Salaar Teaser Views: స‌లార్ టీజ‌ర్‌కు 4 గంట‌ల్లో ప‌ది మిలియ‌న్ల వ్యూస్ - ఇది కేజీఎఫ్ -3 టీజ‌ర్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్‌-salaar movie teaser hits 10 million views in four hours prabhas eye on surpass kgf 2 record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Teaser Views: స‌లార్ టీజ‌ర్‌కు 4 గంట‌ల్లో ప‌ది మిలియ‌న్ల వ్యూస్ - ఇది కేజీఎఫ్ -3 టీజ‌ర్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్‌

Salaar Teaser Views: స‌లార్ టీజ‌ర్‌కు 4 గంట‌ల్లో ప‌ది మిలియ‌న్ల వ్యూస్ - ఇది కేజీఎఫ్ -3 టీజ‌ర్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్‌

HT Telugu Desk HT Telugu
Jul 06, 2023 10:46 AM IST

Salaar Teaser Views: ప్ర‌భాస్ స‌లార్ మూవీ టీజ‌ర్ నాలుగు గంట‌ల్లోనే ప‌ది మిలియ‌న్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌రోవైపు ఈ సినిమాను కేజీఎఫ్ సిరీస్‌తో కంపేర్ చేస్తూ కొంద‌రు అభిమానులు ట్రోల్ చేస్తోన్నారు.

ప్ర‌భాస్ స‌లార్ మూవీ టీజ‌ర్
ప్ర‌భాస్ స‌లార్ మూవీ టీజ‌ర్

Salaar Teaser Views: స‌లార్ టీజ‌ర్ టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ (Prabhas) ఎలివేష‌న్స్‌తో పాటు టీజ‌ర్‌లోని విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించిన చ‌ర్చ‌లే క‌నిపిస్తోన్నాయి. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ టీజ‌ర్‌ను కట్ చేసిన తీరు, డైనోసార్‌తో ప్ర‌భాస్‌ను కంపేర్ చేయ‌డం లాంటివి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ను తెప్పిస్తోన్నాయి.

ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కేవ‌లం నాలుగు గంట‌ల్లోనే ప‌ది మిలియ‌న్ల రియ‌ల్ టైమ్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. వ్యూస్ ప‌రంగా కేజీఎఫ్ -2 టీజ‌ర్ రికార్డుల‌ను స‌లార్ టీజ‌ర్ దాటేస్తుంద‌ని ఫ్యాన్స్ అంచ‌నా వేస్తోన్నారు.

కేజీఎఫ్ 2 (Kgf 2) టీజర్ 24 గంట‌ల్లో 78 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది. ఒక్క రోజులో అత్య‌ధిక వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ సౌత్ ఇండియ‌న్ మూవీ టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 రికార్డును స‌లార్ బ్రేక్ చేస్తుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇది స‌లార్ కాదు కేజీఎఫ్ -3

మ‌రోవైపు కొంద‌రు అభిమానులు మాత్రం స‌లార్ టీజ‌ర్ విష‌యంలో అసంతృప్తికిలోన‌వుతున్నారు. స‌లార్ టీజ‌ర్‌లో క‌నిపిస్తోన్న విజువ‌ల్స్‌, లొకేష‌న్స్‌, ఎలివేష‌న్స్‌తో పాటు టేకింగ్‌కూడా కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2నుపోలి ఉంద‌ని కామెంట్స్ చేస్తోన్నారు. స‌లార్ టీజ‌ర్ కాకుండా కేజీఎఫ్ 3 టీజ‌ర్ చూసిన అనుభూతి క‌లుగుతోంద‌ని ప్ర‌శాంత్ నీల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

టీజ‌ర్‌లో ప్ర‌భాస్ ఒక్క‌సారి కూడా క‌నిపించ‌లేదు. అత‌డి ముఖం చూపించ‌కుండా యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తోనే టీజ‌ర్‌ను క‌ట్ చేశారు. ప్ర‌భాస్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయిన‌ట్లు స‌మాచారం. కాగా సెప్టెంబ‌ర్ 28న స‌లార్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

WhatsApp channel