Virat Kohli: క్రికెటర్ కోహ్లీ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ వెటకారం.. పాత సంగతుల్ని తెరపైకి తెచ్చి ఉతికారేసిన నెటిజన్లు-actor prakash raj gets brutally trolled for mocking virat kohli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virat Kohli: క్రికెటర్ కోహ్లీ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ వెటకారం.. పాత సంగతుల్ని తెరపైకి తెచ్చి ఉతికారేసిన నెటిజన్లు

Virat Kohli: క్రికెటర్ కోహ్లీ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్ వెటకారం.. పాత సంగతుల్ని తెరపైకి తెచ్చి ఉతికారేసిన నెటిజన్లు

Galeti Rajendra HT Telugu
Aug 31, 2024 08:53 AM IST

Prakash Raj: ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షాని టార్గెట్ చేస్తూ విరాట్ కోహ్లి ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ట్రోలింగ్‌కి గురయ్యాడు. 2019లో ప్రకాష్ రాజ్‌కి వచ్చిన ఓట్ల లెక్కలను కూడా తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ, ప్రకాష్ రాజ్
విరాట్ కోహ్లీ, ప్రకాష్ రాజ్

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్వీట్‌కి వెటకారంగా స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నారు. ఈ స్టార్ క్రికెటర్ ఏది పోస్ట్ చేసినా నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ చేసిన ఒక పోస్ట్‌కి ప్రకాష్ రాజ్ వెటకారంగా స్పందించి..అభిమానులతో మొట్టికాయలు తిన్నాడు.

విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఏంటి?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీగా ఉన్న జై షా త్వరలోనే ఆ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో జై షాకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు జై షాకి అభినందనలు. ఈ జర్నీలో మీరు విజయవంతమవ్వాలి’’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ప్రకాష్ రాజ్.. జై షాని ఉద్దేశిస్తూ వెటకారంగా రిప్లై ఇచ్చాడు.

‘‘భారత్‌కి చెందిన బ్యాట్స్‌మెన్, బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్, ఓవరాల్‌గా ఆల్‌రౌండర్. అన్నింటికీ మించి ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రేట్ లెజెండ్‌కి అందరం స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం’’ అని ప్రకాష్ రాజ్ వెటకారంగా రిప్లై ఇచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ మొదలైంది.

డిపాజిట్లు రాలేదు మర్చిపోయావా?

ప్రకాష్ రాజ్ సినిమాల గురించే కాకుండా అతని రాజకీయ జీవితాన్ని కూడా తెరపైకి తెచ్చి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉతికారేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. కానీ డిపాజిట్లు కూడా అతనికి రాలేదు. గెలిచిన బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 6 లక్షలకి పైగా ఓట్లు సాధించగా.. ప్రకాశ్ రాజ్‌కి కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ప్రకాష్ రాజ్‌ను ఆడుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్‌ ఎందుకు స్పందించాడు?

వాస్తవానికి విరాట్ కోహ్లీతో ప్రకాష్ రాజ్‌కి ఎలాంటి విభేదాలు లేవు. కానీ బీజేపీతో పుష్కలంగా ఉన్నాయి. దాంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో అతడ్ని టార్గెట్ చేయబోయి.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి ప్రకాష్ రాజ్ దొరికిపోయాడు.

డిసెంబరు 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న 35 ఏళ్ల జై షా.. ఐసీసీ ఛైర్మన్ అయిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డును అందుకోనున్నాడు. గత కొన్నేళ్లుగా బీసీసీఐలో వివిధ హోదాలో జై షా కొనసాగుతున్నారు.

ప్రకాష్ రాజ్ రిప్లైకి విరాట్ కోహ్లీ మాత్రం స్పందించలేదు. అలానే జై షా కూడా మౌనంగా ఉండిపోయారు. భారత్ జట్టు సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కి ముందు క్రికెటర్లకి టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు.

Whats_app_banner