Virat Kohli Smriti Mandhana: కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు-virat kohli video calls smriti mandhana and rcb team after their win over dc in wpl 2024 final womens premier league ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Smriti Mandhana: కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు

Virat Kohli Smriti Mandhana: కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు

Hari Prasad S HT Telugu
Mar 18, 2024 08:44 AM IST

Virat Kohli Smriti Mandhana: విరాట్ కోహ్లి చేయలేనిది స్మృతి మంధానా చేసింది. ఆర్సీబీకి తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించి పెట్టిన తర్వాత కోహ్లి వీడియో కాల్ చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ బెంగళూరు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు.

కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు
కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు (Getty Images-Jio Cinema)

Virat Kohli Smriti Mandhana: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఇప్పటి వరకూ రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయిన ఆ ఫ్రాంఛైజీకి ఇప్పుడు మహిళల టీమ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) టైటిల్ సాధించి పెట్టింది. దీంతో మ్యాచ్ తర్వాత కోహ్లి స్పెషల్ గా వీడియో కాల్ చేసి స్మృతి అండ్ టీమ్ తో మాట్లాడాడు.

ఆర్సీబీకి కోహ్లి విషెస్

ఆదివారం (మార్చి 17) రాత్రి ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ 8 వికెట్లతో విజయం సాధించి విషయం తెలిసిందే. 2008 నుంచీ ఐపీఎల్లో ఉన్నా.. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డివిలియర్స్, డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్లు ఉన్నా.. ఎప్పుడూ ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోయింది. 2009, 2016లలో ఫైనల్ చేరినా ఓటమి తప్పలేదు.

కానీ ఆర్సీబీ మహిళల టీమ్ మాత్రం రెండో సీజన్ లోనే డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడంతో ఆ ఫ్రాంఛైజీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో 16 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్రాంఛైజీతోనే ఉన్న విరాట్ కోహ్లి ఫైనల్ తర్వాత స్మృతి మంధానా అండ్ టీమ్ కు ప్రత్యేకంగా వీడియో కాల్ చేశాడు. వాళ్లు ట్రోఫీ అందుకునే ముందు కాసేపు మాట్లాడాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోహ్లి మొదట కెప్టెన్ స్మృతితో మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం టీమ్ కు కూడా విషెస్ చెప్పాడు. విరాట్ ను చూడగానే ఆర్సీబీ గాళ్స్ ఆనందంతో గంతులేశారు. అంతేకాదు ఆర్సీబీ సూపర్ వుమెన్ ను పొగుడుతూ ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లి ఓ పోస్ట్ కూడా చేశాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రస్తుతం ఆడుతున్న మ్యాక్స్‌వెల్, గతంలో ఆడిన క్రిస్ గేల్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.

ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు

16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయం తర్వాత వాళ్లు బెంగళూరు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో ఈ మ్యాచ్ జరిగినా.. ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే ఫ్యాన్స్ బెంగళూరు రోడ్లపైకి వచ్చారు. నిజానికి ఈ ఏడాది మొదటి లెగ్ మ్యాచ్ లు బెంగళూరులోనే జరిగిన విషయం తెలిసిందే.

ఒక దశలో లీగ్ ప్లేఆఫ్స్ కూడా చేరకుండా ఇంటిదారి పడుతుందనుకున్న ఆర్సీబీ అనూహ్యంగా ఫైనల్ కు దూసుకురావడమే కాదు.. కప్పు కూడా గెలవడం అద్భుతమనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కేవలం 113 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ మెరుపు ఆరంభం ఇచ్చినా.. ఆర్సీబీ స్పిన్నర్లు వచ్చిన తర్వాత కథ మారిపోయింది.

సోఫీ మోలినెక్స్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి డీసీని దెబ్బకొట్టింది. ఆ తర్వాత కోలుకోలేకపోయిన డీసీ.. 113 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా డీసీ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Whats_app_banner