IND vs ENG: ఫైనల్‌కు చేరిన టీమిండియా - కుల్దీప్, అక్షర్ స్పిన్ మాయ- సెమీస్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం
IND vs ENG: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగులు తేడాతో టీమిండియా చిత్తు చేసింది. భారత భౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను ఫైనల్‌కు చేర్చారు.
IND vs ENG: టీ20 వరల్డ్ ఫైనల్‌లోకి టీమిండియా అడుగుపెట్టింది. గురువారం సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి సౌతాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. 68 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.
బుమ్రాకు ఫస్ట్ వికెట్
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ జోస్ బట్లర్ ధాటిగానే ఆరంభించాడు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఫిలిప్ సాల్ట్ మాత్రం భారత పేసర్లను ఎదుర్కొవడానికి ఇబ్బందిపడ్డాడు. మూడో ఓవర్‌లో బుమ్రా అతడిని ఔట్ చేసి ఇంగ్లండ్ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు.
అక్షర్ పటేల్ విజృంభణ
ఆ తర్వాత అక్షర్ పటేల్ స్పిన్‌కు విలవిలలాడిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. మెయిన్ అలీ 8 పరుగులు చేయగా...బెయిర్ స్టో డకౌట్ అయ్యాడు. బట్లర్, హ్యారీ బ్రూక్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ బట్లర్‌ను అక్షర్ పెవిలియన్‌కు పంపించడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. 15 బాల్స్‌లో నాలుగు ఫోర్లతో 23 రన్స్ చేసిన బట్లర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.
కుల్దీప్ యాదవ్ దెబ్బ...
మిగిలిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పనిని కుల్దీప్ యాదవ్ పట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న హ్యారీ బ్రూక్‌ను (25 రన్స) బోల్తా తెలివిగా కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత శామ్ కరన్, క్రిస్ జోర్డన్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్ యాదవ్. హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను అక్షర్, కుల్దీప్ కలిసి రనౌట్ చేశారు.. చివరలో జోఫ్రా ఆర్చర్ 15 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టడంతో ఇంగ్లండ్ అతి కష్టం మీద వంద పరుగులు ధాటింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో మూడు వికెట్లు తీశారు. బుమ్రా రెండు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ...
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ భారత్ 171 పరుగులు చేసిందది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. అదే జోరును సెమీఫైనల్లోనూ కొనసాగించాడు. అయితే ఆ మ్యాచ్ తో పోలిస్తే పిచ్ అంత అనుకూలంగా లేకపోవడంతో అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును కదిలించాడు.
సూర్యకుమార్ సహకారం
రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 57 రన్స్ చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ కూడా బ్యాట్ ఝులిపించడంతో ఈ జోడిస మూడో వికెట్ కు 73 పరుగులు జోడించాడు. అటు సూర్యకుమార్ కూడా రోహిత్ ఔటైన కాసేపటికే పెవిలియన్ చేరాడు. సూర్య 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
కోహ్లి ... పంత్ ఫెయిల్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. అతడు 9 బంతుల్లో 9 పరుగులు చేసి టోప్లీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అతని బౌలింగ్ లోనే ఓ కళ్లు చెదిరే సిక్స్ కొట్టినా.. కోట్లి అదే ఓవర్‌లో ఔటై నిరాశపరిచాడు.
పాండ్య సిక్సులు…
మూడో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడా నిరాశ పరిచాడు. అతడు కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇండియా పవర్ ప్లే ముగిసే లోపే 5.2 ఓవర్లలో 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మకు జత కలిసిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టాడు.
చివరలో హార్దిక్ పాండ్య, 13 బాల్స్‌లో రెండు సిక్సర్లు ఓ ఫోర్‌తో 23, జడేజా 17, అక్షర్ పటేల్ 10 పరుగులు చేయడంతో భారత్ 171 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్‌లో భారత్ సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.