Bhimaa OTT: రేపే ఓటీటీలోకి రానున్న గోపీచంద్ ‘భీమా’ సినిమా: స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Bhimaa OTT Streaming: భీమా సినిమా ఓటీటీ రిలీజ్‍కు సిద్ధమైంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ డీటైల్స్ ఇక్కడ చూడండి.
Bhimaa Movie OTT: ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’ మంచి హైప్‍తో వచ్చినా బాక్సాఫీస్ వద్ద అంతగా అంచనాలను అందుకోలేకపోయింది. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా డ్యుయల్ రోల్ చేసిన ఈ చిత్రం మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్ సహా ప్రమోషన్లతో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చినా.. ప్రేక్షకులను మెప్పించలేక మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు, ఈ భీమా మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
ప్లాట్‍ఫామ్ ఇదే
భీమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్‍స్టార్ చేతిలో ఉన్నాయి. ఈ సినిమా రేపు (ఏప్రిల్ 25) హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఏప్రిల్ 25 అర్ధరాత్రే అందుబాటులోకి రానుంది. అంటే మరిన్ని గంటల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనుంది.
గోపీచంద్ వీడియో
భీమా స్ట్రీమింగ్ సందర్భంగా నేడు గోపీచంద్ ప్రమోషనల్ వీడియోను హాట్‍స్టార్ రిలీజ్ చేసింది. “నా సినిమా భీమా ఏప్రిల్ 25 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి” అని గోపీచంద్ ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఆ ఓటీటీ పోస్ట్ చేసింది.
భీమా చిత్రంలో భీమా, రామా అనే రెండు పాత్రలు చేశారు గోపీచంద్. భీమాగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రానికి ఏ.హర్ష దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేశ్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీరోల్స్ చేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవిబస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
భీమా చిత్రంపై రిలీజ్‍కు ముందు హీరో గోపీచంద్, దర్శకుడు హర్ష చాలా కన్ఫిడెంట్‍గా ఉన్నారు. ఈ మూవీ కచ్చితంగా బ్లాక్‍బస్టర్ అవుతుందనే ప్రమోషన్లలో గట్టిగా చెప్పారు. అయితే ఫలితం మరోలా వచ్చింది. గోపీచంద్ నటనపై ప్రశంసలు వచ్చినా.. ఓవరాల్‍గా సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రాణించలేకపోయింది. రూ.20 కోట్లలోపు గ్రాస్ వసూళ్లను సాధించింది.
భీమా మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు.
పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్‍ఐ భీమా (గోపీచంద్) కట్టడి చేస్తాడు. అయితే, పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది.. మళ్లీ తెరుచుకుందా అనేది కూడా ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా ఉంటుంది.
గోపీచంద్ తర్వాతి సినిమా
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ ప్రస్తుతం ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ స్టైక్ అంటూ గ్లింప్స్ వచ్చింది. తుపాకీతో ఓ పెళ్లి ఫంక్షన్‍లో గోపీచంద్ కాల్పులు జరిపే సీక్వెన్స్‌తో ఈ గ్లింప్స్ ఉంది. విశ్వం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‍పై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
టాపిక్