YSRCP Candidates List 2024 : వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల - అన్ని స్థానాలకు ఖరారు, పూర్తి లిస్ట్ ఇదే-ysrcp announced the list of candidates to contest the loksabha and assembly elections 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Ysrcp Announced The List Of Candidates To Contest The Loksabha And Assembly Elections 2024

YSRCP Candidates List 2024 : వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల - అన్ని స్థానాలకు ఖరారు, పూర్తి లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 16, 2024 01:15 PM IST

YSRCP MP MLa Candidates Final List 2024 : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్… అభ్యర్థులను పేర్లను వెల్లడించారు.

ఏపీ ఎన్నికలు - అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
ఏపీ ఎన్నికలు - అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

YSRCP MLA MP Candidates Final List 2024 : లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP). ఈ మేరకు ఇడుపులపాయలో పేర్లను ప్రకటించారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ ముందుగా… వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను(YSRCP Candidates L) వెల్లడించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేశారు. ఈ పేర్ల జాబితాను మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేశ్ చదివారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ…. అభ్యర్థుల పేరును ప్రకటించే అవకాశం తనకు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపించిన పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. 175 సీట్లలో అత్యధిక సీట్లు ఎస్సీ,ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో 24 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. సామాజిక మార్పు దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎంపీ సీట్లలో 11 స్థానాలను బీసీలకు ఇచ్చామని వెల్లడించారు. 175 సీట్లలో 59 సీట్లు బీసీలకే కేటాయించామని చెప్పారు. బీసీలకు ఈ స్థాయిలో ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేదని ధర్మాన గుర్తు చేశారు. మైనార్టీలకు గత ఎన్నికల్లో 5 సీట్లు ఇస్తే…ఈసారి ఏడు కేటాయించినట్లు వివరించారు. 2019తో పోల్చితే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు.

YSRCP MP Candidates 2024: వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా:

 1. శ్రీకాకుళం - పేరాడ తిలక్‌
 2. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌
 3. విశాఖ - బొత్స ఝాన్సీ
 4. అరకు చెట్టి - తనూజ రాణి
 5. రాజమండ్రి - డా. గూడురి శ్రీనివాసులు బిసి శెట్టి బలిజ
 6. కాకినాడ - చెల్మశెట్టి సునీల్
 7. నర్సాపురం - గూడూరి ఉమా బాల
 8. అమలాపురం - రాపాక వరప్రసాద్
 9. ఏలూరు - కారుమూరు సునీల్ కుమార్ యాదవ్
 10. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్
 11. విజయవాడ - కేశినేని నాని
 12. గుంటూరు - కిలారి రోశయ్య
 13. నర్సరావు పేట - అనిల్ కుమార్ యాదవ్
 14. బాపట్ల - నందిగం సురేశ్
 15. నెల్లూరు - విజయసాయిరెడ్డి
 16. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
 17. తిరుపతి - గురుమూర్తి
 18. చిత్తూరు - ఎన్ రెడ్డప్ప
 19. రాజంపేట - మిథున్ రెడ్డి
 20. కడప - అవినాశ్ రెడ్డి
 21. కర్నూలు - బీవై రామయ్య
 22. నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
 23. హిందూపూర్ - జోలదరసి శాంత
 24. అనంతపురం - శంకర్ నారాయణ
 25. అనకాపల్లి - బీసీ(ప్రకటించాల్సి ఉంది)

YSRCP MLA Candidates 2024: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

 • శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
 • ఆమదాలవలస - తమ్మినేని సీతారాం
 • పాతపట్నం -రెడ్డి శాంతి
 • టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్‌
 • నరసన్నపేట - ధర్మాన క్రిష్ణదాస్‌
 • ఇచ్ఛాపురం - పిరియా విజయ
 • పలాస -సీదిరి అప్పలరాజు
 • రాజాం (ఎస్సీ) - డాక్టర్‌ తలే రాజేశ్‌
 • విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి
 • బొబ్బిలి- చిన అప్పల నాయుడు
 • గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య
 • చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
 • ఎచ్చెర్ల- గొర్లె కిరణ్‌కుమార్
 • నెల్లిమర్ల -బడ్డు కొండ అప్పల నాయుడు
 • గాజువాక - గుడివాడ అమర్నాథ్‌
 • విశాఖ సౌత్ - వాసుపల్లి గణేశ్‌
 • విశాఖ నార్త్ - కేకే రాజు
 • భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు
 • విశాఖ ఈస్ట్ - ఎంవీవీ సత్యనారాయణ
 • విశాఖ వెస్ట్ - అడారి ఆనంద్‌
 • పెందుర్తి - అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
 • శృంగవరపుకోట - కడుబండి శ్రీనివాసరావు
 • పాయకరావుపేట (ఎస్సీ) - కంబాల జోగులు
 • చోడవరం - కరణం ధర్మశ్రీ
 • నర్సీపట్నం -ఉమాశంకర్‌ గణేశ్‌
 • అనకాపల్లి - మలసాల భరత్‌కుమార్‌
 • మాడుగుల - బూడి ముత్యాల నాయుడు
 • ఎలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
 • అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం
 • రంపచోడవరం (ఎస్టీ) - నాగులపల్లి ధనలక్ష్మి
 • పాడేరు (ఎస్టీ) - మత్స్యరస విశ్వేశ్వరరాజు
 • పార్వతీపురం (ఎస్సీ) - అలజంగి జోగారావు
 • కురుపాం (ఎస్టీ) - పాముల పుష్ప శ్రీవాణి
 • పాలకొండ (ఎస్టీ) - విశ్వరాయి కళావతి
 • సాలూరు (ఎస్టీ) - పీడిక రాజన్నదొర
 • ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
 • జగ్గంపేట- తోట నరసింహం
 • తుని- దాడిశెట్టి రాజా
 • పిఠాపురం- వంగా గీత
 • కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
 • కాకినాడ రూరల్‌ - కురసాల కన్నబాబు
 • పెద్దాపురం- దావులూరి దొరబాబు
 • రాజోలు (ఎస్సీ) - గొల్లపల్లి సూర్యారావు
 • కొత్తపేట - చీర్ల జగ్గిరెడ్డి
 • ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌
 • రామచంద్రపురం - పిల్లి సూర్య ప్రకాశ్‌
 • అమలాపురం (ఎస్సీ) - పినిపే విశ్వరూప్‌
 • పి.గన్నవరం - విప్పర్తి వేణుగోపాల్‌
 • మండపేట - తోట త్రిమూర్తులు
 • అనపర్తి - సత్య సూర్యనారాయణ రెడ్డి
 • గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత
 • రాజానగరం - జక్కంపూడి రాజా
 • నిడదవోలు - గెడ్డం శ్రీనివాసనాయుడు
 • రాజమండ్రి రూరల్‌ - చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ
 • రాజమండ్రి సిటీ - మార్గాని భరత్‌రామ్‌
 • కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకటరావు
 • నరసాపురం - ముదునూరి వరప్రసాదరాజు
 • భీమవరం - గ్రంథి శ్రీనివాస్‌
 • తణుకు - కారుమూరి వెంకట నాగేశ్వరరావు
 • ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
 • ఉండి - పీవీఎల్‌ నరసింహరాజు
 • తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
 • పాలకొల్లు - గూడాల శ్రీహరి గోపాలరావు
 • చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
 • నూజివీడు - మేకా వెంకట ప్రతాప అప్పారావు
 • దెందులూరు - కొటారు అబ్బయ్య చౌదరి
 • కైకలూరు - దూలం నాగేశ్వరరావు
 • పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి
 • ఏలూరు - ఆళ్ల నాని
 • ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
 • పామర్రు (ఎస్సీ) - కైలే అనిల్‌ కుమార్
 • అవనిగడ్డ - సింహాద్రి రమేశ్‌ బాబు
 • మచిలీపట్నం - పేర్ని కిట్టు
 • పెడన - ఉప్పల రమేశ్‌
 • గన్నవరం - వల్లభనేని వంశీ మోహన్‌
 • గుడివాడ - కొడాలి నాని
 • పెనమలూరు - జోగి రమేశ్‌
 • నందిగామ (ఎస్సీ) - మొండితోక జగన్మోహనరావు
 • తిరువూరు(ఎస్సీ) - స్వామిదాస్
 • విజయవాడ తూర్పు - దేవినేని అవినాశ్‌
 • విజయవాడ పశ్చిమ - షేక్ అసిఫ్‌
 • విజయవాడ సెంట్రల్ - శ్రీనివాస్‌
 • జగ్గయ్యపేట -సామినేని ఉదయభాను
 • మైలవరం - శరణాల తిరుపతి రావు
 • తాడికొండ - మేకతోటి సుచరిత
 • ప్రత్తిపాడు - బాలసాని కిరణ్‌కుమార్
 • తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
 • పొన్నూరు - అంబటి మురళి
 • గుంటూరు పశ్చిమ - విడదల రజని
 • మంగళగిరి - మురుగుడు లావణ్య
 • గుంటూరు తూర్పు -షేక్ నూర్ ఫతిమా
 • పెద్దకూరపాడు - నంబూరు శంకర్రావు
 • వినుకొండ - బొల్లా బ్రహ్మయ్యనాయుడు
 • సత్తెనపల్లి - అంబటి రాంబాబు
 • గురజాల - కాసు మహేశ్‌ రెడ్డి
 • చిలకలూరిపేట - కావేటి శివమనోహర్‌ నాయుడు
 • నర్సరావుపేట - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 • మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
 • రేపల్లె - రేవూరి గణేశ్
 • బాపట్ల- కోన రఘుపతి
 • వేమూరు- వరికూటి అశోక్‌ బాబు
 • సంతనూతలపాడు- మేరుగ నాగార్జున
 • అద్దంకి- పాణెం హనిమి రెడ్డి
 • పర్చూరు- ఎడం బాలాజీ
 • చీరాల- కరణం వెంకటేశ్
 • దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
 • యర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
 • గిద్దలూరు- కుందూరు నాగార్జున రెడ్డి
 • ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
 • కనిగిరి- దద్దాల నారాయణ యాదవ్
 • మార్కాపురం- అన్నా రాంబాబు
 • కందుకూరు- బుర్రా మధుసూదన్‌ యాదవ్
 • కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి
 • కావలి- రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డి
 • నెల్లూరు సిటీ- మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్
 • నెల్లూరు రూరల్‌- ఆదాల ప్రభాకర్‌ రెడ్డి
 • ఉదయగిరి - మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి
 • ఆత్మకూరు - మేకపాటి విక్రమ్‌ రెడ్డి
 • సర్వేపల్లి - కాకాని గోవర్థన్‌ రెడ్డి
 • రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి
 • గూడూరు - మేరిగ మురళీధర్
 • ఉరవకొండ - విశ్వేశ్వరరెడ్డి
 • గుంతకల్లు - వై. వెంకటరామిరెడ్డి
 • తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
 • శింగనమల - మన్నెపాకుల వీరాంజినేయులు
 • అనంతపురం అర్బన్‌ - అనంత వెంకటరామిరెడ్డి
 • కల్యాణదుర్గం - తలారి రంగయ్య
 • రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
 • తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
 • పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
 • రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
 • మదనపల్లె - నిసార్‌ అహ్మద్‌
 • కోడూరు - కె.శ్రీనివాసులు
 • రాయచోటి - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 • నగరి - ఆర్కే రోజా
 • గంగాధర నెల్లూరు - కృపాలక్ష్మి
 • చిత్తూరు - ఎం. విజయానందరెడ్డి
 • పూతలపట్టు - డాక్టర్‌ సునీల్‌కుమార్‌
 • పలమనేరు - ఎన్‌.వెంకటేశ గౌడ
 • కుప్పం - కేజే భరత్
 • పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 • కర్నూలు - ఎండీ ఇంతియాజ్‌
 • పత్తికొండ - కంగాటి శ్రీదేవి
 • కోడుమూరు - ఆదిమూలపు సతీశ్
 • ఎమ్మిగనూరు - బుట్టారేణుక
 • ఆదోని - వై.సాయి ప్రసాద్‌రెడ్డి
 • మంత్రాలయం - వై. బాలనాగిరెడ్డి
 • ఆలూరు - బి. విరూపాక్షి
 • ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రారెడ్డి
 • శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి
 • నందికొట్కూరు - డాక్టర్‌ దారా సుధీర్‌
 • పాణ్యం - కాటసాని రాంభూపాల్‌రెడ్డి
 • నంద్యాల - శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి
 • బనగానపల్లి - కాటసాని రామిరెడ్డి
 • డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 • మడకశిర - ఈర లక్కప్ప
 • హిందూపురం - టీఎన్‌. దీపిక
 • పెనుకొండ -ఉష శ్రీ చరణ్‌
 • పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
 • కదిరి - బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌
 • ధర్మవరం - కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి

WhatsApp channel