Zhirabad Lok Sabha : జహీరాబాద్​లో త్రిముఖ పోటీ...! గాలి అనిల్ కుమార్ గెలుపు తీరం చేరేనా..?-lok sabha polls 2024 triangular fight in the zahirabad lok sabha constituency who will win this time ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Zhirabad Lok Sabha : జహీరాబాద్​లో త్రిముఖ పోటీ...! గాలి అనిల్ కుమార్ గెలుపు తీరం చేరేనా..?

Zhirabad Lok Sabha : జహీరాబాద్​లో త్రిముఖ పోటీ...! గాలి అనిల్ కుమార్ గెలుపు తీరం చేరేనా..?

HT Telugu Desk HT Telugu
May 05, 2024 01:15 PM IST

Zhirabad Lok Sabha Election 2024: జహీరాబాద్(Zhirabad) నుంచి పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు సొంత సామాజికవర్గ ఓట్లపై ఆశలు పెట్టుకోవటమే గాక… ప్రత్యర్థి పార్టీల ఓట్ల చీలికపై కూడా లెక్కలు వేసుకుంటున్నారు.

గాలి అనిల్ కుమార్
గాలి అనిల్ కుమార్

Zhirabad Lok Sabha Election Fight 2024 : అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారారు గాలి అనిల్ కుమార్. గతంలో తాను పోటీ చేసిన మెదక్ లోక్ సభ సీటు నుంచి ఈసారి జహీరాబాద్ నియోజకవర్గానికి(Zahirabad Lok Sabha constituency) మారారు. నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే… ప్రస్తుతం బీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు.

 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్(Zhirabad) రెండో స్థానంలో నిలిచారు. 2023 ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ ని ఆశించిన భంగపడ్డారు. ఆవుల రాజిరెడ్డికి ఇవ్వటంతో పార్టీని వీడారు. 

 అసెంబ్లీ ఎన్నికల ముందే అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజానికి అక్కడే ఉంటే ఈసారి కూడా కాంగ్రెస్ లో మెదక్ ఎంపీ స్థానం దక్కేదని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

నిరాశలో అనుచరులు…!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున మెదక్ టికెట్ ను గాలి అనిల్ కుమార్() ఆశించారు. అయితే అధినాయకత్వం మాత్రం… జహీరాబాద్(Zhirabad) టికెట్ ను ఇచ్చింది. పార్టీ నిర్ణయాన్ని విభేదించలేని స్థితిలో ఉన్న గాలి అనిల్ కుమార్… జహీరాబాద్(Zahirabad Lok Sabha constituency) నుంచి బరిలో ఉన్నారు.

గాలి అనిల్ కుమార్ నివాసం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. పటాన్ చెరుతో పాటు పలు నియోజకవర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ్నుంచి పోటీ చేస్తే కలిసివచ్చేది. కానీ జహీరాబాద్ లో పోటీ చేస్తుండటంతో పరిస్థితి పెద్దగా అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో గెలిచింది. అయితే అనిల్ కుమార్ కూడా స్థానిక బీఆర్ఎస్ నేతల సాయంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గం........

ఈ సెగ్మెంట్ లో  బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకున్నది. కాంగ్రెస్ 4 గెలవగా…పైగా అధికారంలో కూడా ఉంది. దీంతో కాంగ్రెస్ కు పోటీ ఇవ్వటం అంత సులువు కాదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

మరొక వైపు గత రెండు సార్లు జహీరాబాద్(Zhirabad) బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ (BB Patil)ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది కూడా గాలి అనిల్ కుమార్ కు ఇబ్బందికరంగానే మారింది. పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో కూడా చేరారు. లింగాయక్ ఓట్లు ఎక్కువగా ఉండగా… బీబీ పాటిల్ కు కలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి షెట్కర్ కూడా లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారే. లింగాయత్ ఓట్లు చీలితే తనకు లాభం చేకూరవచ్చని గాలి అనిల్ కుమార్….అంచనా వేసుకుంటున్నారు.

మున్నూరు కాపు ఓట్లపై ఆశలు….

మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్…. ఆ సామజికవర్గం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో వీరి ఓట్లు అత్యధికంగానే ఉన్నాయి. ఆ ఓట్లు పూర్తిగా తనకే పడుతాయనే ఆశభావంతో ఉన్నారు. గత రెండు దశాబ్దాలకుపైగా రాజకీయంలో ఉన్న గాలి అనిల్ కుమార్.. ఎటువంటి పదవి పొందలేకపోయారు. ఈసారైనా గెలిచి..చట్ట సభల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి.

Whats_app_banner