BRS MP Candidates 2024 : మెదక్, నాగ‌ర్‌క‌ర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - తెరపైకి ఊహించని పేరు-brs announced candidates for medak and nagarkurnool loksabha seats 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Mp Candidates 2024 : మెదక్, నాగ‌ర్‌క‌ర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - తెరపైకి ఊహించని పేరు

BRS MP Candidates 2024 : మెదక్, నాగ‌ర్‌క‌ర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - తెరపైకి ఊహించని పేరు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 22, 2024 02:03 PM IST

BRS Loksabha Candidates 2024: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్(BRS Party) పార్టీ. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు
బీఆర్ఎస్ అభ్యర్థులు

BRS Loksabha Candidates 2024: పార్లమెంట్ ఎన్నికలకు(Loksabha Elections 2024) సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party). ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజాగా మరో రెండు స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేసింది. ఇందులో కీలకమైన మెదక్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రాంరెడ్డిని ఖరారు చేసింది. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చింది.

కీలకమైన మెదక్ స్థానం నుంచి ఊహించని విధంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిజానికి ఈ స్థానం నుంచి కేసీఆరే పోటీ చేస్తారన్న టాక్ వినిపించింది. ఆయన కాకపోతే…. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కొచ్చన్న వార్తలు వినిపించాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో…. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఈ సీటును ప్రకటిస్తామని బీఆర్ఎస్ చెప్పింది. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఖరారు చేయటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఊహించిన విధంగానే ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు…. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ దక్కింది. బీఎస్పీకి రాజీనామా చేసి…. ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు ఆర్ఎస్పీ.

BRS Loksabha Candidates 2024 :బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా:

  1. చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
  2. వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
  3. మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మారెడ్డి
  4. ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
  5. జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
  6. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
  7. కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్
  8. పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
  9. మహబూబ్‌ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
  10. ఖమ్మం -నామా నాగేశ్వరరావు
  11. మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
  12. మెదక్ - వెంకట్రామిరెడ్డి
  13. నాగర్ కర్నూలు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్…. 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ్నుంచి పలువురు నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో…. ఈ స్థానాల నుంచి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.