National Awards: గ‌త ఏడాది 10 అవార్డులు - ఈ సారి ఒక్క‌టి - నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు నిరాశ‌!-70th national film awards tollywood wins single award karthikeya 2 bags best feature film in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  National Awards: గ‌త ఏడాది 10 అవార్డులు - ఈ సారి ఒక్క‌టి - నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు నిరాశ‌!

National Awards: గ‌త ఏడాది 10 అవార్డులు - ఈ సారి ఒక్క‌టి - నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు నిరాశ‌!

Nelki Naresh Kumar HT Telugu
Aug 16, 2024 03:07 PM IST

National Awards: 70వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ సారి టాలీవుడ్‌కు కేవ‌లం ఒకే ఒక అవార్డు ద‌క్కింది. బెస్ట్ తెలుగు మూవీగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకున్న‌ది. ఈ ఒక్కటి మిన‌హా తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రే అవార్డు రాక‌పోవ‌డంతో అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు.

నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌
నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌

National Awards 70వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ సారి నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల్లో మ‌ల‌యాళం, క‌న్న‌డ, త‌మిళ‌ సినిమాలు ఎక్కువ‌గా అవార్డుల‌ను గెలుచుకున్నాయి. తెలుగు సినిమాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ ఫిల్మ్‌గా మ‌ల‌యాళం మూవీ ఆట్ట‌మ్ అవార్డును గెలుచుకున్న‌ది. బెస్ట్ యాక్ట‌ర్‌గా కాంతార మూవీకిగాను రిష‌బ్ శెట్టి అవార్డును ద‌క్కించుకున్నాడు. బెస్ట్ హీరోయిన్ అవార్డు ఈ సారి ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ద‌క్కింది. నిత్యామీన‌న్ (తిరుచిత్రాంబ‌ళం), మాన‌సి ప‌రేఖ్ ( క‌చ్ ఎక్స్‌ప్రెస్ గుజ‌రాతీ మూవీ) అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

గ‌త ఏడాది ఫుల్‌...ఈ ఏడాది నిల్‌...

69వ నేష‌న‌ల్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో పాటు మొత్తం ప‌ది విభాగాల్లో అవార్డుల‌ను గెలుచుకొని జాతీయ స్థాయిలో టాలీవుడ్ స‌త్తా చాటింది. ఈ సారి మాత్రం తెలుగు ఇండ‌స్ట్రీకి దారుణ‌మైన నిరాశే మిగిలింది. యాక్టింగ్‌తో పాటు సాంకేతిక విభాగాల్లో తెలుగు సినిమాకు ఒక్క అవార్డు కూడా ద‌క్క‌లేదు. టాలీవుడ్‌కు నేష‌న‌ల్ అవార్డులు ద‌క్క‌క‌పోవ‌డంలో తెలుగు సినీ అభిమానులు డిస‌పాయింట్ అవుతోన్నారు.

ఉత్త‌మ తెలుగు మూవీగా కార్తికేయ 2

70వ నేష‌న‌ల్ అవార్డుల్లో ప్రాంతీయ సినిమాల విభాగంలో బెస్ట్ తెలుగు మూవీగా నిఖిల్ కార్తికేయ 2 అవార్డును సొంతం చేసుకున్న‌ది. తెలుగు నుంచి కేవ‌లం కార్తికేయ 2 మిన‌హా మ‌రే మూవీ అవార్డుల‌ను అందుకోలేక‌పోయింది.కార్తికేయ 2 సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కృష్ణ‌త‌త్వానికి యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ అంశాల‌ను జోడించి తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. కేవ‌లం 15 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 120 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2022లో టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కార్తికేయ 2 సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

జానీ మాస్ట‌ర్‌కు అవార్డు కానీ...

70వ నేష‌న‌ల్ అవార్డుల్లో తెలుగు కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు నేష‌న‌ల్ అవార్డు ద‌క్కింది. అయితే తెలుగు సినిమాకు కాకుండా త‌మిళ మూవీ తిరుచిత్రాంబ‌ళం సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాప‌ర్‌గా జానీ మాస్ట‌ర్ జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు.