Shakhahaari OTT: ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌బస్టర్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - ట్విస్ట్‌లకు బుర్ర తిరగడం ఖాయం
Shakhahaari OTT: కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శాఖాహారి ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Shakhahaari OTT: కన్నడంలో ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది శాఖాహారి. కోటి రూపాయల లోపే బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో కమర్షియల్‌గా నిర్మాతలకు ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ సీరియర్ యాక్టర్ రంగాయన రఘు లీడ్ రోల్‌లో నటించాడు. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్ యూజే, నిధి హెగ్డే కీలక పాత్రలు పోషించారు. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించాడు.
టైటిల్‌తోనే...
టైటిల్‌తోనే శాఖాహారి మూవీ కన్నడ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రంగాయన రఘు నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ కథను రాసుకున్న తీరు బాగుంటంటూ క్రిటిక్స్ పేర్కొన్నారు. విజువల్స్, బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయనే నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. కన్నడంలో శాఖాహారి మూవీ పలు థియేటర్లలో యాభై రోజుల పాటు ఆడింది.
శాఖాహారి కథ ఇదే...
సుబ్బన్న (రంగాయన రఘు) ఓ చిన్న టౌన్‌లో శాఖాహార హోటల్ నడుపుతుంటాడు. మధ్య వయస్కుడైన సుబ్బన్నకు పెళ్లికాదు. ఎలాంటి రిలేషన్స్ లేకుండా సోలోగా లైఫ్‌ను సాగించాలని అనుకుంటాడు. అనుకోకుండా అతడి జీవితంలోకి వినయ్ వస్తాడు. తన భార్యను హత్య చేసిన కేసులో దోషి అయిన వినయ్ పోలీసుల నుంచి తప్పించుకొని సుబ్బన్న హోటల్‌లో తలదాచుకుంటాడు.
వినయ్‌ని వెతుక్కుంటూ వచ్చిన లోకల్ పోలీస్ ఆఫీసర్‌కు (గోపాలకృష్ణ దేశ్‌పాండే) సుబ్బన్న గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేమిటి? తన హోటల్‌కు వచ్చిన వారిని అతడు ఎందుకు హతమారుస్తున్నాడు? సుబ్బన్న గతం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
8.3 రేటింగ్...
ఐఎమ్‌డీబీలో శాఖాహారి మూవీ 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతోన్నాయి. కన్నడంలో సీనియర్ నటుల్లో ఒకరైన రంగాయన రఘు ఇప్పటివరకు నాలుగు వందలకుపైగా సినిమాలు చేశాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కనిపించాడు.
దునియా సైనైడ్, బడవా రాస్కెల్, రంగసముద్రతో పలు సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మని, దునియా సినిమాలకు గాను బెస్ట్ యాక్టర్‌గా కర్ణాటక స్టేట్ అవార్డులను రంగాయన రఘు సొంతం చేసుకున్నాడు. 2024లో కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రంగాయన రఘు నటించిన ఏడు సినిమాలు రిలీజయ్యాయి.