Rohit Sharma: రోహిత్ శర్మ హీరో ఎంట్రీ.. హెలికాప్టర్‌లో వచ్చి ధర్మశాలలో దిగిన టీమిండియా కెప్టెన్-team india captain rohit sharma reaches dharmasala in helicopter india vs england 5th test cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రోహిత్ శర్మ హీరో ఎంట్రీ.. హెలికాప్టర్‌లో వచ్చి ధర్మశాలలో దిగిన టీమిండియా కెప్టెన్

Rohit Sharma: రోహిత్ శర్మ హీరో ఎంట్రీ.. హెలికాప్టర్‌లో వచ్చి ధర్మశాలలో దిగిన టీమిండియా కెప్టెన్

Hari Prasad S HT Telugu
Mar 05, 2024 04:25 PM IST

Rohit Sharma: ఇంగ్లండ్ తో చివరి టెస్టు కోసం ధర్మశాలలో హీరో ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్న వీడియో వైరల్ అవుతోంది.

ధర్మశాలలో హెలికాప్టర్ దిగి వస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ధర్మశాలలో హెలికాప్టర్ దిగి వస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma: ఇంగ్లండ్ తో నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత 9 రోజుల బ్రేక్ ఎంజాయ్ చేసిన టీమిండియా మంగళవారం (మార్చి 5) నుంచి ధర్మశాలలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. చివరి టెస్ట్ కోసం ముందే టీమ్ అంతా ఇక్కడికి చేరుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం మంగళవారమే వచ్చారు. అయితే రోహిత్ మాత్రం హెలికాప్టర్ లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

yearly horoscope entry point

హెలికాప్టర్‌లో రోహిత్ శర్మ

గురువారం (మార్చి 7) నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఆదివారమే (మార్చి 3) రెండు జట్ల ప్లేయర్స్ ధర్మశాల చేరుకున్నారు. అయితే రోహిత్ మాత్రం జట్టుతో కనిపించలేదు. అయితే మంగళవారం రోహిత్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం అతడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరై రావడం విశేషం.

అది కూడా హెలికాప్టర్ లో కావడంతో అతన్ని చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. రోహిత్ చాపర్ నుంచి దిగి కారు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది. నిజానికి మంగళవారం (మార్చి 5) మధ్యాహ్నం 12.30 గంటలకు టీమిండియా ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ షెడ్యూల్ చేశారు. అయితే రోహిత్ ఈ సెషన్ కు హాజరు కాలేదు. బుధవారం మాత్రం టీమ్ మొత్తం ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్

ఇంగ్లండ్ పై నాలుగో టెస్ట్ విజయంతోపాటు ఆస్ట్రేలియా చేతుల్లో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. అయితే ఈ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. ఈ టెస్టు తర్వాత ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ కోసం వెళ్తారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉంటుంది.

దీంతో సుమారు నాలుగు నెలల పాటు ఇండియా మరో టెస్ట్ మ్యాచ్ ఆడదు. అందుకే విజయంతో సిరీస్ ను ఘనంగా ముగించడంతోపాటు డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో స్థానం కూడా పదిలమవుతుంది. ఈ సైకిల్లో ఇండియా 8 మ్యాచ్ ల ద్వారా 62 పాయింట్లు, 64.58 పర్సెంటేజ్ తో టాప్ లో ఉంది. ఒకవేళ ఇంగ్లండ్ చేతుల్లో చివరి టెస్టులో ఓడి.. అటు న్యూజిలాండ్ పై రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా గెలిస్తే టీమిండియా తొలి స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

అశ్విన్ 100వ టెస్ట్

మరోవైపు ధర్మశాల టెస్టు టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కు కెరీర్లో 100వ టెస్ట్ కానుంది.ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ మైల్ స్టోన్ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

ఈ మధ్యే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న అశ్విన్.. ఇప్పుడు ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరగనున్న ఐదో టెస్టుతో వందో టెస్ట్ మైలురాయిని అందుకోనున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 14వ భారత ప్లేయర్ గా అశ్విన్ నిలవనున్నాడు. అటు ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ స్టోకి కూడా ఇది 100వ టెస్ట్ కానుంది.

Whats_app_banner