Bahishkarana Teaser: వేశ్య‌గా బోల్డ్ రోల్‌లో అంజ‌లి - బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజర్ రిలీజ్‌-anjali bahishkarana telugu web series teaser unveiled revenge action drama series streaming on zee5 ott ananya nagalla ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bahishkarana Teaser: వేశ్య‌గా బోల్డ్ రోల్‌లో అంజ‌లి - బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజర్ రిలీజ్‌

Bahishkarana Teaser: వేశ్య‌గా బోల్డ్ రోల్‌లో అంజ‌లి - బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jul 07, 2024 02:08 PM IST

Bahishkarana Teaser: అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ జూలై 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో అంజ‌లి బోల్డ్ రోల్‌తో పాటు కిల్ల‌ర్‌గా క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌
బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌

Bahishkarana Teaser: అంజ‌లి లీడ్‌లో న‌టిస్తోన్న తెలుగు వెబ్‌సిరీస్ బ‌హిష్క‌ర‌ణ జీ 5 ఓటీటీలో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ సిరీస్‌కు ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ టీజ‌ర్ విడుద‌లైంది.

ఒక‌టి సొమ్ము...మ‌రొక‌టి సోకు...

ప్ర‌శాంత‌మైన ప‌ల్లెటూరు.. పంట పొలాల మ‌ధ్య‌లో నుంచి వెళుతోన్న బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న‌ అమ్మాయిగా (అంజ‌లి) అంజ‌లి క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ బ‌హిష్క‌ర‌ణ‌ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మైంది. ఈ ప్ర‌పంచం లొంగిపోయేది రెండిటికే .. ఒక‌టి సొమ్ముకి, ఇంకొక‌టి సోకు అనే డైలాగ్ ద్వారా ఈ సిరీస్‌లో అంజ‌లి క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో మేక‌ర్స్ చూపించారు. ఆకు వ‌క్కా అందిస్తా...నీకు మూడు పూట‌ల స్వ‌ర్గం చూపిస్తా అంటూ బోల్డ్ రోల్‌లో క‌నిపిస్తూనే మ‌రోవైపు ద‌యాద‌క్షిణ్యాలు లేకుండా మ‌నుషులు ప్రాణాలు తీసే కిల్ల‌ర్‌గా అంజ‌లి క్యారెక్ట‌ర్ లోని వేరియేష‌న్స్‌ను ఈ టీజ‌ర్‌లో ఆవిష్క‌రించారు.

ప్ర‌తీకారం ఎవ‌రిపై...

ఓ వైపు ప్రేమ, రొమాన్స్‌ను కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోతూ అంజ‌లి క‌నిపించ‌డం టీజ‌ర్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే అనే అంశాల‌తో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

వేశ్య పాత్ర‌లో...

బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్‌లో పుష్ప అనే వేశ్య‌గా అంజ‌లి క‌నిపించ‌బోతున్న‌ది. ఛాలెంజింగ్ రోల్‌లో అంజ‌లి క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు. ఈ సిరీస్‌లో అంజ‌లితో పాటు అన‌న్య నాగ‌ళ్ల ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. అన‌న్య నాగ‌ళ్ల కూడా ప‌ల్లెటూరి యువ‌తిగా ఈ టీజ‌ర్‌లో క‌నిపించింది. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట‌ర్ ముఖేష్ ప్ర‌జాప‌తి తెర‌కెక్కించాడు. ఈ తెలుగు వెబ్‌సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్ర‌శాంతి మ‌లిశెట్టి ప్రొడ్యూస్‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.

రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లో...

ఈ ఏడాది గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది అంజ‌లి. గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో యాభై సినిమాల మైలురాయిని అంజ‌లి పూర్తిచేసుకున్న‌ది. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

విశ్వ‌క్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో అంజ‌లి వేశ్య పాత్ర‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌లో అంజ‌లి ఓ కీల‌క పాత్ర చేస్తోంది. త‌మిళంలో నివీన్ పాల్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రామ్ చేస్తోన్న ఓ ప్ర‌యోగాత్మ‌క మూవీలో అంజ‌లి హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

WhatsApp channel