YS Jagan Campaign : మంచి చేసే జగన్ పాలన కావాలా..? దోచుకునే చంద్రబాబు పాలన కావాలా..? వైఎస్ జగన్-cm ys jagan satiers on bjp purandeswari and chandrababu ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Jagan Campaign : మంచి చేసే జగన్ పాలన కావాలా..? దోచుకునే చంద్రబాబు పాలన కావాలా..? వైఎస్ జగన్

YS Jagan Campaign : మంచి చేసే జగన్ పాలన కావాలా..? దోచుకునే చంద్రబాబు పాలన కావాలా..? వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 19, 2024 08:35 PM IST

AP Elections Updates 2024 : వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ కాకినాడ మేమంతా సిద్ధం సభలో ప్రసంగించిన ఆయన…. ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 30 ఏళ్లుగా పురందేశ్వరి.. చంద్రబాబు కోవర్టుగా పని చేస్తుందని ఆరోపించారు.

కాకినాడలో సీఎం జగన్ ప్రచారం
కాకినాడలో సీఎం జగన్ ప్రచారం (YSRCP Twitter)

YS Jagan Eelection Campaign : ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలను తనదైనశైలిలో టార్గెట్ చేస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్(YS Jagan). ఇవాళ కాకినాడలో తలపెట్టిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన ఆయన…. చంద్రబాబు, పవన్ తో పాటు పురందేశ్వరిపై సెటైర్లు విసిరారు. 30 ఏళ్లుగా చంద్రబాబు కోవర్టుగా పురందేశ్వరి పని చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu) పొడవమంటేనే పురందేశ్వరి తన తండ్రికి వెన్నుపోటు పొడిచిందన్నారు. చంద్రబాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుందని దుయ్యబట్టారు. చంద్రబాబు చెబితేనే ఆ నాడు కాంగ్రెస్ లో చేరిందని… మళ్లీ ఇవాళ బీజేపీలో పని చేస్తుందని అన్నారు. ఎక్కడ ఉన్నా….. చంద్రబాబు కోసం పని చేయటమే వదినమ్మ పని అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ పై జగన్ ఫైర్…

ఇక పవన్ కల్యాణ్ పై(Pawan Kalyan) ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. చంద్రబాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌ అవుతారని… స్టాండ్‌ అంటే స్టాండ్‌ అవుతారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు నియయోజకవర్గాలు కూడా 4 అయ్యాయని కామెంట్స్ చేశారు. గాజువాక, భీమవరం వదిలి ఇప్పుడు పిఠాపురంలోకి వచ్చి చేరాడని గుర్తు చేశారు. జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్‌ పవన్… పిఠాపురం వదిలేసి హైదరాబాద్‌ పారిపోయే రకమంటూ సూటిగా టార్గెట్ చేశారు. ఇలాంటి వాళ్లందర్నీ ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు జగన్. జగన్‌ పాలన మార్క్‌ కొనసాగాలంటే మరోసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలా జరగపోతే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుందంటూ కామెంట్స్ చేశారు.

మంచి చేసే జగన్ పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే దోచుకుని దాచుకునే పాలన వస్తుందన్నారు. “ ఫ్యాన్‌కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన వస్తుంది. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు ఉంటుంది. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు పడుతాయి. ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. నామినేటెడ్‌ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్‌ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి” అని జగన్ పిలుపునిచ్చారు.

జన్మభూమి ‍కమిటీలతో మొదలు చంద్రబాబు (Chandrababu)దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్‌ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని జనాలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగతాయని చెప్పుకొచ్చారు. లేదంటే చంద్రబాబు మార్క్‌తో, మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయని చెప్పారు.

Whats_app_banner