Aadujeevitham OTT: ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమా!: వివరాలివే-aadujeevitham ott prithviraj sukumaran survival drama film to release on disney plus hotstar with longer runtime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadujeevitham Ott: ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమా!: వివరాలివే

Aadujeevitham OTT: ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమా!: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 31, 2024 02:11 PM IST

The Goat Life Aadujeevitham OTT Release: ఆడుజీవితం సినిమా మరింత ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఓటీటీ వెర్షన్ నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఆ వివరాలివే..

Aadujeevitham OTT: ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమా!: వివరాలివే
Aadujeevitham OTT: ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి రానున్న పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమా!: వివరాలివే

Aadujeevitham OTT: మలయళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం - ది గోట్ లైఫ్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సర్వైవల్ డ్రామా మాస్టర్ పీస్ అంటూ టాక్ వచ్చింది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ఎమోషనల్ సర్వైవల్ మూవీ అంచనాలను అందుకుంది. దీంతో మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే, ఆడుజీవితం సినిమా ఓటీటీ వెర్షన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది.

ఆడుజీవితం సినిమా థియేటర్లలోకి 2 గంటల 53 నిమిషాల రన్‍టైమ్‍తో వచ్చింది. ఇది కాస్త ఎక్కువ రన్‍టైమ్ అయినా.. ఎమోషనల్‍గా ఉండటంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి మరింత ఎక్కువ రన్‍టైమ్‍తో రానుందని సమాచారం వెల్లడైంది. ఆ వివరాలివే..

ఎక్కువ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి..

ఆడుజీవితం సినిమా ఫైనల్ రన్‍టైమ్ 3 గంటల 30 నిమిషాల పాటు వచ్చిందని దర్శకుడు బ్లెస్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, థియేటర్ల కోసం సుమారు 30 నిమిషాల ఫుటేజ్‍ను తగ్గించినట్టు తెలిపారు. దీంతో థియేటర్లలో సుమారు 3 గంటల నిడివితో ఈ చిత్రం వచ్చింది. అయితే, ఓటీటీలో మాత్రం 3 గంటల 30 నిమిషాల లాంగ్ వెర్షన్‍ను తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే..

ఆడుజీవితం సినిమా అన్‍కట్ వెర్షన్‍ను థియేటర్లలో కూడా కొన్ని రోజుల తర్వాత ప్రదర్శించాలని మూవీ టీమ్ భావిస్తోందని తెలుస్తోంది. ఇదే లాంగ్ రన్‍టైమ్‍తో ఓటీటీలోకి కూడా రానుంది. ఆడుజీవితం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది.

మలయాళ సినిమాలు ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలకు థియేట్రికల్ రన్ కొనసాగుతుండటంతో ఇంకా ఓటీటీలోకి రాలేదు. అలానే.. ఆడుజీవితం చిత్రానికి కూడా థియేట్రికల్ రన్ ఎక్కువగా ఉంటే ఓటీటీలోకి ఆలస్యంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మే నెలలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. థియేట్రికల్ రన్‍పై ఇది ఆధారపడి ఉంటుంది. ఆడుజీవితం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు హాట్‍స్టార్ తీసుకుంది.

ఆడుజీవితం గురించి..

ఆడుజీవితం సినిమా కోసం సుమారు 11ఏళ్లు కష్టపడ్డారు దర్శకుడు బ్లెస్సి. ఈ చిత్రం పృథ్విరాజ్ సుకుమారన్ నటనకు అందరూ సలాం కొడుతున్నారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి బానిసలా మారిన నజీబ్ అనే వ్యక్తి జీవిత ఘటనలతో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. ఎడారి దేశం నుంచి బానిసత్వం నుంచి తప్పించుకునేందుకు నజీబ్ ఎదుర్కొన్న సవాళ్లను ఎమోషనల్‍గా చూపించారు. ఆడుజీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు బ్లెస్సీ రూపొందించారు. ఈ మూవీలో అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, తలిబ్ అల్ అలూషి ఈ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‍గా నిలిచింది.

ఆడుజీవితం సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి మూడు రోజుల్లో సుమారు రూ.50కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Whats_app_banner