Virat Kohli: లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో-virat kohli in london video of star team india batter on streets going viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Virat Kohli: లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hari Prasad S HT Telugu
Aug 15, 2024 12:49 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఓడిపోయిన తర్వాత కోహ్లి మళ్లీ లండన్ వెళ్లాడు. ఓ అభిమాని ఆ వీడియోను షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (X)

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి వీధుల్లో హాయిగా తిరుగుతూ అభిమానుల సెల్ఫీల గోల లేకుండా విహరిస్తున్నాడు. అతడు లండన్ లో ఓ రోడ్డు దాటుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఐదు సెకన్ల నిడివి మాత్రమే ఈ వీడియో ఉంది.

లండన్ వీధుల్లో విరాట్ కోహ్లి

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. తర్వాత శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడాడు. అయితే అందులో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అటు ఇండియన్ టీమ్ కూడా 27 ఏళ్ల తర్వాత లంక చేతుల్లో సిరీస్ ఓడిపోయింది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి మరోసారి లండన్ వెళ్లాడు.

అక్కడ అతడు రోడ్డు దాటుతుండగా కారులో వెళ్తున్న ఓ అభిమాని వీడియో తీశాడు. కేవలం ఐదు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ ఒక్కడే రోడ్డు దాటుతూ కనిపించాడు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా కోహ్లి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే అతని భార్య అనుష్క శర్మ తమ తనయుడు అకాయ్ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అంతేకాదు లండన్ లోనే విరాట్, అనుష్క దంపతులు ఓ భజన కీర్తనల కార్యక్రమానికి వెళ్లారు. అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో అనుష్క షేర్ చేసింది. కోహ్లి, అనుష్క దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న అకాయ్ అనే అబ్బాయి జన్మించాడు. అందుకే అతడు ఆ సమయంలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు.

కోహ్లి మళ్లీ ఫీల్డ్‌లోకి దిగేది ఎప్పుడు?

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో టీమిండియాతోపాటు విరాట్ కోహ్లి కూడా దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఈ సిరీస్ లో వరుసగా 24, 14, 20 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇండియా ఈ సిరీస్ ను 0-2తో కోల్పోయింది. తొలి వన్డే టై కాగా.. తర్వాతి రెండు మ్యాచ్ లలో శ్రీలంక స్పిన్ బౌలింగ్ కు మన స్టార్ బ్యాటర్లు దాసోహమయ్యారు.

ఇక ఇప్పుడు విరాట్ కోహ్లి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి తిరిగి వస్తాడని మొదట భావించినా.. తర్వాత అతడు రావడం లేదని కన్ఫమ్ అయింది. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు ఆడుతున్నారు. విరాట్ మళ్లీ వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఆ సిరీస్ తో ఇండియా హోమ్ సీజన్ మొదలు కానుంది.