IPL 2024 SRH vs MI Tickets: హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?-ipl 2024 srh vs mi match ticket sales buy tickets in paytm insider sunrisers hyderabad offer free jersey for 2 tickets ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Srh Vs Mi Tickets: హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?

IPL 2024 SRH vs MI Tickets: హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?

Hari Prasad S HT Telugu
Mar 16, 2024 03:45 PM IST

IPL 2024 SRH vs MI Tickets: ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లో జరగబోయే తొలి మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది.

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?
హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం షురూ.. సర్‌రైజర్స్ బంపర్ ఆఫర్.. ఎక్కడ కొనాలంటే?

IPL 2024 SRH vs MI Tickets: హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి మొదలైంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ మార్చి 27న జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు శుక్రవారం (మార్చి 15) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ కూడా అనౌన్స్ చేసింది.

yearly horoscope entry point

సన్‌రైజర్స్, ముంబై మ్యాచ్ టికెట్లు

ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 27న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు శుక్రవారం (మార్చి 15) నుంచి అందుబాటులోకి వచ్చాయి. పేటీఎం ఇన్‌సైడర్ లో ఈ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా సన్ రైజర్స్ వెల్లడించింది.

ఐపీఎల్ తొలి మ్యాచ్ టికెట్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కనిష్ఠంగా రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ.4500 టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసుకునే స్టాండ్స్ ను బట్టి టికెట్ల ధరలు ఉంటాయి. వీటిలో రూ.1500, రూ.2500, రూ.4000 వేలు, రూ.4500 ధరల్లో టికెట్లు ఉన్నాయి. రూ.1500 టికెట్ అంటే సౌత్ ఈస్ట్ సెకండ్ టెర్రస్ పై ఉండే సీట్లు.

ఇక రూ.2500 టికెట్లు కొంటే.. ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ లలో ఉండే సీట్లలో కూర్చోవచ్చు. రూ.4000 టికెట్లు తీసుకుంటే.. వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవచ్చు. ఇక రూ.4500 టికెట్ కొంటే ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చొని మ్యాచ్ చూసే వీలుంటుంది. ఈ నాలుగు డినామినేషన్లలో తొలి మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికోసం పేటీఎం ఇన్‌సైడర్ (paytm insider) వెబ్‌సైట్లోకి వెళ్లి మ్యాచ్, స్టాండ్ ఎంపిక చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

సన్ రైజర్స్ బంపర్ ఆఫర్

ఇక హైదరాబాద్, ముంబై మధ్య జరగబోయే ఈ తొలి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసే వారికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక ఫ్యాన్ జెర్సీ ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ మ్యాచ్ మార్చి 27న జరగనుండగా.. మార్చి 26 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది.

ఐపీఎల్ 2024 సీజన్లో తొలి విడత షెడ్యూల్ మాత్రమే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ జరగబోయే మొత్తం 21 మ్యాచ్ ల షెడ్యూల్ ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మార్చి 27న ముంబై ఇండియన్స్ తో.. ఏప్రిల్ 5వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ తలపడనున్నారు.

ఈ కొత్త సీజన్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే టీమ్ లోని చాలా మంది సభ్యులు హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ను హైదరాబాద్ టీమ్ కోల్‌కతాలో మార్చి 23న కేకేఆర్ తో ఆడనుంది.

Whats_app_banner