WPL 2024 Prize Money: డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ కంటే చాలా తక్కువే..-wpl 2024 prize money winning team to get 6 crores rcb vs dc final on sunday march 17th wpl vs ipl prize money ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024 Prize Money: డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ కంటే చాలా తక్కువే..

WPL 2024 Prize Money: డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ కంటే చాలా తక్కువే..

Hari Prasad S HT Telugu
Mar 16, 2024 06:16 PM IST

WPL 2024 Prize Money: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ తో పోలిస్తే చాలా తక్కువే అయినా.. మహిళల క్రికెట్ లీగ్ కు ఇది చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి.

డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ కంటే చాలా తక్కువే..
డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఐపీఎల్ కంటే చాలా తక్కువే..

WPL 2024 Prize Money: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ ఆదివారం (మార్చి 17) జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ ఎంత? విజేత, రన్నరప్ ఎంత మొత్తం అందుకోబోతున్నారన్న విషయాలు ఇక్కడ చూడండి.

డబ్ల్యూపీఎల్ ప్రైజ్‌మనీ

డబ్ల్యూపీఎల్ ఫిబ్రవరి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పాల్గొన్న ఈ లీగ్ లో చివరికి ప్లేఆఫ్స్ కూడా పూర్తయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్లో గెలిచిన జట్టుకు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండటం విశేషం.

ఇక రన్నరప్ టీమ్ రూ.3 కోట్లు అందుకుంటుంది. ఈ ఏడాది ఈ రెండు జట్లు టాప్ ఫామ్ లో ఉన్నాయి. నిజానికి లీగ్ స్టేజ్ మొదట్లో వరుస విజయాలు సాధించి, తర్వాత వరుస ఓటములతో ఒకదశలో రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపించిన ఆర్సీబీ మళ్లీ గాడిలో పడి ఏకంగా ఫైనల్ చేరింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఏడాదీ ఫైనల్ చేరింది.

ఐపీఎల్ vs డబ్ల్యూపీఎల్ ప్రైజ్‌మనీ

పురుషుల కోసం ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఈ మెగా లీగ్ ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇది. దీంతో సహజంగానే ఈ మెగా లీగ్ ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువే. ఐపీఎల్ ప్రైజ్ మనీ 2020 వరకూ రూ.10 కోట్లుగా ఉండేది. అయితే 2021 నుంచి దీనిని రెట్టింపు చేసి రూ.20 కోట్లకు పెంచారు. ఇక రన్నరప్ టీమ్ కు రూ.13 కోట్లు ఇస్తున్నారు.

ఐపీఎల్ తో పోలిస్తే డబ్ల్యూపీఎల్ ప్రైజ్ మనీ చాలా తక్కువే. ఐపీఎల్ రన్నరప్ టీమ్ అందుకునే మొత్తంలో సగం కంటే తక్కువే డబ్ల్యూపీఎల్ విజేత జట్టు అందుకుంటుంది. అయితే మహిళల క్రికెట్ లీగ్ లో ఈ స్థాయి డబ్బు మామూలు విషయం కాదు. అందులోనూ డబ్ల్యూపీఎల్ ప్రస్తుతం రెండో సీజన్ లోనే ఉంది. గతేడాది నుంచి పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లిస్తున్న బీసీసీఐ.. రానున్న రోజుల్లో ఈ లీగ్ ప్రైజ్ మనీ కూడా భారీ పెంచే అవకాశాలు ఉన్నాయి.

డబ్ల్యూపీఎల్ 2024 మరో రోజులో ముగుస్తోంది. అయితే క్రికెట్ ప్రేమికులకు అంతకు మించిన మెగా లీగ్ ఐపీఎల్ రాబోతుండటం ఆనందం కలిగిస్తోంది. ఈ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ తొలి విడత షెడ్యూల్ రిలీజైంది. తాజాగా శనివారం (మార్చి 16) లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్, ఆ మ్యాచ్ లను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

Whats_app_banner