Naa Saami Ranga Ashika Ranganath: నా నా సామిరంగ అప్‌డేట్ - హీరోయిన్ ఫ‌స్ట్ లుక్‌రిలీజ్ - లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌-ashika ranganath first look from nagarjuna naa saami ranga movie unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga Ashika Ranganath: నా నా సామిరంగ అప్‌డేట్ - హీరోయిన్ ఫ‌స్ట్ లుక్‌రిలీజ్ - లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌

Naa Saami Ranga Ashika Ranganath: నా నా సామిరంగ అప్‌డేట్ - హీరోయిన్ ఫ‌స్ట్ లుక్‌రిలీజ్ - లంగావోణీలో ఆషికా రంగ‌నాథ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 04, 2023 12:41 PM IST

Naa Saami Ranga Ashika Ranganath: నా సామి రంగ మూవీ నుంచి హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ ఫ‌స్ట్‌లుక్‌ను బిగ్‌బాస్ షో లో రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో లంగావోణీ ధ‌రించి ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఆషికా రంగ‌నాథ్ క‌నిపిస్తోంది.

 ఆషికా రంగ‌నాథ్
ఆషికా రంగ‌నాథ్

Naa Saami Ranga Ashika Ranganath: నా సామిరంగ నుంచి హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్ వ‌ర‌ల‌క్ష్మి అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రంగా వోణీ ధ‌రించి కంప్లీట్ ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఆషికా రంగ‌నాథ్ క‌నిపిస్తోంది. త‌న అందాన్ని అద్ధంలో చూసుకుంటూ ఆషికా రంగ‌నాథ్ సిగ్గుతో మురిసిపోయిన‌ట్లుగా ఈ ఫ‌స్ట్ లుక్ వీడియోలో క‌నిపిస్తోంది.

నాగార్జున బీడీతో మాస్ లుక్‌లో ఈ వీడియోలో దర్శనమిచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోన్న ఫోక్ సాంగ్ ఇంట్రెస్ట్‌ను క‌లిగిస్తోంది. ఆదివారం బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఆషికా రంగ‌నాథ్ లుక్‌ను రివీల్ చేశారు. క‌ళ్యాణ్ రామ్ అమిగోస్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగ‌నాథ్‌.

నా సామి రంగ ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న రెండో మూవీ. నా సామిరంగంలో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్‌, రాజ్‌త‌రుణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డ్యాన్స్ మాస్ట‌ర్ విజ‌య్ బిన్నీ ఈ మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

సంక్రాంతి కానుక‌గా నా నామిరంగ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన పురింజు మ‌రియం జోస్ ఆధారంగా నా సామి రంగ మూవీ తెర‌కెక్కుతోంది. ముగ్గురు స్నేహితుల జీవితాల నేప‌థ్యంలో యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా నా సామి రంగ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

WhatsApp channel