Anil Kapoor on Sex: సెక్స్‌ వల్లే నా వయసు తక్కువ అని ఫీలవుతాను: అనిల్‌ కపూర్‌-anil kapoor says sex made him feel younger in koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Kapoor On Sex: సెక్స్‌ వల్లే నా వయసు తక్కువ అని ఫీలవుతాను: అనిల్‌ కపూర్‌

Anil Kapoor on Sex: సెక్స్‌ వల్లే నా వయసు తక్కువ అని ఫీలవుతాను: అనిల్‌ కపూర్‌

HT Telugu Desk HT Telugu
Sep 12, 2022 03:26 PM IST

Anil Kapoor on Sex: సెక్స్‌ వల్లే తన వయసు తక్కువ అని ఫీలవుతానని అన్నాడు బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్‌. తాజాగా అతడు కాఫీ విత్‌ కరణ్‌ షో కోసం వరుణ్‌ ధావన్‌తో కలిసి వచ్చాడు.

<p>కాఫీ విత్ కరణ్ షోలో అనిల్ కపూర్, వరుణ్ ధావన్</p>
<p>కాఫీ విత్ కరణ్ షోలో అనిల్ కపూర్, వరుణ్ ధావన్</p>

Anil Kapoor on Sex: కాఫీ విత్‌ కరణ్‌ షో వస్తోందంటే చాలుఉ సెక్స్‌ రిలేటెడ్‌ టాపిక్‌ ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుందని అందరూ ఫిక్సవుతారు. ఈ షోలు కరణ్‌ జోహార్‌ అడిగే ప్రశ్నలు.. వాటికి సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలు మొత్తం ఈ సెక్స్ చుట్టే తిరుగుతుంటాయి. తాజాగా వచ్చే గురువారం (సెప్టెంబర్‌ 15) రానున్న షోకు సంబంధించి సోమవారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ఈసారి ఈ షోకి బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌ గెస్ట్‌లుగా వస్తున్నారు. ఊహించినట్లే ఈ ఎపిసోడ్‌లోనూ టాపిక్‌ సెక్స్‌ వైపే మళ్లింది. తన వయసు తక్కువ అన్న ఫీలింగ్‌ కలిగించిన మూడు విషయాలు ఏంటి అని అనిల్‌ను అడుగుతాడు కరణ్‌ జోహార్‌. దీనికి అతడు సమాధానమిస్తూ.. సెక్స్‌, సెక్స్‌, సెక్స్‌ అని అంటాడు. ఇదంతా స్క్రిప్టెడ్‌ కదా అని కూడా ఈ ట్రైలర్‌లో అనిల్ అనడం విశేషం.

ఈ సమాధానం విని కరణ్‌, వరుణ్‌ గట్టిగా నవ్వుతారు. ఇక ఈ షోలోని ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో కరణ్‌ అడిగిన ప్రతి ప్రశ్నకు అర్జున్‌ కపూర్‌ అంటూ సమాధానమిస్తాడు వరుణ్‌ ధావన్‌. అర్జున్‌ కపూర్‌.. అనిల్‌ అన్న బోనీ కపూర్‌ కొడుకు కావడం విశేషం. ప్రతి వారంలాగే ఈసారి కూడా షోను సరదాగా నడిపించినట్లు ఈ ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. కాఫీ విత్‌ కరణ్‌ షో ప్రస్తుతం సీజన్‌ 7 నడుస్తోంది.

ఈసారి ఇప్పటికే సమంత, విజయ్‌ దేవరకొండ, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌, అనన్యా పాండే, షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీ, అర్జున్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌లాంటి బాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు వచ్చారు.