NTR Film Awards 2024: బెస్ట్ హీరోగా ఆనంద్ దేవరకొండ.. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్లే!
NTR Film Awards 2024 Winners List Kalavedika: తాజాగా హైదరాబాద్‌లో కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వైభవంగా జరిగాయి. బెస్ట్ యాక్టర్‌గా ఆనంద్ దేవరకొండ అవార్డ్ అందుకోగా ఉత్తమ దర్శకుడిగా బేబి డైరెక్టర్ సాయి రాజేష్ పురస్కారం తీసుకున్నారు.
NTR Film Awards 2024 Winners: స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుతో సినిమా రంగంలోని నటీనటులకు పురస్కారాలు అందించారు. సినీ రంగంలోని అన్ని విభాగాల్లో ప్రఖ్యాతి గాంచిన నటీనటులకు ఈ అవార్డ్స్ అందజేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కళావేదిక ఆర్‌వి రమణమూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో వైభవంగా జరిగిన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుకలో అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటీనటులకు, ఇతర టెక్నిషియన్స్‌కు ఎన్టీఆర్ అవార్డ్స్ అందజేశారు. ఈ వేడుకకు నందమూరి మోహన్ కృష్ణ, మురళీ మోహన్, నందమూరి మోహన రూపతోపాటు అవార్డ్స్ అందుకున్న సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్న విజేతల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును సీనియర్ నటుడు మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ అందుకున్నారు. ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా ఇదే బేబీ సినిమాకు సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంత్ కేసరి చిత్రానికి సాహు గారపాటి పురస్కారం తీసుకున్నారు.
అలాగే, ఉత్తమ విలన్‌గా యక్షిణి వెబ్ సిరీస్ నుంచి నటుడు అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్‌కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి నటుడు మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ చేతుల మీదగా అందజేశారు.
అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్‌గా కాసర్ల శ్యామ్, బెస్ట్ రైటర్‌గా కల్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రఘు కుంచె, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్‌గా శరణ్య ప్రదీప్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా హర్షవర్ధన్, బెస్ట్ మేల్ సింగర్‌గా రాహుల్ సిప్లిగంజ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా దాశరధి శివేంద్ర, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా నాగేంద్ర, బెస్ట్ కమెడియన్‌గా రచ్చ రవి, బెస్ట్ ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ బహుమతులు అందుకున్నారు.
బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా మంగ్లీ, బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా విజయ్ పొలాకి, బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్‌గా ధ్రువన్, బెస్ట్ డెబ్యూ సపోర్టింగ్ యాక్టర్‌గా లక్ష్మణ్ మీసాల, బెస్ట్ నెగెటివ్ సపోర్టింగ్ రోల్‌లో సాహితీ దాసరి, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్‌గా గౌరీ కృష్ణ, బెస్ట్ డెబ్యూ రైటర్‌గా అజ్జు మహకాళి, బెస్ట్ రివ్యూ కమిటీ మెంబర్‌గా లక్ష్మణ్ టేకుమూడి, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్‌గా త్రినాథ్ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్‌ని అందుకున్నారు.
ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుకలో అవార్డ్స్ అందుకున్న వారితోపాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్, దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి సైతం పాల్గొన్నారు.
కాగా ఈవెంట్‌కి పిలవగానే విచ్చేసిన మురళి మోహన్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూపా గారికి, అదేవిధంగా ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన మా స్పాన్సర్స్ వేగ జువెలర్స్ నవీన్ గారు, మణిదీప్ గారు, కల్యాణ్ గారు, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ గణపతి రెడ్డి గారు, క్యాపిటల్ 45 గోల్డెన్ క్రెస్ట్ శోభన్ బాబు గారు, శ్రీని ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీను గారు, పవన్ ఈవెంట్స్ పవన్ గారు, లీడ్ స్పేస్, డీఆర్ నెట్ వారికి సహకారం అందించినందుకు కళావేదిక, రాఘవి మీడియా అధినేతలు ధన్యవాదాలు చెప్పారు.