Rangamarthanda Soul Song: రంగమార్తండ నుంచి అదిరిపోయే సాంగ్.. ఇళయరాజా గళం, సిరివెన్నెల కలం నుంచి పురుడు పోసుకున్న పాట-rangamarthanda soul song puvvai virise pranam lyrical song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rangamarthanda Soul Song: రంగమార్తండ నుంచి అదిరిపోయే సాంగ్.. ఇళయరాజా గళం, సిరివెన్నెల కలం నుంచి పురుడు పోసుకున్న పాట

Rangamarthanda Soul Song: రంగమార్తండ నుంచి అదిరిపోయే సాంగ్.. ఇళయరాజా గళం, సిరివెన్నెల కలం నుంచి పురుడు పోసుకున్న పాట

Maragani Govardhan HT Telugu
Feb 22, 2023 12:07 PM IST

Rangamarthanda Soul Song: కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సరికొత్త రంగమార్తండ. ఈ సినిమా నుంచి అదిరిపోయే పాట విడుదలైంది. రంగమార్తండ ఆత్మగీతంగా కృష్ణవంశీ అభివర్ణించిన ఈ పాటను ఇళయరాజా ఆలపించగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాశారు.

రంగమార్తండ నుంచి పువ్వై విరిసే ప్రాణం సాంగ్ విడుదల
రంగమార్తండ నుంచి పువ్వై విరిసే ప్రాణం సాంగ్ విడుదల

Rangamarthanda Soul Song: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ మెగాఫోన్ పట్టి చాలా రోజులే అయింది. చివరగా ఆయన నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా వచ్చి ఆరేళ్లు కావస్తుంది. మూవీస్‌కు కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తండ. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. రంగమార్తండ నుంచి పాటను విడుదల చేసింది.

"పువ్వై విరిసే ప్రాణం.. పండే మురిసే ప్రాయం.. రెండూ ఒకటే నాణానికి బొమ్మ బొరుసంతే" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రంగమార్తండ ఆత్మగీతంగా అభివర్ణించిన కృష్ణవంశీ ఈ పాటను తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా హృద్యంగా ఆలపించారు. ఆయన గళంలో పురుడు పోసుకున్న ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది.

దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ కలం నుంచి రాలువాలిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆయన తరహా సందేశాన్ని సాంగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 3 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగిన ఈ సాంగ్ లిరిక్స్ అందరినీ మెప్పిస్తోంది. బహుశా సిరివెన్నెల రాసిన చివరి పాట ఇదే కావచ్చు.

ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, ఆదర్శ బాలకృష్ణ, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ పతాకంపై కలిపు మధు, ఎస్ వెంకట రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

టాపిక్