Fan Speed Increase : అతితక్కువ ఖర్చుతో సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ పెంచవచ్చు.. సింపుల్
Fan Speed Increase Tips : వేసవిలో ఫ్యాన్ తక్కువగా తిరిగితే చాలా చిరాకుగా ఉంటుంది. అలాకాకుండా అతి తక్కువ ఖర్చుతో మీ ఫ్యాన్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.
ఈ వేసవిలో ఫ్యాన్ లేకుండా ఎవరూ ఉండలేరు. నిజానికి కొన్ని ఇళ్లలో ఏసీ లేదా ఎయిర్ కూలర్ ఉండదు. ఇక ఫ్యాన్ లేని ఇళ్లు ఉండదు. శీతాకాలంలో సీలింగ్ ఫ్యాన్ వేగంగా తిరగకుండా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరిగా నిద్రపట్టదు. కోపం వస్తుంది. ఇతర సమయంలో ఏం కాదు.. కానీ వేసవిలో అలా ఉండదు. విపరీతమైన ఉక్కపోతలో ఫ్యాన్ వేగంగా నడవకపోతే అదో పెద్ద సమస్య. దాని వేగాన్ని ఎలా పెంచుకోవాలో ఇక్కడ ఉంది.
ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయండి
ఫ్యాన్ బ్లేడ్‌లను శుభ్రం చేయడానికి ముందు ఫ్యాన్‌ని స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత ఫ్యాన్ బ్లేడ్లను పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఫ్యాన్ బ్లేడ్ లను తడి గుడ్డతో శుభ్రం చేస్తే దుమ్ము అంతా ఫ్యాన్ బ్లేడ్ లకు అంటుకుపోతుందని గుర్తుంచుకోండి. వాటిని సరిగ్గా శుభ్రం చేయడం సాధ్యం కాదు.
ఫ్యాన్ కండెన్సర్ రీప్లేస్ చేయండి
ఫ్యాన్ బ్లేడ్లను క్లీన్ చేసిన తర్వాత అవి సరిగ్గా నడవకపోతే అసలు సమస్య కండెన్సర్.. వీటిని మార్చడం వల్ల ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. సాధారణంగా కెపాసిటర్ ధర రూ.70-80 మధ్య ఉంటుంది. చాలా మంది ఫ్యాన్ నడుస్తుంది కదా అని దీనిని మార్చరు. వేసవిలో ఫ్యాన్ తక్కువగా తిరిగితే ముందుగా కండెన్సర్ మార్చండి. వీటిని మార్చడం అంత కష్టం కాదు. మీరే దానిని మార్చుకోవచ్చు. పాతదాన్ని తీసివేసి కొత్తది పెట్టేప్పుడు దాని పరిస్థితిని చెక్ చేయండి. మీరు దీన్ని మార్చినప్పుడు ఫ్యాన్ వేగం పెరుగుతుంది. గది అంతటా గాలి ప్రసరణ పెరుగుతుంది.
సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ చిట్కాలు
ప్రతి ఒక్కరి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. కానీ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అంత తేలికైన పని కాదు. ఎంత శుభ్రం చేసినా దుమ్ము, ధూళి ఉంటుంది. మరోవైపు పండుగలు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొన్ని వస్తువులను శుభ్రం చేయడం మనకు అలవాటు. రోజురోజుకూ చెత్త పేరుకుపోతోంది. వేసవిలో ఫ్యాన్ స్పీడుగా తిరగాలి అంటే.. దానిని బాగా శుభ్రం చేసుకోవాలి.
మనం రోజూ దీనిని శుభ్రం చేయలేం. క్లీనింగ్ ప్రత్యేక రోజులలో మాత్రమే జరుగుతుంది. అది దుమ్ముతో నిండిపోతుంది. దానిని వెంటనే తొలగించడం కష్టం. డస్టీ సీలింగ్ ఫ్యాన్‌ను వెనిగర్ తో నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో వెనిగర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి ఫ్యాన్ బ్లేడ్లకు అప్లై చేయాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత తడి కాటన్ క్లాత్‌తో బాగా శుభ్రం చేసుకోవాలి.
ఫ్యాన్ రంగు చెక్కుచెదరకుండా ఉండాలంటే ముందుగా ఫ్యాన్ రెక్కలను గుడ్డతో తుడవండి. తర్వాత దానిపై ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత దాని రెక్కలను కాటన్ గుడ్డతో శుభ్రం చేయండి. ఇది మెరిసేలా మారుతుంది.
మీరు బేకింగ్ సోడా, సబ్బును ఉపయోగించి ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ముందుగా, బేకింగ్ సోడా, సబ్బును బాగా కలపండి. ఒక గుడ్డ లేదా స్పాంజితో ఫ్యాన్‌ను శుభ్రం చేయండి. ఫ్యాన్ రెక్కలకు దుమ్ము ఎక్కువగా పట్టుకుంటుంది. ఇది మనం పీల్చే అవకాశం ఉంది. అందుకే కచ్చితంగా వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
టాపిక్