IND vs PAK WCL Live streaming: డబ్ల్యూసీఎల్‍లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ ఫైట్ నేడే.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
IND vs PAK WCL 2024: వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‍లో నేడు భారత్, పాకిస్థాన్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఏ టోర్నమెంట్ అయినా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే సమరంలానే ఉంటుంది. ఈ చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడినా అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఇప్పుడు, వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) టోర్నీలో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. నేడు (జూలై 6) ఇంగ్లండ్ బర్మింగ్‍హామ్‍లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా చాంపియన్స్, పాకిస్థాన్ చాంపియన్స్ మధ్య మ్యాచ్ టైమ్, లైవ్ సహా మరిన్ని వివరాలు ఇవే..
డబ్ల్యూసీఎల్ 2024 టోర్నీలో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లపై గెలిచింది. యూనిస్ ఖాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ చాంపియన్స్.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై గెలిచింది. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు మరింత ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టైమ్
డబ్ల్యూసీఎల్ 2024 టోర్నీలో ఇండియా చాంపియన్స్, పాకిస్థాన్ చాంపియన్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం నేటి (జూలై 6) రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అందుకు అర గంట ముందు టాస్ పడుతుంది.
లైవ్ వివరాలు
డబ్ల్యూసీఎల్‍లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‍ను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే.. ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్‍సైట్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఫ్యాన్‍కోడ్‍లో రూ.25లతో మ్యాచ్ పాస్ కొనుగోలు చేసి లైవ్ వీక్షించొచ్చు.
ఇండియా, పాకిస్థాన్ పూర్తి జట్లు
ఇండియా చాంపియన్స్ పూర్తి జట్టు: యువరాజ్ సింగ్(కెప్టెన్), హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, నమన్ ఓజా(వికెట్ కీపర్), సురేశ్ రైనా, గురుకీరత్ సింగ్ మాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్, ధావల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, ఆర్‌పీ సింగ్, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ, అంబటి రాయుడు, పవన్ నేగి
పాకిస్థాన్ చాంపియన్స్ పూర్తి జట్టు: యూనిస్ ఖాన్(కెప్టెన్), షాహిద్ ఆఫ్రిది, మిస్బావుల్ హక్, కమ్రాన్ అక్మల్(వికెట్ కీపర్), షర్జీల్ ఖాన్, సోహెబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, అబ్దుల్ రజాక్, అమీర్ యామిన్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్, తౌఫీక్ ఉమర్, మహమ్మద్ హఫీజ్, యాసిర్ అర్ఫీజ్, సోహెల్ తన్వీర్, సోహెల్ ఖాన్, ఉమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్
వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ప్లేయర్లు ఆడుతున్నారు. దీంతో తమ ఫేవరెట్ ప్లేయర్ల ఆటను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నేడు (జూలై 6) జరిగే భారత్, పాక్ మ్యాచ్‍పై చాలా హైప్ ఉంది.
హౌస్‍ఫుల్
ఇండియా చాంపియన్స్, పాకిస్థాన్ చాంపియన్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. బర్మింగ్‍హామ్‍లోని ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. 23,000 టికెట్లకు గాను ఈ మ్యాచ్ కోసం అన్నీ సేల్ అయ్యాయట. ఆ రేంజ్‍లో భారత్, పాక్ పోరుకు క్రేజ్ ఉంది.