Malayalam OTT: ఓటీటీలోకి అమలాపాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్
Malayalam OTT: అమలాపాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవెల్ క్రాస్ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. లెవెల్ క్రాస్ మూవీలో ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు.
Malayalam OTT: అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ లెవెల్ క్రాస్ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. థియేటర్లలో జూలై 26న రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
సోనీ లివ్ ఓటీటీలో..
లెవెల్ క్రాస్ మూవీ సెప్టెంబర్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ 27న లెవెల్ క్రాస్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది.
డ్యూయల్ రోల్స్‌లో…
లెవెల్ క్రాస్ మూవీలో హీరోహీరోయిన్లు ఆసిఫ్ అలీ, అమలాపాల్ ఇద్దరు డ్యూయల్ రోల్స్‌లో కనిపించారు. కాన్సెప్ట్, ట్విస్ట్‌లతో ఆసిఫ్ అలీ, అమలాపాల్ యాక్టింగ్ బాగున్నా కథను అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజన్ కావడంతో ఈ థ్రిల్లర్ మూవీ హిట్టు టాక్‌ను తెచ్చుకోలేకపోయింది.
జీతూ జోసెఫ్ శిష్యుడైన అర్ఫాజ్ అయూబ్ లెవెల్ క్రాస్ మూవీతోనే దర్శకుడిగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గురువు బాటలోనే థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించాలనే అర్ఫాజ్ ప్రయత్నాలు ఫలించలేదు. షరాఫుద్దీన్ కీలక పాత్రలో నటించాడు.
సింగర్‌గా ఎంట్రీ...
లెవెల్ క్రాస్ మూవీకి తెలుగు మూవీ సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతో అమలాపాల్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఓ పాట పాడింది.
లెవెల్ క్రాస్ కథ ఇదే...
చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. ఎడారికి దగ్గరలో ఉన్న లెవెల్ క్రాసింగ్‌లో రఘును కలిసిన తర్వాత చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. రఘు, చైతాలి పోలికలతోనే జార్జ్, శిఖా ఎవరు?
చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? ఈ కథలో డాక్టర్ జింకో (షరాపుద్దీన్)ఎవరు అన్నదే ఈ మూవీ కథ. లెవెల్ క్రాస్ మూవీని మొత్తం ఆఫ్రికాలోని ట్యూనీషియాలో షూట్ చేశారు. ఎడారి బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ మూవీ సాగుతుంది.
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు...
ఈ ఏడాది ఆడుజీవితం తర్వాత అమలాపాల్ చేసిన సినిమా ఇది. ఒకప్పుడు మలయాళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నది అమలాపాల్. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న మలయాళం హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆమె సినీ కెరీర్‌పై ప్రభావాన్ని చూపించాయి.
ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలే ఎక్కువగా చేస్తోంది. తెలుగులోనూ రామ్‌చరణ్ నాయక్, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. గత ఏడాది బిజినెస్‌మెన్ జగత్ దేశాయ్‌ను పెళ్లిచేసుకున్నది అమలపాల్. ఈ ఏడాది జూలైలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.