OTT Family Drama Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ.. మిస్ అవొద్దు!-35 chinna katha kaadu steaming started on aha ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Drama Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ.. మిస్ అవొద్దు!

OTT Family Drama Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ.. మిస్ అవొద్దు!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 09:07 AM IST

35 - Chinna Katha Kaadu OTT Streaming: 35 - చిన్న కథ కాదు సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. చాలా మంది ఎదురుచూసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. థియేటర్లలో చాలా ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీని చూడకపోతే ఓటీటీలో అసలు మిస్ అవొద్దు. ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..

OTT Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ.. మిస్ అవొద్దు!
OTT Movie: ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ.. మిస్ అవొద్దు!

‘35 - చిన్న కథ కాదు’ సినిమా బోలెడు ప్రశంసలు దక్కించుకుంది. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీని హీరో దగ్గుబాటి రానా సమర్పించడం.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నాని ప్రశంసల వర్షం కురిపించడంతో మరింత ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే 35 - చిన్న కథ కాదు చిత్రం అన్ని విషయాల్లో ఆకట్టుకుంది. మంచి చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో ఈ చిత్రం రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

35 - చిన్న కథ కాదు మూవీకి మంచి స్పందన రావటంతో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేసింది.

స్ట్రీమింగ్ మొదలు

35 - చిన్న కథ కాదు చిత్రం ఆహా ఓటీటీలో నేడు (అక్టోబర్ 2) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో మంచి ధరతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా తీసుకుంది. కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍కు సోషల్ మీడియాలో బాగానే ప్రమోట్ చేసింది. నేడు ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

35 - చిన్న కథ కాదు చిత్రం హృదయాన్ని తాకేలా ఫీల్‍గుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీలా ఉంటుంది. చదువులో పిల్లలకు తల్లిదండ్రులు మద్దతుగా నిలువడం ఎంత ముఖ్యమో ఈ చిత్రంలో డైరెక్టర్ నంద కిశోర్ ఇమానీ ఆకట్టుకునేలా చెప్పారు. పిల్లల చదువుపై మధ్యతరగతి తల్లిదండ్రులకు ఉండే ఆలోచనలు, వారి కుటుంబ పరిస్థితులు ఇలా చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. పిల్లల్లో ఉండే సందేహాలను పట్టించుకోవాలనే అంశం కూడా ఉంటుంది. ఒకవేళ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడకపోతే ఆహా ఓటీటీలో మిస్ అవొద్దు.

నివేదా పర్ఫార్మెన్స్ హైలైట్

మధ్యతరగతి తల్లి సరస్వతిగా ఈ మూవీలో నివేదా థామస్ నటనతో మెప్పించారు. సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వకీల్ సాబ్ తర్వాత సుమారు మూడేళ్ల తర్వాత ఈ మూవీతోనే తెలుగులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు నివేదా. మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో వావ్ అనిపించారు. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్, గౌతమి, అభయ్ శంకర్, భాగ్యరాజ్ కీరోల్స్ చేశారు.

35 - చిన్న కథ కాదు చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. తిరుపతి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని ఉపాధ్యాయుడు జీరో అని పరిగణిస్తుంటాడు. స్కూల్‍లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ పిల్లాడు తప్పక 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతడికి తన తల్లి ఎలా మ్యాథ్స్ నేర్పారు, కావాల్సిన మార్కులు తెచ్చుకున్నాడా అనే స్టోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కామెడీ, ఎమోషన్లతో హృదయాన్ని తాకేలా సాగుతుంది. ఈ చిత్రాన్ని సృజన్, సిద్ధార్థ్ రాళ్లపల్లి ప్రొడ్యూజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా సమర్పించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు.