TDP BJP JSP Alliance 2024 : ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ - ఇవాళే 'ప్రజాగళం' సభ-tdp bjp jsp alliance praja galam sabha on march 17 at chilakaluripet ahead of ap elections 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Tdp Bjp Jsp Alliance Praja Galam Sabha On March 17 At Chilakaluripet Ahead Of Ap Elections 2024

TDP BJP JSP Alliance 2024 : ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ - ఇవాళే 'ప్రజాగళం' సభ

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 06:23 AM IST

TDP BJP JSP Alliance Praja Galam sabha : ఏపీ వేదికగా ఎన్డీఏ కూటమి తొలి సభకు సర్వం సిద్ధమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో…. మూడు పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరై ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ప్రజాగళం సభ
ప్రజాగళం సభ (TDP Twitter)

TDP BJP JSP Alliance 2024 : ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమంటూ అధికార వైసీపీ అన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిద్ధం పేరుతో భారీ సభలను నిర్వహించగా.... ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే ఈసారి వైసీపీని గద్దె దించాలన్న కసితో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు..... బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటీవలనే పొత్తు ప్రకటన కూడా వెలువడింది. ఇందులో భాగంగా.... ఇవాళ చిలుకలూరిపేట వేదికగా ‘ప్రజాగళం’ సభను(TDP BJP JSP Alliance Praja Galam sabha) తలపెట్టాయి. దాదాపు 10 లక్షల మందికిగా జనసమీకరణతో ఈ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్

2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరింది తెలుగుదేశం పార్టీ. పవన్ కల్యాణ్ కూడా మద్దతునిచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు, మోదీ, పవన్ ఒకే వేదికగా కనిపించారు. ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. చంద్రబాబు సీఎం కాగా... కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. కొన్నేళ్ల తర్వాత.... రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి పలు అంశాల్లో బీజేపీ తీరును నిరసిస్తూ... ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు చంద్రబాబు. ఆ సమయంలో తీవ్రమైన విమర్శలతో పాటు పోరాటానికి దిగారు. దీంతో బీజేపీ... తెలుగుదేశం పార్టీలు విడిపోయాయి. మరోవైపు పవన్ మాత్రం... బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు. గత ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం..... బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని పదే పదే చెబుతూ వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే కూటమి ఏర్పాటులో పవన్ కీలకంగా మారారు. మొన్నటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని అంతా భావించినప్పటికీ.... చివరగా బీజేపీతో పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో మళ్లీ ఏపీలో ఎన్డీఏ కూటమిగా పోటీ చేయనున్నాయి. ఇందులో భాగంగా....మూడు పార్టీల అగ్రనేతలు ఈ ప్రజాగళం సభకు హాజరుకానున్నారు.

ఈ సభ హాజరయ్యేందుకు ప్రధాని మోదీ(PM Modi in AP) ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 తర్వాత సభా ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. 06.15 గంటల వరకు సభలోనే ఉంటారు. కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తూ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ విస్తృత ప్రచారం చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా... తాజాగా తెలంగాణలో కూడా రెండు రోజుల పాటు పర్యటించారు మోదీ. నాగర్ కర్నూలు వేదికగా చేపట్టిన సభలో ప్రసంగిస్తూ.... కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారే అని ఉద్ఘాటించారు. 400 సీట్లతో అధికారంలోకి రావటమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ..... ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విభజన సమస్యలపై ఏమైనా హామీలు ఇస్తారా..? అధికార వైసీపీని టార్గెట్ చేస్తారా...? వంటి అంశాల చుట్టూ చర్చ జరుగుతోంది.

WhatsApp channel