Fahadh Faasil: 90 లక్షల బడ్జెట్ - ఐఫోన్‌తో షూటింగ్ - బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫహాద్ ఫాజిల్ సినిమా ఏదంటే?
Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ హీరోగా లాక్‌డౌన్ టైమ్‌లో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన సీయూ సూన్ వైవిధ్యమైన ప్రయోగంగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. ఈ సినిమాను కేవలం 90 లక్షల బడ్జెట్‌తో ఐఫోన్‌తోను తెరకెక్కించాడు దర్శకుడు మహేష్ నారాయణన్.
Fahadh Faasil: పాన్ ఇండియన్ కల్చర్ కారణంగా సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. స్టార్ హీరోతో సినిమా అంటే మినిమంలో మినిమం యాభై కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త హంగులతో సినిమాలు తీస్తున్నారు.
90 లక్షల బడ్జెట్...
కానీ కేవలం 90 లక్షల బడ్జెట్‌తో ఐఫోన్‌తో సినిమా తీసి హిట్టు కొట్టాడు మలయాళం అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్. 2020లో లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. రిలీజ్‌లు ఆగిపోయాయి. అలాంటి టైమ్‌లో సీయూ సూన్ పేరుతో ఫహాద్ ఫాజిల్ ఓ ఎక్స్‌పీరిమెంట్ మూవీ చేశాడు. . కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కేవలం 90 లక్షల బడ్జెట్‌లోనే ఈ సినిమాను కంప్లీట్ చేశారు. ఈ సినిమా మొత్తం కంప్యూటర్స్ స్క్రీన్స్ ప్రధానంగానే నడుస్తుంది. ఇండియాలో వచ్చిన ఫస్ట్ కంప్యూటర్స్ స్ట్రీన్స్ బేస్‌డ్ మూవీ ఇదే కావడం గమనార్హం.
దర్శనా రాజేంద్రన్ హీరోయిన్...
మిస్టరీ థ్రిల్లర్‌గా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు దర్శనా రాజేంద్రన్, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు.మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. సినిమా మొత్తాన్ని ఒకే బిల్డింగ్‌లో షూట్ చేశారు. ముగ్గురు నటీనటులతో పాటు 32 మంది టెక్నీషియన్స్ మాత్రమే ఈ సినిమాకు పనిచేశారు.
ఐఫోన్‌తోనే...
సినిమా కెమెరాలతో షూట్ చేయడానికి కొవిడ్ టైమ్‌లో పర్మిషన్స్ దొరక్కపోవడంతో ఐఫోన్‌తోనే ఈ సినిమాను షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు. ఐఫోన్‌తో టెస్ట్ షూట్ చేశారు. అది సక్సెస్ కావడంతో సినిమా మొత్తాన్ని ఫోన్‌తోనే తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్‌లో...
లాక్‌డౌన్ టైమ్‌లో థియేటర్లు మొత్తం బంద్ కావడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఓటీటీ హక్కుల ద్వారానే ఐదు కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.
సీయూ సూన్ కథ ఇదే...
జిమ్మి (రోషన్ మాథ్యూ) దుబాయ్‌లో బ్యాంక్ ఎంప్లాయ్‌గా పనిచేస్తుంటాడు. డేటింగ్ యాప్‌లో పరిచయమైన అనుతో (దర్శనా రాజేంద్రన్) జిమ్మి ప్రేమలో పడతాడు. జిమ్మితో అను ప్రేమను ఆమె కుటుంబసభ్యులు నిరాకరిస్తారు. ఆ బాధలో అను కనిపించకుండాపోతుంది. అను సూసైడ్ నోట్ జిమ్మి ఇంట్లో దొరకడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. అను మిస్సింగ్ వెనుక ఉన్న సీక్రెట్‌ను కెవిన్ (ఫహాద్ ఫాజిల్) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎలా సాల్వ్ చేశాడు? అను జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలను తెలుసుకొని కెవిన్ ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.
ఆవేశం...
ఇటీవలే ఆవేశం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఫహాద్ ఫాజిల్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఫన్నీ గ్యాంగ్‌స్టర్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ఈ ఏడాది మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీకి ఫహాద్ ఫాజిల్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.