Sr NTR: ఆమెను ఎదుర్కున్న ఏకైక మగాడు ఎన్టీఆర్.. నటుడు మురళి మోహన్ కామెంట్స్ వైరల్-actor murali mohan about sr ntr in kalavedika ntr film awards 2024 murali mohan receives ntr lifetime achievement award ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sr Ntr: ఆమెను ఎదుర్కున్న ఏకైక మగాడు ఎన్టీఆర్.. నటుడు మురళి మోహన్ కామెంట్స్ వైరల్

Sr NTR: ఆమెను ఎదుర్కున్న ఏకైక మగాడు ఎన్టీఆర్.. నటుడు మురళి మోహన్ కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Jul 01, 2024 06:26 AM IST

Murali Mohan About Sr NTR In NTR Film Awards 2024: సీనియర్ ఎన్టీఆర్ పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళి మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ ఏకైక మగాడు అంటూ మురళి మోహన్ వ్యాఖ్యలు చేశారు.

ఆమెను ఎదుర్కున్న ఏకైక మగాడు ఎన్టీఆర్.. నటుడు మురళి మోహన్ కామెంట్స్ వైరల్
ఆమెను ఎదుర్కున్న ఏకైక మగాడు ఎన్టీఆర్.. నటుడు మురళి మోహన్ కామెంట్స్ వైరల్

Murali Mohan Sr NTR Film Awards 2024: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్"అందించారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డ్స్ అందజేశారు.

హైదరాబాద్‌లోని హోటల్ "దసపల్లా"లో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి), " రాఘవి మీడియా" ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ పాటలతో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, సీనియర్ నటుడు మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితోపాటు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మురళి మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘన విజయాన్ని అందుకున్న నాయకుడు ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం, అదే విధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు" అని మురళి మోహన్ తెలిపారు.

"ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని మురళి మోహన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

"ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదే విధంగా రాజకీయ పార్టీ పెట్టి పేదల కోసం, ఆడవారి హక్కుల కోసం పోరాడి వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను" అని నందమూరి మోహన కృష్ణ తెలిపారు.

"ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్‌లో నేను కూడా స్పాన్సర్‌గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదికతో పాటు రాఘవే మీడియా మధు గారు భాగమవడం. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం" అని అరుణశ్రీ ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత గణపతి రెడ్డి అన్నారు.

"కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ గారి ఖ్యాతి పెంచాలని, వాటిలో నేను నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నాను" ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి చెప్పుకొచ్చారు.

WhatsApp channel