Modi in Telangana : వచ్చేది మళ్లీ మనమే.. తెలంగాణలోనూ మెజార్టీ సీట్లలో గెలిపించండి - ప్రధాని మోదీ-pm narendra modi address a bjp rally at nagarkurnool ahead of lok sabha elections 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Pm Narendra Modi Address A Bjp Rally At Nagarkurnool Ahead Of Lok Sabha Elections 2024

Modi in Telangana : వచ్చేది మళ్లీ మనమే.. తెలంగాణలోనూ మెజార్టీ సీట్లలో గెలిపించండి - ప్రధాని మోదీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 16, 2024 12:39 PM IST

PM Modi Telangana Tour Updates : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో పర్యటించిన ఆయన.. ఇవాళ నాగర్ కర్నూలులో తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. తెలంగాణలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

నాగర్ కర్నూలు సభలో ప్రధాని మోదీ
నాగర్ కర్నూలు సభలో ప్రధాని మోదీ (ANI)

PM Narendra Modi at Nagarkurnool : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Loksabha Polls 2024) మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP)అడుగులు వేస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లను సాధించి సంచలనం సృష్టించిన ఆ పార్టీ… ఈసారి రెండంకెల సంఖ్యను దాటాలని టార్గెట్ పెట్టుకుంది. ఇటీవలే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కట్ చేస్తే…. ఇక ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ….. నిన్న మల్కాజ్ గిరిలో తలపెట్టిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం రాజ్ భవన్ లో బస చేసిన ఆయన… ఇవాళ నాగర్ కర్నూలుకు(PM Narendra Modi Nagarkurnool) చేరుకున్నారు. పార్టీ తలపెట్టిన భారీ సభకు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Speech: మోదీ ప్రసంగం….

నాగర్ కర్నూలులో శనివారం బీజేపీ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa sabha)కు హాజరైన ప్రధాని మోదీ ప్రసంగించారు. “నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు” అంటూ స్పీచ్ ను ప్రారంభించారు మోదీ. మరికొన్ని గంట్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. కానీ ఇప్పటికే దేశ ప్రజలు ఫలితం నిర్ణయించారని వ్యాఖ్యానించారు. మరోసారి మోదీ సర్కార్ అని దేశం నిర్ణయించందన్నారు. తెలంగాణలోనూ అదే గాలి వీస్తుందని చెప్పారు. తెలంగాణ కూడా అబ్ కీ బార్ - 400 నినాదం చేస్తోందన్నారు. నిన్న మల్కాజ్ గిరిలో నిర్వహించిన రోడ్ షోలో భాగం అయ్యానని... అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారని చెప్పారు." తెలంగాణలోని ప్రజలు బీఆర్ఎస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మొన్నటి ఎన్నికల్లో గమనించాను. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ గా పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కార్ కృషి చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారాయి. ఈ రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల సమయం కూడా పట్టదు. వారి ఆటలు సాగవద్దంటే... వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. అన్ని స్థానాల్లోనూ కమలం అభ్యర్థులను గెలిపించండి. వారు గెలిస్తే..మీ సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకువస్తారు. మీ సమస్యలను పరిష్కరించి మీకు అండగా ఉంటానని హామీనీ ఇస్తున్నాను.

కాంగ్రెస్ పై ఫైర్…

Modi On Congress : ఏడు దశాబ్ధాల పాటు దేశాన్ని దోచుకోవటం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదన్నారు మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా మార్చుకుందని విమర్శించారు. మార్పునకు గ్యారెంటీ కేవలం మోదీనే అని చెప్పారు. పదేళ్ల కాలంలో అనేక మంది పేదలకు మంచి పనులు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాలను ప్రస్తావించారు ప్రధాని. తమ చర్యలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారని అన్నారు. తెలంగాణలోనూ మరింత మార్పులు వచ్చేందుకు మోదీ సర్కార్ మరోసారి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల కలలను రెండు పార్టీలు ధ్వంసం చేశాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గరీబ్ హఠావో నినాదం ఇచ్చింది కానీ… పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కానీ మోదీ పాలనలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబమని మరోసారి పునరుద్ఘటించారు.

దళిత నేతను కింద కూర్చొబెట్టారు….

ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS Party) పై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దళితబంధు స్కీమ్ పేరుతో దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ కూడా… కాంగ్రెస్ అడుగుజాడల్లో నడిచే పార్టీ అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పి… అంబేడ్కర్ ను అవమానించారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పిందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్…. అవినీతి పార్టీలన్నారు. కాంగ్రెస్ 2 జీ స్కామ్ చేస్తే….బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో దోచుకుందన్నారు. తెలంగాణలో దళిత నేతను కింద కూర్చబెట్టారంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మోదీ… బడగు బలహీనవర్గాలను మోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

WhatsApp channel