Akshay Kumar in Hyderabad: కన్నప్ప కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్.. విష్ణు, మోహన్ బాబులతో కలిసి..-akshay kumar in hyderabad for kannappa meets manchu mohan babu and manchu vishnu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akshay Kumar In Hyderabad: కన్నప్ప కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్.. విష్ణు, మోహన్ బాబులతో కలిసి..

Akshay Kumar in Hyderabad: కన్నప్ప కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్.. విష్ణు, మోహన్ బాబులతో కలిసి..

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 09:06 AM IST

Akshay Kumar in Hyderabad: కన్నప్ప మూవీ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. అతడు రాగానే మంచు విష్ణు, మోహన్ బాబులను కలిశాడు.

కన్నప్ప కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్.. విష్ణు, మోహన్ బాబులతో కలిసి..
కన్నప్ప కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్.. విష్ణు, మోహన్ బాబులతో కలిసి..

Akshay Kumar in Hyderabad: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. కన్నప్ప మూవీలో అతడు నటించనున్నట్లు ఈ మధ్యే మేకర్స్ కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి అక్షయ్ మంగళవారం (ఏప్రిల్ 16) హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

yearly horoscope entry point

హైదరాబాద్‌లో అక్షయ్ కుమార్

కన్నప్ప మూవీలో నటించడానికి అక్షయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. అతడు నేరుగా మంచు విష్ణు ఇంటికి వెళ్లాడు. అక్కడ విష్ణు అతనికి స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్షయ్ ని చూడగానే మోహన్ బాబు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత శాలువా కప్పి సన్మానించాడు. కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ పాత్ర ఏంటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అయితే అతడు తమ సినిమాలో ఉన్న విషయాన్ని మంచు విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. "కన్నప్ప ప్రయాణం మరింత థ్రిల్లింగా మారింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కు స్వాగతం పలుకుతున్నాం. కన్నప్పతో తెలుగు సినిమాలో అతడు అడుగు పెడుతుండటం థ్రిల్లింగా ఉంది. మరపురాని అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశాడు.

ఆ తర్వాత విష్ణు ఇంట్లోనే అతనితోపాటు మోహన్ బాబుతో అక్షయ్ ముచ్చటించాడు. ఈ ముగ్గురూ సినిమాకు సంబంధించిన విశేషాలపైనే చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగా.. ఇప్పుడు అక్షయ్ టీమ్ తో చేరాడు. కన్నప్ప మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.

కన్నప్ప కథేంటి?

కన్నప్ప మూవీ ఓ నిజ జీవిత కథ. పరమ శివుడి భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కు సరిపడా పాత్ర ఏంటన్నదానిపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అతడు పరమ శివుడి పాత్రనే పోషిస్తున్నాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ సినిమా అద్భుతంగా ఉండటం ఖాయమని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ ఈ మధ్యే ఓఎంజీ2 మూవీలో శివుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కన్నప్పలోనూ అతనిది అదే పాత్రనా అన్న సందేహం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప మూవీని ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మంచు విష్ణుకు చెందిన అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ తోపాటు ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, ముకేశ్ రిషిలాంటి వాళ్లు నటిస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర సౌత్ ఇండియా భాషలు, హిందీల్లోనూ పాన్ ఇండియా మూవీగా రానుంది. అక్షయ్ కుమార్ ఈ మధ్యే బడే మియా ఛోటే మియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Whats_app_banner