Ashika Ranganath o2 OTT: ఓటీటీలోకి వ‌చ్చిన‌ నా సామిరంగ హీరోయిన్ క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ-ashika ranganath kannada medical thriller movie o2 streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ashika Ranganath O2 Ott: ఓటీటీలోకి వ‌చ్చిన‌ నా సామిరంగ హీరోయిన్ క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

Ashika Ranganath o2 OTT: ఓటీటీలోకి వ‌చ్చిన‌ నా సామిరంగ హీరోయిన్ క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

Nelki Naresh Kumar HT Telugu
May 31, 2024 10:44 AM IST

Ashika Ranganath o2 OTT: ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించిన క‌న్న‌డ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఓ2 ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.

ఆషికా రంగ‌నాథ్  ఓ2 ఓటీటీ
ఆషికా రంగ‌నాథ్ ఓ2 ఓటీటీ

Ashika Ranganath o2 OTT: ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన నా సామిరంగ‌తో తెలుగులో ఫ‌స్ట్‌ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్న‌ది ఆషికా రంగ‌నాథ్‌. ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయిగా డేరింగ్‌, డాషింగ్ రోల్‌లో అల‌రించింది. గ్లామ‌ర్‌, యాక్టింగ్ క‌ల‌బోసిన రోల్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఫిదా చేసింది.

క‌న్న‌డంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌...

నా సామిరంగ‌తో పాటు ఈ ఏడాది క‌న్న‌డంలో ఓ2 అనే మూవీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న‌ది ఆషికా రంగ‌నాథ్‌. తాజాగా ఓ2 మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ2 మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే ఓ2 మూవీని రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లోనూ ఓ2 మూవీని విడుద‌ల చేసేందుకు అమెజాన్ ప్రైమ్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

పునీత్ రాజ్‌కుమార్ స‌తీమ‌ణి...

ఓ2 మూవీని దివంగ‌త క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ స‌తీమ‌ణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మించింది. రాఘ‌వ్ నాయ‌క్‌, ప్ర‌శాంత్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన క‌న్న‌డంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆషికా రంగ‌నాథ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన క‌న్న‌డ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ఎమ‌ర్జెన్సీ డోస్‌...

ఓ2 మూవీలో ఆషికా రంగ‌నాథ్‌తో పాటు ప్ర‌వీన్‌ తేజ్, ప్ర‌కాష్ బేలావాడి కీల‌క పాత్ర‌లు పోషించారు. వీరితో పాటు ద‌ర్శ‌కుడు రాఘ‌వ్ నాయ‌క్ కూడా నెగెటివ్ షేడ్‌ రోల్‌లో క‌నిపించాడు. వినూత్న ప్ర‌మోష‌న్స్‌తో ఆడియెన్స్‌లో ఓ2 మూవీ క్యూరియాసిటీ క‌లిగించింది. ఎమ‌ర్జెన్సీ డోస్ వ‌న్ అండ్ టూ పేరుతో ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఓ2 మూవీ క‌థ ఇదే...

ఈ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో శ్ర‌ద్ధా నాయ‌క్ అనే డాక్ట‌ర్ పాత్ర‌లో ఆషికా రంగ‌నాథ్ ఛాలెంజింగ్ రోల్‌లో అద‌ర‌గొట్టింది. శ్ర‌ద్ధానాయ‌క్ ఓ డాక్ట‌ర్‌. ఓ2 పేరుతో మ‌రో ముగ్గురు డాక్ట‌ర్స్‌తో క‌లిసి ఓ ప్ర‌యోగం చేస్తుంది. చ‌నిపోయిన వాళ్ల‌ను తిరిగి బ‌తికిచేందుకు చేసిన ఈ ప్ర‌యోగంలో శ్ర‌ద్ధా నాయ‌క్ స‌క్సెస్ అయ్యిందా? డాక్ట‌ర్ శ్ర‌ద్ధాకు ఉన్న మాన‌సిక స‌మ‌స్య ఏమిటి? ఆమెను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న ఓషో ఎవ‌ర‌న్న‌దే ఓ2 మూవీ క‌థ‌.

చిరంజీవి విశ్వంభ‌ర‌లో...

నాగార్జున నా సామిరంగ త‌ర్వాత తెలుగులో చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది ఆషికా రంగ‌నాథ్‌. విశ్వంభ‌ర‌లో ఓ కీల‌క పాత్ర చేస్తోంది. ఆషికా రంగ‌నాథ్ విశ్వంభ‌ర‌లో భాగ‌మైన విష‌యాన్ని ఇటీవ‌లే మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. విశ్వంభ‌ర మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌ళ్యాణ్ రామ్ అమిగోస్‌తో గత ఏడాది ఆషికా రంగ‌నాథ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌ళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో న‌టించిన ఈ ఎక్స్‌పీరిమెంట‌ల్‌ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

క‌న్న‌డంలో హీరోయిన్‌గా ఇర‌వైకిపైగా సినిమాలు చేసింది ఆషికా రంగ‌నాథ్‌. రాంబో 2, మ‌ధ‌గ‌జ‌, అథ‌ర్వ పురుష సినిమాలు హీరోయిన్‌గా ఆషికాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.ప్ర‌స్తుతం క‌న్న‌డంలో గ‌త వైభ‌వ పేరుతో ఓ పీరియాడిక‌ల్ మూవీ చేస్తోంది ఆషికా రంగ‌నాథ్‌.

టీ20 వరల్డ్ కప్ 2024