Prabhas: ‘చక్రం’ ఐడియా ప్రభాస్‌దే.. యాక్షన్ ఫిల్మ్ వద్దన్నాడు- కృష్ణ వంశీ-director krishna vamshi reveals chakram back story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas: ‘చక్రం’ ఐడియా ప్రభాస్‌దే.. యాక్షన్ ఫిల్మ్ వద్దన్నాడు- కృష్ణ వంశీ

Prabhas: ‘చక్రం’ ఐడియా ప్రభాస్‌దే.. యాక్షన్ ఫిల్మ్ వద్దన్నాడు- కృష్ణ వంశీ

Maragani Govardhan HT Telugu
Jul 13, 2022 09:10 AM IST

ప్రభాస్ కెరీర్‌లో చక్రం సినిమా ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా దర్శకుడు కృష్ణ వంశీ ఆ చిత్రం గురించి ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. ప్రభాస్ యాక్షన్ సినిమా వద్దన్నాడని ఆయన అన్నారు.

<p>కృష్ణ వంశీ</p>
<p>కృష్ణ వంశీ</p> (Twitter)

ప్రభాస్ కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నాయి. కానీ నటుడిగా అతడికి చక్రం సినిమా మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ చిత్రం తెలుగులో క్లాసిక్‌గా నిలిచినప్పటికీ ప్రేక్షకాదరణ మాత్రం పొందలేదు. సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులే పడతాయి. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. చక్రం సినిమా ఐడియా ప్రభాస్‌దేనట. ఈ విషయాన్ని చక్రం దర్శకుడు కృష్ణ వంశీనే స్వయంగా తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయం చెప్పారు.

"వర్షం లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ వద్దకు చాలా మంది దర్శకుడు ఫుల్ లెంగ్త్ యాక్షన్ కథలతో వచ్చారట. నేను కూడా అలాంటి కథనే సిద్ధం చేశాను. కానీ ప్రభాస్ మాత్రం కంటెంట్‌తో పాటు యాక్టింగ్‌కు ప్రాధాన్యమున్న సినిమా కావాలన్నాడు. ఆ విధంగా చక్రం స్క్రిప్టుతో అతడి వద్దకు వెళ్లాను" అని కృష్ణ వంశీ తెలిపాడు.

చక్రం సినిమా 2005లో విడుదలైంది. అసిన్, చార్మీ కౌర్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో ప్రభాస్.. క్యాన్సర్ రోగిగా నటించాడు. తను చనిపోయే లోపు కొంతమందినైనా హ్యాపీగా ఉంచాలనుకుంటాడు. ఇందుకోసం వారికి అవసరమైన సహాయం చేస్తూ.. ముందుకెళ్తుంటాడు. ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రులను, ప్రేమించిన అమ్మాయిని ఎలా కన్విన్స్ చేశాడు? నిజం తెలుసుకున్నాక వారి రియాక్షన్ ఏంటి? అనేది మిగతా కథ. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతేకాకుండా నంది పురస్కారం కూడా లభించింది.

ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా నాగ్ అశ్విన్‌తో ఓ సైంటిఫిక్ యాక్షన్ చిత్రానికి ఓకే చెప్పాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ అనుకుంటున్నారు. వీటితో పాటు మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాకు ఒప్పుకున్నాడు.

సంబంధిత కథనం

టాపిక్