Ram Charan: అయ్యప్ప మాలలోనే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ కోసం లక్నో‌కి రామ్ చరణ్-actor ram charan goes barefoot as he heads to lucknow for game changer teaser launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: అయ్యప్ప మాలలోనే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ కోసం లక్నో‌కి రామ్ చరణ్

Ram Charan: అయ్యప్ప మాలలోనే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ కోసం లక్నో‌కి రామ్ చరణ్

Galeti Rajendra HT Telugu

Game Changer teaser: గేమ్ ఛేంజర్ టీజర్‌ను ఈరోజు సాయంత్రం రాబోతుండగా.. ఈ టీజర్‌ను లాంచ్ చేయడానికి హైదరాబాద్ నుంచి లక్నోకి రామ్ చరణ్ వెళ్లారు.

రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ లాంచ్ కోసం రామ్ చరణ్ శనివారం హైదరాబాద్ నుంచి లక్నో వెళ్లారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్‌ చరణ్ నలుపు రంగు దుస్తులు ధరించి.. పాద రక్షలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజు గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ లాంచ్‌ చేయనున్నారు.

రామ్ చరణ్ ఎక్కువగా దీక్షలు చేస్తుంటారు. సినిమా షూటింగ్‌ల్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా.. అయ్యప్ప స్వామి లేదా ఆంజనేయ స్వామి మాల వేస్తుంటారు.

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్

డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‌చరణ్‌కి జంటగా కియారా అద్వానీ నటించింది. కార్తిక్ సుబ్బరాజ్ రాసిన కథ ఆధారంగా గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

ప్రమోషన్స్ చూస్తుంటే రాజకీయాలకు సంబంధించిన కథగా అనిపిస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. పల్లు మార్లు వాయిదా తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి ముంగిట జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లలోకి రానుంది.

గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా, సుకుమార్ కాంబినేషన్‌లో వరుసగా రామ్ చరణ్ సినిమాలు చేయనున్నారు. బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటించనుంది. సుకుమార్‌తో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2 ది: రూల్ రిలీజ్ హడావుడిలో ఉన్నారు. పుష్ప-2 మూవీ డిసెంబరు 5న రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.