YS Sharmila Affidavit : అన్నావదినలకు రూ.82 కోట్ల బాకీ, షర్మిల అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు
YS Sharmila Affidavit : కడప ఎంపీ స్థానానికి వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తి విషయాలు ఉన్నాయి. తన అన్న, వదినలు...జగన్, భారతీరెడ్డిలకు రూ.82 కోట్ల బాకీ ఉన్నట్లు షర్మిల తెలిపారు.
YS Sharmila Affidavit : కడప లోక్ సభ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పోటీ చేస్తున్నారు. శనివారం ఆమె నామినేషన్(Nomination) దాఖలు చేశారు. అయితే షర్మిల ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తన అన్న, సీఎం జగన్‌కు షర్మిల రూ. 82 కోట్ల బాకీ(Sharmila Debt) ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై 8 కేసులున్నట్లు, వాటిల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఉన్నట్టు షర్మిల అఫిడవిట్(YS Sharmila Affidavit) లో పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులు రూ. 182.82 కోట్లు ఉన్నాయని తెలిపారు. వీటిలో రూ. 82,58,15,000 తన సోదరుడు సీఎం జగన్ కు వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిపారు. తన వదిన వైఎస్ భారతీరెడ్డి వద్ద రూ.19,56,682 అప్పు తీసుకున్నట్లు షర్మిల పేర్కొన్నారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. ఏడాదికి తన ఆదాయం రూ. 97,14,213 వస్తుందని షర్మిల అఫిడవిట్‌లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలియజేశారు.
షర్మిలకు స్థిరాస్తులు తక్కువే
వైఎస్ షర్మిల ఆస్తుల్లో (YS Sharmila Assets )చరాస్తులు రూ. 1,23,26,65,163 అని, వీటిలో రూ.45,19,72,529 చరాస్తులు తన భర్త అనిల్ కుమార్(Anil Kumar) పేరిటి ఉన్నాయని తెలిపారు. రూ. 9,29,58, 180 స్థిరాస్తులు ఉన్నాయని షర్మిల తెలిపారు. భర్త అనిల్ కుమార్‌కు రూ. 4,05,92,365 విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. తన అన్న సీఎం జగన్(CM Jagan), వదిన భారతి రెడ్డి(Bharati Reddy)కి కలిపి రూ.82,77,71,682 అప్పు చెల్లించాల్సి ఉందన్నారు. భర్త అనిల్ కుమార్ అప్పులు రూ. 35,81,19,299 అని చెప్పారు. షర్మిల తన వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారం, రూ.4. 61 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయని అఫిడవిట్(YS Sharmila Affidavit) తెలిపారు. అనిల్ కుమార్‌కు రూ.81.60 లక్షల విలువైన బంగారం, రూ.42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయన్నారు.
అవినాష్ రెడ్డి ఆస్తులు
ఇక కడప ఎంపీ స్థానానికి వైసీపీ(Ysrcp) నుంచి పోటీ చేస్తు్న్న వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్(MP Avinash Reddy Nomination) దాఖలు చేశారు. తనకు రూ. 25 కోట్లు ఆస్తులు ఆయన అపిఢవిట్ లో తెలిపారు. ఐదేళ్ల కిందట ఆయన ఆస్తులు రూ. 19 కోట్లు ఉన్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులను ప్రకటించారు. సీబీఐ నమోదు చేసి వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case) కూడా ఉంది. హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో సీబీఐ(CBI) కేసు నమోదు చేసింది. దీంతో పాటు మరో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవినాష్ రెడ్డికి రూ.25.51 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే అప్పులు రూ.9.11 కోట్లుగా తెలిపారు. తన భార్య సమత పేరిట విశాఖ, వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్లలో 33.90 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అవినాష్ రెడ్డి భార్య ఆస్తుల విలువ రూ.7.34 కోట్లు అని పేర్కొన్నారు.
సంబంధిత కథనం