IND vs SA 3rd T20 Highlights: బర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ - టీ20ల్లో సూర్య కుమార్ నాలుగో సెంచరీ
IND vs SA 3rd T20 Highlights: ఇండియా, సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ 1-1తో సమమైంది. గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్, బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మెరిశారు.
(1 / 6)
మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సెంచరీతో మెరిశాడు. 56 బాల్స్‌లో ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో 100 రన్స్ చేసింది.
(2 / 6)
టీ20ల్లో సూర్యకుమార్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. సూర్యకుమార్ సెంచరీతో టీమిండియా ఇరవై ఓవర్లలో 201 రన్స్ చేసింది.
(3 / 6)
సూర్యకుమార్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 41 బాల్స్‌లో 60 రన్స్ చేశాడు.
(4 / 6)
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. బర్త్‌డే రోజు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి టీమిండియాకు మరచిపోలేని విజయాన్ని అందించాడు.
(5 / 6)
202 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ యాదవ్ దెబ్బకు 95 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ 35 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇతర గ్యాలరీలు