2018 OTT Release Date: 2018 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?-2018 ott release date is here when and where to watch this malayalam blockbuster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  2018 Ott Release Date Is Here When And Where To Watch This Malayalam Blockbuster

2018 OTT Release Date: 2018 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?

సూపర్ హిట్ మూవీ 2018
సూపర్ హిట్ మూవీ 2018

2018 OTT Release Date: 2018 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ ఎప్పుడు ఎక్కడ చూడాలో తేలిపోయింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా నిలిచిన 2018 త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

2018 OTT Release Date: ఈ మధ్య మలయాళ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్న 2018 మూవీ ఓటీటీలోకి రాబోతోంది. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం వెర్షన్లలోనూ రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ 2018 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో జూన్ 9 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఏమీ రాలేదు.

2018 మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ భారీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ.138 కోట్లు వసూలు చేసింది. కేరళ, ఓవర్సీస్ లలో కలిపి సుమారు రూ.128 కోట్ల వరకూ రాబట్టింది. కర్ణాటకలో మలయాళ వెర్షనే రూ.4 కోట్లు వసూలు చేసి.. ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించి మలయాళ మూవీల్లో రెండోస్థానంలో నిలిచింది.

ఈ సినిమా రిలీజైన మొదట్లో బెంగళూరులో కేవలం 30 షోలే ఉండగా.. ఆ తర్వాత వాటిని 100 షోలకు పెంచారు. ఇక ఇప్పుడు మిగతా భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో మేకర్స్ పై మరిన్ని కాసుల వర్షం కురవనుంది. ఈ శుక్రవారం (మే 26) ఈ డబ్ వెర్షన్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగులోనూ సోమవారం (మే 22) 2018 ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2018లో కేరళలో వచ్చిన భారీ వరదల్లో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటి భయానక వరదలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ సాగే ఈ మూవీకి ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ ఆశతో ఉన్నారు.

సంబంధిత కథనం