Rakul Preet Singh: హిట్ సినిమా చేజారినందుకు ఏడ్చేసిన రకుల్‌ప్రీత్ సింగ్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని
MS Dhoni Biopic: బాలీవుడ్‌లో పాగా వేయాలని చాలా రోజుల నుంచి రకుల్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. 2016లో వచ్చిన ధోనీ బయోపిక్‌లో నటించే అవకాశం రకుల్‌కి వచ్చింది. కానీ?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన రకుల్‌ప్రీత్ సింగ్ అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. కానీ ఈ అమ్మడికి ఆశించిన మేరకు అక్కడ హిట్స్ లభించడం లేదు. మరోవైపు టాలీవుడ్‌లోనూ రకుల్‌కి అవకాశాలు కరువయ్యాయి. దాంతో కెరీర్‌లో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్‌గా నటుడు రణవీర్ అలహాబాలియాతో యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చింది.
నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ - ది అన్‌టోల్డ్ స్టోరీ’లో దిశా పటానీ స్థానంలో తొలుత రకుల్‌ప్రీత్ సింగ్‌నే అనుకున్నారు. కానీ అనూహ్యరీతిలో సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రకుల్ గుర్తుచేసుకుంటూ బాధపడింది.
ధోనీ బయోపిక్ చేజారిందిలా
ధోనీ బయోపిక్ షూటింగ్ షెడ్యూల్‌ను నెల రోజులు పోస్ట్‌పాన్ చేయడంతో అప్పట్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల డేట్స్‌తో క్లాష్ వచ్చిందని రకుల్ గుర్తు చేసుకుంది. ‘‘దిశా పటానీ పోషించిన పాత్ర నేను చేయాల్సింది. కాస్ట్యూమ్, స్క్రిప్ట్ రీడింగ్ కూడా పూర్తయ్యింది. కానీ ఆ తర్వాత డేట్స్ మారాయి. దాంతో నేను అప్పటికే చేస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల సినిమాల డేట్స్‌తో క్లాష్ వచ్చింది. సర్దుబాటు కోసం ప్రయత్నించా. కానీ ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ నెల రోజుల్లో విడుదల కావాల్సిన ఉండగా .. ఇంకా రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. దాంతో డేట్స్ అస్సలు అడ్జస్ట్ చేయలేకపోయా. అంత మంచి సినిమా మిస్ అయ్యానని తర్వాత ఏడ్చేశాను’’ అని రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.
ఎంఎస్ గురించి: ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ
ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ధోనీ పాత్రని పోషించాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ ఆరంభం నుంచి భారత్‌కు ప్రపంచకప్ అందించే వరకు సాగిన ప్రయాణాన్ని ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో చూపించారు. ఈ మూవీలో కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్, కుముద్ మిశ్రా, భూమిక, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన మూవీ.. అప్పట్లో రూ.200 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది.
కన్నడలో రొమాంటిక్ డ్రామా గిల్లి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రకుల్. ఆమె నటించిన తొలి టాలీవుడ్ చిత్రం కెరటం. దక్షిణాది సినిమాల్లో బిజీగా ఉన్న టైమ్‌లోనే బాలీవుడ్ వైపు రకుల్ వెళ్లింది. హిమాన్ష్ కోహ్లీ సరసన దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించిన యారియన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఈ భామ అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో అయ్యారీ, దే దే ప్యార్ దే, సిమ్లా మిర్చి, అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్, ఛత్రివాలీ, ఐ లవ్ యూ వంటి చిత్రాల్లో నటించింది.
రీఎంట్రీకి ప్రయత్నాలు
బాలీవుడ్‌లో రకుల్‌కి చెప్పుకోదగ్గ హిట్‌లు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తోంది. కానీ ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తుండటంతో 33 ఏళ్ల రకుల్‌కి నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కమల్ హాసన్ నటించిన ఇండియన్-2లో సిద్ధార్థ్ సరసన నటించింది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో రకుల్ కష్టాలు రెట్టింపయ్యాయి.