.. ఓ ప్రకటన విడుదల చేసింది.
Iceland earthquakes eruption today : అగ్నిపర్వతం.. ఇప్పటి నుంచి ఎప్పుడైనా బద్ధలవ్వొచ్చని ఐస్‌ల్యాండ్ వాతావరణశాఖ పేర్కొంది. అయితే.. అగ్నిపర్వతం లోపల ఉన్న లావా బయటకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు.. రేక్జాన్స్కు 40 కి.మీల దూరంలో రెండు భూకంపాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత.. గ్రిండవిక్ అనే ప్రాంతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. ఆ ప్రాంతంలో దాదాపు 4వేల మంది నివాసముంటున్నారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే.. వారందరిని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Iceland earthquakes eruption : గ్రిండవిక్ ప్రాంతంలో ఎమర్జెన్సీ షెల్టర్లు, హెల్ట్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది స్థానిక యంత్రాంగం. కాగా.. ఐస్‌ల్యాండ్‌లో తాజాగా వచ్చిన భూకంపాల్లో గరిష్ఠ తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.2గా నమోదైనట్టు తెలుస్తోంది.
అగ్నిపర్వతాలతో భయం భయం..!
అంతేకాకుండా.. ఉన్న రేక్జాన్స్ ద్వీపకల్పంలో 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించగా.. అక్టోబర్ నుంచి మొత్తం మీద 24వేల ప్రకంపనలు రికార్డు అయ్యాయి.
Iceland earthquakes today : 2021 నుంచి రేక్జాన్స్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు 3సార్లు బద్ధలయ్యాయి. మార్చ్ 2021, ఆగస్ట్ 2022, జులై 2023లో ఇవి అక్కడి ప్రజలు భయపెట్టాయి.
2010లో ఐస్‌ల్యాండ్‌కు దక్షిణ భాగంలో జరిగిన అగ్నిపర్వతం ఘటన కారణంగా లక్షకుపైగా విమానాలు రద్దు అయ్యాయి. ఐల్యాండ్‌లో 10 మిలియన్ మంది పర్యటకులు చిక్కుకుపోయారు!
ప్రపంచాన్ని వణికిస్తున్న భూకంపాలు..
నవంబర్ 4న నేపాల్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి నేపాల్ గడగడలాడిపోయింది. మృతుల సంఖ్య 140 దాటింది. పాల్‌కు వాయువ్యంవైపు ఉన్న జుమ్లా అనే ప్రాంతానికి 42కి.మీల దూరంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం