Rangamarthanda Teaser: ప్రకాష్ రాజ్‌ను నీచుడంటూ ఫైర్ అయిన బ్రహ్మీ.. కోపంతో ఊగిపోయిన రమ్యకృష్ణ-krishnavamsi rangamarthanda teaser released today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rangamarthanda Teaser: ప్రకాష్ రాజ్‌ను నీచుడంటూ ఫైర్ అయిన బ్రహ్మీ.. కోపంతో ఊగిపోయిన రమ్యకృష్ణ

Rangamarthanda Teaser: ప్రకాష్ రాజ్‌ను నీచుడంటూ ఫైర్ అయిన బ్రహ్మీ.. కోపంతో ఊగిపోయిన రమ్యకృష్ణ

Rangamarthanda Teaser: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం రంగమార్తండ. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

రంగమార్తండ టీజర్ విడుదల

Rangamarthanda Teaser: చాలా రోజుల గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకున్న కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం రంగమార్తండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమా రానుంది. తాజాగా ఈ చిత్రం అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రంగమార్తండ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

రంగమార్తండ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. నేను ఒక నటుడిని అని చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. "రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా" అని ఆగ్రహంతో బ్రహ్మానందం డైలాగ్ మరింత ఆసక్తి రెకెత్తిస్తోంది. "నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తండ రాఘవరావును" అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మరింత అదిరిపోయింది.

ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు రాహుల్ సిప్లీగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ పతాకంపై కలిపు మధు, ఎస్ వెంకట రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.