Medak Election Politics: అక్కడ స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు, మెదక్, జహీరాబాద్‌లో ప్రయత్నాలు
Medak Election Politics: మెదక్, జహీరాబాద్ నియోజక వర్గాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంనేందుకు మూడు ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయి.
రెండు లోక్ సభ Loksabha నియోజక వర్గాలలో, మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో, స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీ లో చేర్చుకుంటే తమ అభ్యర్థుల విజయ అవకాశాలు పెరుగుతాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
ఇప్పటికే మెదక్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా Nomination నామినేషన్ వేసిన పృథ్విరాజ్ అనే వ్యక్తి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో ఆదివారం సాయంత్రం చేరారు.
నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి, సోమవారం Last Day చివరిరోజు కాబట్టి, ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా స్వతంత్ర అభ్యర్థులతో తీవ్ర మంతనాలు జరుపుతున్నాయి. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి, మొత్తం 54 నామినేషన్లు రాగా, అందులో ఒక్కటి తిరస్కరించారు.
ఒకరు కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో, అతను సోమవారం నామినేషన్ ఉప సంహరించుకోనున్నారు. ఎన్నికల బరిలో 52 మంది ఉండటంతో వారంతా పోటీలో ఉంటే, నాలుగు ఈవీఎం లు ఉపయోగించాల్సి వస్తుంది. నాలుగు ఈవీఎంలు ఉపయోగించడం కూడా, తమ తమ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తాయని, మూడు ప్రధాన పార్టీలు కూడా భావిస్తున్నాయి.
అందుబాటులో లేకుండా పోయిన స్వతంత్రులు....
ఆయా పార్టీల నాయకులూ తరచుగా ఫోన్ చేయటం, సంప్రదింపుల కోసం ఇంటికి తరచుగా వస్తుండటంతో, నామినేషన్ ఉప సంహరించుకోవడం ఇష్టం లేని స్వతంత్ర అభ్యర్థులు ఫోన్ స్విచ్ అఫ్ చేసుకునే వారికీ అందుబాటులో లేకుండా వెళ్లారని సమాచారం.
జహీరాబాద్ నియోజకవర్గానికి కూడా 40 మంది నామినేషన్లు వేయగా, అందులో ఎన్నికల అధికారులు 14 నామినేషన్లు తిరస్కరించడంతో, ప్రధాన పార్టీల పని ఒకింత సులువు అయ్యిందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా, ఇంకా 26 మంది బరిలో ఉండటంతో, మూడు ప్రధాన పార్టీలో కూడా స్వతంత్ర పార్టీ అభ్యర్థులను ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసాయి.
26 మంది అభ్యర్థులు ఉంటె, రెండు ఈవీఎంలు ఉపయోగించాలిసిన పరిస్థితి వస్తుందని, అది తమ విజయావకాశాలను ప్రభావితం చేస్తున్నదని మూడు ప్రధాన పార్టీలు అంటున్నాయి.
స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువమంది బరిలో ఉంటె, వారికీ కేటాయించిన గుర్తులు తమ గుర్తులను పోలి ఉంటే కూడా తమ తమ అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని ఆయా పార్టీ నాయకులూ భావిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నామినేటెడ్ పోస్టు ఇస్తామని స్వతంత్రులను తమ పార్టీలోకి వెల్కమ్ చెబుతుంటే, తమ పార్టీలో పదవులు ఇస్తామని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. వారి ప్రయత్నాలు సఫలీకృతం అయితే, నామినేషన్లు వేసిన స్వతంత్ర పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో సోమవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం