(1 / 5)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ నుంచి ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్ హారీ బ్రూక్ తప్పుకున్నాడు.
(PTI)(2 / 5)
తన నానమ్మ ఫిబ్రవరిలో మృతి చెందారని, ఇలాంటి సమయంలో తాను కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందని హారీ బ్రూక్ నేడు (మార్చి 13) వెల్లడించాడు.
(3 / 5)
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాలని తనకు ఉత్సాహంగా ఉందని, కానీ వ్యక్తిగత కారణంతో ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నానని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు.
(REUTERS)(4 / 5)
ఐపీఎల్ 2024 సీజన్ కోసం మినీ వేలంలో రూ.4కోట్లకు బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో గతేడాది హైదరాబాత్ తరఫున ఆడిన బ్రూక్ ఢిల్లీకి వెళ్లాడు. అయితే, ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు బ్రూక్.
(AFP)(5 / 5)
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న మొదలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 23వ తేదీన పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనుంది.
(PTI)ఇతర గ్యాలరీలు