Zahirabad Loksabha: జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో లింగాయత్ Vs కాపు… పోటాపోటీగా వ్యూహాలు-selection of lok sabha candidates in zaheerabad an issue for the parties ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Selection Of Lok Sabha Candidates In Zaheerabad An Issue For The Parties

Zahirabad Loksabha: జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో లింగాయత్ Vs కాపు… పోటాపోటీగా వ్యూహాలు

HT Telugu Desk HT Telugu
Mar 13, 2024 09:38 AM IST

Zahirabad Loksabha: లింగాయత్‌ Lingayat సామాజిక వర్గం అధికంగా ఉండే జహీరాబాద్‌లో లోక్‌సభ అభ్యర్థిత్వంపై నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.

జహీరాబాద్ టికెట్ కు కుల సమీకరణాలు
జహీరాబాద్ టికెట్ కు కుల సమీకరణాలు

Zahirabad Loksabha: ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటాయి రాజకీయ పార్టీలు.. అందులో ముందు వరుసలో ఉండేది కుల సమీకరణాలు. ఆ ప్రాంతంలో ఏ కులం జనాభా ఎక్కువ ఉన్నారో చూసి వారికి టికెట్ ఇచ్చి అవతలి పార్టీని బోల్తా కొట్టించే వ్యూహాలు పన్నుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, జహీరాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వ్యూహాలే పన్నుతున్నారు.

కాంగ్రెస్ Congress, బీజేపీ Bjp నుండి లింగాయత్ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. లింగాయత్‌ ఓటర్లు ఎక్కువ ఉన్న ఈ నియోజక వర్గంలో, కాంగ్రెస్ పార్టీ లింగాయత్ సామజిక వర్గానికి చెందిన మాజీ జహీరాబాద్ ఎంపీ, నారాయణఖేడ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ షెట్కార్‌ని తమ అభ్యర్థిగా ప్రకటించింది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ నియోజకవర్గానికి నుంచి పోటీ చేసి గెలిచిన లింగాయత్ సామజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్‌ని బీజేపీలోకి ఆహ్వానించి తమ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

బీఆర్ఎస్ నుండి కాపు సామాజిక నేత…

రెండు ప్రధాన పార్టీలు కూడా ఒకే సామజిక వర్గానికి చెందిన నాయకులను బరిలోకి దించాలని నిర్ణయించుకోవడంతో, బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాన్ని మార్చుకున్నది. ఇక్కడ మరో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దించాలని, ఆ పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయిన, గాలి అనిల్ కుమార్ ని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన అందరు ప్రధాన నాయకులతో పాటు, గాలి అనిల్ కుమార్ అభ్యర్దితిత్వంపై కేసీఆర్ నివాసంలో గత రెండు రోజుల కింద చర్చించారు.

అనిల్ కుమార్‌నుఅభ్యర్థిగా బరిలోకి దించే విషయంలో పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లింగాయత్ ఓట్లు చీలి పోతాయని, కాపు సామాజిక వర్గానికి చెందిన మొత్తం ఓట్లు పడటం వలన తమ పార్టీకి లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులూ భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్‌లో చేరిన గాలి…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీ పఠాన్ చెరువు నియోజకవర్గంలో గాలి అనిల్ కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. సీటు ఇవ్వకపోవడంతో అనిల్ కుమార్ 2018 అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.

కాంగ్రెస్ పార్టీ తరపున 2019 లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుండి పోటీచేసిన గాలి అనిల్ కుమార్ రెండో స్థానంతో సరి పెట్టుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి సీటు ఆశించిన గాలి అనిల్ కుమార్, తనకు టికెట్ రాకపోవడంతో మరో సారి కాంగ్రెస్ పార్టీని వీడి, బీఆర్ఎస్ పార్టీ లో చేరాడు.

బీఆర్ఎస్ పార్టీ నుండి మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆశించిన గాలి అనిల్ కుమార్‌కు, పార్టీ అధిష్టానం మాత్రం తనని జహీరాబాద్ నుండి పోటీచేయమని కోరినట్టు తెలుస్తోంది.

జహీరాబాద్ లోక్ సభ పరిధిలో, ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . అందులో కామారెడ్డి, జహీరాబాద్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

కాంగ్రెస్ ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో, కామారెడ్డిని బీజేపీ గెలుచుకోగా, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.

(ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం