Mudragada Padmanabham : రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు-east godavari news in telugu ysrcp leader mudragada padmanabham criticizes pawan kalyan chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mudragada Padmanabham : రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు

Mudragada Padmanabham : రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Mar 16, 2024 02:43 PM IST

Mudragada Padmanabham : వైసీపీలో చేరడం తన సొంత నిర్ణయమని ముద్రగడ పద్మనాభం అన్నారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడని పవన్ పై విమర్శలు చేశారు.

సీఎం జగన్ తో ముద్రగడ పద్మనాభం
సీఎం జగన్ తో ముద్రగడ పద్మనాభం

Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham), ఆయన కుమారుడు శుక్రవారం సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ విషయంపై ముద్రగడ పద్మనాభం శనివారం కిర్లంపూడిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉద్దేశించి విమర్శలు చేశారు. పరీక్షలు జరుగుతున్న కారణంగా ఆర్భాటం లేకుండా వైసీపీ(Ysrcp)లో చేరానన్నారు. వైసీపీ ఎలాంటి పదవులు ఆశించకుండా, ప్రజాసేవ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదన్నారు. తన సొంత నిర్ణయం ప్రకారమే పార్టీలో చేరారని స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది బీసీ, దళిత వర్గాలన్నారు. సోషల్ మీడియాతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముద్రగడ అన్నారు.

నేను రాజకీయాల్లో హీరో

రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం(Mudragada on Pawan Kalyan) విమర్శించారు. అసలు వాళ్లు చెప్పినట్లు తానేందుకు రాజకీయం చేయాలన్నారు. నాకు చెప్పడానికి ఆయనేవరని ప్రశ్నించారు. చంద్రబాబు(Chandrababu) ఐదేళ్ల పాలనలో పవన్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాపు(Kapu) జాతిని చంద్రబాబు అవమానించినప్పుడు పవన్‌ ఎందుకు స్పందించలేదన్నారు. పవన్ సినిమాల్లో హీరో కావొచ్చు, తాను రాజకీయాల్లో హీరో అన్నారు. నేను స్థిరంగా ఉంటే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ పవన్ తప్పించుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. మాకు మనోభావాలు ఉంటాయని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఊరుకోమన్నారు. జగన్‌ ను ప్రజలకు 30 ఏళ్ల పాటు సీఎం పీఠంపై కూర్చోబెడతారని ముద్రగడ జోస్యం చెప్పారు.

సినిమా హీరోలను ప్రజలకు నమ్మరు

ఏపీ ప్రజలు సినిమా హీరోలను నమ్మరని ముద్రగడ అన్నారు. తాను కాపులు, దళితుల కోసం పోరాటం చేశానన్నారు. జగన్(CM Jagan) దగ్గరకు ఎందుకు వెళ్లావు, మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్లలేదని కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు తాను రాజకీయాల్లో గొప్ప అన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ నేను ముందున్నానన్నారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు. కానీ కొందరు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీలో చేరడం హ్యాపీగా ఉందన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ముద్రగడ ప్రకటించారు.

ఏపీలో ఎన్నికల తర్వాత జనసేన ఉండదని ముద్రగడ జోస్యం చెప్పారు. 21 సీట్లతో పవన్ కల్యాణ్ కూడా బాధపడే ఉంటారన్నారు. ఈ సీట్లు కూడా టీడీపీకి తిరిగి ఇచ్చేస్తే మంచిందంటూ సెటైర్లు వేశారు. పవన్‍‌ కల్యాణ్‌ను మారుద్దామని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదన్నారు. 21 సీట్లతో పోటీకి సిద్ధమవ్వడం పవన్ పార్టీ బలమెంతో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన(Janasena) కథ ముగుస్తుందని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.