Telugu News  /  Entertainment  /  Alia Bhatt Reacted On Boycott Brahmastra Trending
బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో ఆలియా భట్
బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో ఆలియా భట్ (PTI)

Alia on Boycott Brahmastra: బాయ్‌కాట్‌ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్‌పై ఆలియా భట్‌ రియాక్షన్‌ ఇదీ

07 September 2022, 19:01 ISTHari Prasad S
07 September 2022, 19:01 IST

Alia on Boycott Brahmastra: బాయ్‌కాట్‌ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్‌పై ఆ మూవీ హీరోయిన్‌ ఆలియా భట్ స్పందించింది. నెగటివ్ ఏమీ లేదు.. అంతా పాజిటివ్‌గానే ఉంది అని ఆమె అనడం విశేషం.

Alia on Boycott Brahmastra: బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మాస్త్ర మూవీ ఈ నెల 9న రిలీజ్‌ కాబోతోంది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌.. ఐదేళ్ల శ్రమ.. పైగా బాలీవుడ్‌ ఇండస్ట్రీ వరుస వైఫల్యాలతో కష్టాల్లో ఉన్న సమయంలో రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా హిట్‌ అవడం మేకర్స్‌తోపాటు మొత్తం ఇండస్ట్రీకి కూడా ఎంతో అవసరం. అయితే ఈ సినిమా కూడా రిలీజ్‌కు ముందే బాయ్‌కాట్‌ ప్రమాదం ఎదుర్కొంటోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మధ్యే ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా మూవీపై ఈ బాయ్‌కాట్‌ కాల్స్‌ ఎంత ప్రభావం చూపాయో మనం చూశాం. ఇప్పుడీ మూవీని కూడా బాయ్‌కాట్‌ చేయాలన్న పిలుపు జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ అవుతున్న వాతావరణం గురించి మీడియా వాళ్లు ఆలియాను ప్రశ్నించారు. దీనికి ఆమె సీరియస్‌గా కాకుండా కాస్త సరదాగా సమాధానమిచ్చింది.

"ఏ వాతావరణం? ఎండాకాలమా? శీతాకాలమా? అలాంటిదేమీ లేదు. ఓ సినిమాను రిలీజ్‌ చేయడానికి ఇది మంచి వాతావరణం. ప్రస్తుతం మనం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. అలాంటిదేమీ చెప్పకండి. మీరే ఇలాంటి వ్యాప్తి చేయకండి. వాతావరణం నెగటివ్‌గా ఏమీ లేదు. అంతా పాజిటివ్‌గానే ఉంది. బాగుంది" అని ఆలియా చెప్పింది.

థియేటర్లు తిరిగి ఓపెన్‌ కావడంపై ఈ సందర్భంగా ఆమె స్పందించింది. "థియేటర్లు మళ్లీ ఓపెన్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. మేము మా పని చేసి ఆడియెన్స్‌ ముందుకు తీసుకొచ్చే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతతో ఉన్నాం. వాతావరణం ఏంటంటే ప్రస్తుతం సెప్టెంబర్‌ మొదలైంది.తర్వాత అక్టోబర్‌ వస్తుంది" అని ఆలియా సరదాగా కామెంట్‌ చేసింది.

బ్రహ్మాస్త్ర మూవీని అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేశాడు. హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. 3డీలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బ్రహ్మాస్త్రలో ఇది పార్ట్‌ 1 మాత్రమే. మొత్తం మూడు భాగాలుగా వస్తోంది. డిస్నీ, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.